- ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్, మిజోరాంలో హంగ్
- తెలంగాణలో 15 ఎగ్జిట్ పోల్ సర్వేల్లో 9 కాంగ్రెస్‌కు అనుకూలం
- రెండింటిలోనే భారాస ముందంజ, స్పష్టతనివ్వని 4 సర్వేలు
- మధ్యప్రదేశ్ లో 6 సర్వేల్లో 2 బీజేపీకి అనుకూలం, హంగ్ సూచించిన మరో నాలుగు
- గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ కు రెండు సర్వేల్లో ఆధిక్యత
- భాజపా ఒడిలోకి రానున్న రాజస్థాన్
- అధికార కాంగ్రెస్ వైపు మరోసారి మొగ్గనున్న ఛత్తీస్ ఘడ్
అమరావతి : శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన 5 రాష్ట్రాల్లో డిసెంబర్ 3న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలను సూచించే దిశగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వివిధ టీవీ మీడియా ఛానళ్లు, సంస్థలు నిన్న సాయంత్రం వెల్లడిరచాయి.
వాటి అంచనాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ వైపు మొగ్గినట్లు వెల్లడైంది. అక్కడ జరిగిన పోలింగ్ సరళిపై జరిగిన మొత్తం 15 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 9 కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. కేవలం రెండిరటిలోనే అధికార భారతీయ రాష్ట్ర సమితి (భారాస) ఆధిక్యతను కనబరచింది. 4 సర్వేలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని సూచించాయి.
తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు?
వివిధ సంస్థల సర్వేల ప్రకారం 119 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్ కనిష్టంగా 34 నుండి 79 స్థానాల వరకు సాధించవచ్చని, అధికార భారాస 22 నుంచి 68 సీట్లు గెలవవచ్చని వెల్లడైంది. తెలంగాణలో గట్టి పోటీ ఇవ్వాలనుకున్న భారతీయ జనతా పార్టీ 2 నుంచి 13 స్థానాలు, ఎంఐఎం 5 నుంచి 9 స్థానాలు గెలుచుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచాయి.
డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం?
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడు తూ ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటౌతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల చైతన్యంపై తమకు నమ్మకం ఉందని, పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని, ప్రభుత్వం ఏర్పాటు విషయం లో కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్ అని అంటున్న మంత్రి కేటీఆర్ అవి నిజమైతే క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు.
ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా రావటం ఇది తొలిసారి కాదని, 70కి పైగా స్థానాలతో భారాస అధి కారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించా రు. 2018లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందని పలు ఎగ్జిట్ పోల్స్ సూచించాయని, ఒకటి మాత్రమే తమకు అను కూలంగా వచ్చిందని ఆయన అన్నారు.
హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎవరికి మద్దతు ఇవ్వాలో భాజపా అధిష్టానం నిర్ణయిస్తుందని రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.
మధ్యప్రదేశ్
230 సీట్లతో కూడిన మధ్యప్రదేశ్ శాసనసభలో 2 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కనిష్టంగా 118 నుండి 151 సీట్లతో భాజపా మరలా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని మరో 4 ఫలితాలు సూచించాయి. మొత్తం 6 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు భాజపా కనిష్టంగా 95 స్థానాలు గెలవవచ్చు. సర్వే సూత్రాల ప్రకారం ఆమోదించబడే తప్పొప్పుల మేరకు హంగ్ ను సూచించిన 4 ఫలితాల్లో కాంగ్రెస్ గరిష్టంగా 121 సీట్లు గెలవవచ్చు. నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ మేరకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సాధించనున్న కనీస సీట్లు 74. నాలుగు ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అవకాశాన్ని సూచించటంతో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినట్లు వెల్లడౌతోంది.
రాజస్థాన్
200 సీట్లు కలిగిన రాజస్థాన్ శాసనసభలో 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3 ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిర్వహించబడగా.. రెండు సర్వేల్లో ప్రతిపక్ష భాజపా స్పష్టమైన మెజార్టీ పొందే దిశలో ఉండగా ఒక సర్వే మాత్రం హంగ్ అసెంబ్లీ సంభావనను సూచించింది. భాజపా వంద నుంచి 128స్థానాలు గెలవవచ్చని ఎగ్జి ట్‌పోల్స్‌సూచించాయి.ఒకసర్వే మాత్రం భాజపా 100- 110 స్థానాలు, అధికార కాంగ్రెస్ 90-100 సీట్లు గెల వవచ్చని సూచించింది. దాదాపు 13మంది స్వతంత్య్ర అభ్యర్థులు గెలవవచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
ఛత్తీస్ ఘడ్
90 స్థానాలున్న ఈ రాష్ట్ర శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ మరలా పాగా వేయొచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. మొత్తం 8 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లభించగా అందులో 6 కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని రెండు సర్వేలు సంకేతాలిచ్చాయి. అధికార కాంగ్రెస్ 42 నుంచి 64 సీట్లు గెలిచే అవకాశం ఉండగా, ప్రతిపక్ష బీజేపీ 29 నుండి 48 సీట్లకే పరిమితం కావచ్చు.
మిజోరాం
40 స్థానాలున్న మిజోరాం శాసనసభలో ప్రతిష్టంభన ఏర్పడవచ్చని 2 ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ 10 నుంచి 14 స్థానాలు, జడ్పీయం 10 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్ 5 నుంచి 10, బీజేపీ 2 స్థానాల వరకు గెలవవచ్చని అవి తెలిపాయి.