- రాష్ట్రానికి పట్టిన ఖర్మ జగన్ రెడ్డి
- జగనోరా వైరస్ కి టిడిపియే వ్యాక్సిన్
- కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
- వైసిపి మోసాన్ని సీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తెలుసుకోవాలి
- ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో నారా లోకేష్
మంగళగిరి : ఒక ఎమ్మెల్యే సోదరుడు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడు, మేం బెదిరింపులకు భయపడే రకం కాదని వారు తెలుసుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొ న్నారు. తాడేపల్లి సీతానగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేష్ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివేకా హత్యతో మాకు సంబంధం లేదని తిరుపతిలో ప్రమా ణం చేశా, వైసిపినేతలు ప్రమాణం చేయకుండా పారి పోయారు. దీంతో హంతకులెవరో తేలిపోయిందన్నా రు. కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో భాగం గా గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుం టున్నాం, టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ వదిలించాలంటే టిడిపి వ్యాక్సిన్ వేయాల్సిందే నని చెప్పారు.
విశాఖప్రజలు ఆలోచించాలి
జగన్‌రెడ్డి విధ్వంస పాలన చూసి కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉన్నవి తరలిపోతున్నాయి. అసెంబ్లీలో అమరావతికి తమ విధానం అనుకూలమని చెప్పి మోసం చేసి మూడు ముక్కలాటకి తెరతీసిన జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెద్దల భూకబ్జాలు చూసిన తరువాతైనా విశాఖ ప్రజ లు ఆలోచించాలని కోరారు.
అమరావతిలోనే హై కోర్టు వుంటుందని జగన్‌రెడ్డి న్యాయవాది సుప్రీం కోర్టుకి తెలిపారని, న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను కూడా మోస గించిన జగన్ నిజస్వరూపం బట్టబయలైందన్నారు. సీతానగరం ప్రాంతంలో ఇళ్లపట్టాల సమస్యని తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏఊరు వెళ్లినా, ఏ వీధిలో పర్య టించినా.. ప్రజలు ఇదేం పాలన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని బాధపడుతున్నా రని..ఇంతటి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీ సర్కారు త్వరలోనే దిగిపోక తప్పదని లోకేష్ పేర్కొన్నారు.