మంగళగిరి (చైతన్యరథం), నవంబర్ 23: తండ్రికి రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడిని, శివకుమార్ పెట్టిన పార్టీని కబ్జాచేసిన వాడిని, బాబాయిని గొడ్డలిపోటుతో వేసేసిన వాడిని జగన్ రెడ్డి అంటారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలకు లోకేష్ ఘాటుగా బదులిచ్చారు. సొంత చెల్లిని, తల్లిని ఇంట్లోంచి గెంటేసినోడ్ని జగన్ రెడ్డి అంటాం… లక్ష కోట్లు మింగి 16 నెలలు చిప్పకూడు తిన్నవాడిని రాక్షసుడు జగన్ రెడ్డి అంటాం… జగన్ రెడ్డితో పాటు రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఆ నలుగురు రెడ్లు, వారికి మద్దతు పలుకుతున్న బ్లూ మీడియాను దండుపాళ్యం బ్యాచ్ అంటామని లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా లోకేష్ పర్యటించారు.