- అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం
- మంగళగిరిలో దక్షిణభారత దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌క్లస్టర్ ఏర్పాటు చేస్తా
- ఎప్పుడూ అందుబాటులో ఉంటా… ఒక్క మెసేజ్‌తో స్పందిస్తా
- బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత హామీ
మంగళగిరి: అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీ, మంజీరా అపార్ట్‌మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే కార్యక్రమంతో యువనేత ఎన్నికల ప్రచారానికి శ్రీకా రం చుట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2014లో చంద్రబాబునాయుడు సున్నాతో పాలన ప్రారంభించారని, గత అయిదేళ్లలో జగన్ విధ్వంస పాలన కారణంగా 30ఏళ్లు వెనక్కివెళ్లిందని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళిక తమ వద్ద ఉందని తెలిపారు. పరిశ్రమలు రప్పించడం ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం రెట్టింపు అవుతుందని, చంద్రబాబు ఆలోచ నల మేరకు 20లక్షలు ఉద్యోగాలు కల్పించడం ద్వారా రెండున్నర రెట్లు పెరుగుతుందని చెప్పారు. ఆదాయం పెంపుదల ద్వారా ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందని తెలి పారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్యా వంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంద న్నారు. జగన్ మూడు ముక్కలాటతో తీవ్రంగా నష్ట పోయామని అటు విశాఖ, ఇటు అమరావతి, కర్నూలు ఏదీ అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయన్నారు.
ఒకేరాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం
పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి విధానమన్నారు. గతఅయిదేళ్లుగా ప్రజారాజధాని అమ రావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తామన్నారు. వచ్చే 10ఏళ్లలో సమర్థ మైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగ లమన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక పోగా.. ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు. చంద్రబాబు మొదలుపెట్టిన పనులు కొనసాగించి ఉంటే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవివని, రెండు నెలలు ఓపిక పడితే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని భరోసా ఇచ్చారు.
అసమర్థ ఎమ్మెల్యే వల్లే అభివృద్ధి శూన్యం
సమర్థుడైన శాసనసభ్యుడి లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్నా గత పదేళ్లుగా మంగళగిరి ఎటు వంటి అభివృద్ధికి నోచుకోలేదు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రూ.2వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. టీడీపీ ప్రభు త్వం ఖర్చుచేసిన నిధుల్లో 10శాతం కూడా ఖర్చుపెట్ట లేదు. కృష్ణానది పక్కనే ఉన్నా నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగునీరు అందించలేకపోయారు. టీడీపీ హయాంలో మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకు వచ్చాం. ఏపీఐఐసీ ద్వారా వివిధ పరిశ్రమలకు భూము లు కూడా కేటాయించడం జరిగింది. ఆ పనులను ముందుకు తీసుకెళ్లలేదు. నేను మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ నాలుగేళ్ల పది నెలల నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నా. సొంత నిధులతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టా. మంగళగిరిలో చేనేత వృత్తిని నమ్ముకున్న వారి కోసం పలు కార్యక్రమాలు చేపట్టాం. స్వర్ణకారుల కోసం కూడా వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేశాం.
లోకేష్ మంగళగిరి అభ్యర్థి కావడం అదృష్టం
గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… ‘నేను అమెరికా వెళ్లి 24 సంవత్సరాలు అయింది. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే తర్వలోనే అమెరికాను మించిపోయేలా ఉంది. ఇక్కడ మిడ్ వాలీ సిటీ లాంటి అపార్ట్ మెంట్ లు చూస్తున్నప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు ఏవిధంగా పెరిగాయో అర్థమవుతోంది. 2019లో టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఉండేవి.
రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వచ్చే 10 ఏళ్లు మంగళగిరి అభివృద్ధి పథంతో దూసుకెళ్తుంది. లోకేష్ పోటీచేస్తుండటం ఇక్కడి ప్రజల అదృష్టం. లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి. ఇప్పటికే గెలుపు ఖాయమైంది. రాబోయే 20ఏళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎన్‌ఆర్‌ఐలు కూడా తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. నన్ను, లోకేష్ ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించాలి’ అని చంద్రశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మంగళగిరిలో దక్షిణభారత దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌కస్టర్ ఏర్పాటు చేస్తా
తానుఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరి ప్రజ లంతా గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక తాను ఉండవల్లిలో అందుబాటులో ఉంటా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక్క మెసేజ్‌తో స్పందిస్తాననిచెప్పారు.లోకేష్ మాట్లా డుతూ ‘మంగళగిరిలో పెద్దసంఖ్యలో ఉన్న స్వర్ణకా రులు ఉన్నారు.ప్రజాప్రభుత్వం వచ్చాక దక్షిణభారత దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌క్లస్టర్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మంగళ గిరిని రిక్రియేషన్ సెంటర్‌గా మార్చేందుకు అవసరమైన మౌలిక సదు పాయాలు కల్పిస్తాం. మంగళగిరిని ఐటీ హబ్‌గా మారుస్తాం. గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరి స్తాం. అంతర్జాతీయ సర్వీసులను అందుబాటు లోకి తీసుకువస్తాం. గతంలో స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయాను. ఎన్నికల తర్వాత పెమ్మసాని చంద్ర శేఖర్,నేను డబుల్ ఇంజిన్ తరహాలో వేగవంతంగా అభివృద్ధిచేస్తాం. నియోజకవర్గం లో ప్రధా న నీటి సమస్య ఉంది. టీడీపీ హయాంలో తాగునీటి కోసం పైప్‌లైన్ నిర్మాణపనులు ప్రారంభి స్తే వైసీపీ వచ్చిన తర్వాత నిలిపివేశారు. రెండు నెలలు ఓపిక పట్టండి.. ఏడాదిలో మంగళగిరి పరిధిలోని అన్ని ప్రాం తాలకు కృష్ణానది నుంచి తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. మంజీరా అపార్ట్ మెంటు పక్కన ఉన్న వాగుకు లైనింగ్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యను పరిష్కరిస్తాం.
ప్రతిపక్షనేతలను తిట్టేవారికే వైసిపి టిక్కెట్లు!
భావప్రకటన స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం కాలరా సిందన్నారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడిరచిన మహిళలపై పేటిఎం బ్యాచ్ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నా.. వారిపై ఎలాంటి చర్యలు లేవ న్నారు.తన తల్లిని కూడా అవమానించారన్నారు. మహి ళలను గౌరవించే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తామన్నారు. చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా నారాయణస్వామి అసభ్య పదజాలంతో అవమానిస్తే ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదదన్నారు. పైగా ప్రతిపక్షనేతలను బాగా తిడితేనే టిక్కెట్లు ఇస్తామని జగన్ నిస్సిగ్గుగా ఆ పార్టీవారికి చెబుతున్నారన్నారు. ఇటువంటి వారికి ఓటుతోనే ప్రజలు బుద్దిచెప్పాల్సి ఉం దన్నారు. వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం చేశారని, ఇవాళ ఆయన సొంత కూతురే వివేకాను ఎవరు చంపారో వెల్లడిరచారని చెప్పారు.