- సైకో ఐదేళ్ల హయాంలో ఏ వర్గమూ బాగుపడలేదు
- ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు దేవుడినీ మోసగించారు
- అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు పాతిపెట్టారు
- రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు తపన ఆదర్శనీయం
- పక్క రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా మెచ్చుకుంటోంది
- వైసీపీ నేతలు దమ్ముంటే ఏ ప్రభుత్వం మంచిదో అడగాలి
- ప్రజలు చెప్పే సమాధానంతో రాష్ట్రం విడిచి పారిపోకతప్పదు
- జగన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనకు, నేటి కూటమి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాల యంలో బుధవారం విలేకరుల సమావేశంలో గత ప్రభుత్వ అరాచకాలను ఎత్తిచూపుతూ… కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. జగన్‌రెడ్డి నీచ పాలన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు దేవుడిని కూడా మోసం చేసిన సైకో పాలనను ప్రజలే పాతిపె ట్టారని వ్యాఖ్యానించారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలే చెబుతున్నారు..మళ్లీ ఎన్నికల్లో ఈ ప్రభు త్వమే కావాలి అనేలా కూటమి పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ వర్గం కూడా బాగుపడలేదు. ప్రజాస్వామ్యంలో ఏ అవలక్షణాలు ఉండకూడదని అనుకుంటామో అటువం టి అవలక్షణాలు జగన్‌రెడ్డికి ఉన్నాయి. దుర్మార్గాలు, దోపిడీలు, అరాచకాలతో ప్రజాస్వా మ్యాన్ని నాశనం చేసి వెళ్లాడని ధ్వజమెత్తారు.
కూటమి 100 రోజుల పాలనకు ప్రశంసలు
చంద్రబాబు సూపర్‌సిక్స్ హామీలను చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేస్తున్నారని ప్రశంసించారు. పెంచిన పింఛన్‌తో పాటు పాత బకాయిలను కలిపి ఇచ్చారు. అన్న క్యాంటీన్‌లను తిరిగి ప్రారంభించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేసి జగన్ భూ దోపిడీ కుట్రను అడ్డుకున్నారు. రైతులకు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇస్తున్నాం. మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం పెట్టి నిరుద్యోగులకు భరోసా కల్పించారు. స్కిల్ సెన్సెస్‌ను చేపట్టారు. కేంద్రం కూడా యువతలో నైపుణ్యతను పెంచేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది. దేశంలో మొట్టమొదటిసారి స్కిల్ సెన్సెస్‌తో పాటు స్కిల్ యూనివ ర్సిటీని మనమే ప్రారంభిస్తున్నాం. రైతులకు రైతు భరోసాను పెంచాం. కౌలు రైతులకు కూడా దాన్ని అందిస్తాం. మహిళలకు డ్వాక్రా రుణాలను గత వైసీపీ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి మూడు లక్షలకు తగ్గిస్తే తిరిగి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, పింఛన్‌దారుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం పరితపించే పార్టీ పాలనలో ఉంది కనుకనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలే అంటున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను త్వరలో ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్రం, పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయి. రాష్ట్రానికి కేంద్రం సాయం చేసేందుకు ముందుకు వస్తోందని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ బకాయిలు నేడు కట్టాల్సి వస్తోంది
జగన్‌రెడ్డి దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బాకీలను నేడు కట్టాల్సి వస్తోంది. నాడు టీడీపీ ఇవ్వాల్సిన బకాయిలు మేము ఎందుకు ఇస్తామని వైసీపీ వాటిని కట్టలేదు. కానీ మాది మంచి ప్రభుత్వం కనుకే కడుతున్నాం. ఉత్తుత్తి బటన్‌లు నొక్కి సాక్షిలో యాడ్‌లు ఇచ్చారే కాని చేసిన మేలు లేదు. రైతులకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే.. ఈ ప్రభుత్వం దాదాపు రూ.700 కోట్లు కట్టింది. రూ.3 వేల కోట్లు బాకీ పెట్టి దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో నేడు ప్రతిరోజూ గ్రీవెన్స్‌కు పిల్లలు వస్తున్నారు. వైద్య విద్యలో గత ప్రభుత్వం చేసిన మోసం దేశంలో ఎవరూ చేయలేదు. రూ. 2500 కోట్లు బాకీ పెట్టారు. సేవలు ఆపేస్తామని ఆసుపత్రులు నోటిసులు ఇస్తే రూ. 500 కోట్లు కట్టి ఎన్నికలకు వెళ్లారు. నేడు ప్రభుత్వం వచ్చాక రూ.700 కోట్లు కట్టి ఆసుపత్రుల యజమాన్యాలను పిలిపించి బాకీలు చెల్లిస్తామని చెప్పి ప్రజలకు వైద్యం చేయమని చెబితే ఆరోగ్య శ్రీపై వైద్యం చేయడానికి ఆసుపత్రులు ముందుకు వచ్చాయి. గతంలో మేము సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులు ఇస్తే.. వాటిని తిరస్కరించిన నీచ ప్రభుత్వం వైసీపీ. అందుకే ప్రజలు ఆ దుర్మార్గపు ప్రభుత్వం, దుర్మార్గపు వ్యక్తిని వద్దనుకుని పాతిపెట్టారని ధ్వజమెత్తారు.
ఉచిత ఇసుక, పారదర్శకంగా లిక్కర్ పాలసీ
ఎన్‌జీటీ గైడ్‌లైన్స్ ఉన్నందున నదుల్లో ఇసుక తవ్వకాలకు కాస్త అడ్డంకిగా ఉంది. అక్టోబరు 15 తరువాత రాష్ట్రంలో ఇసుక కష్టాలు పోతాయి. గత ప్రభుత్వంలో లక్ష కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అందులో సగం అవినీతి జరిగింది. లిక్కర్ వ్యాపారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి దాదాపు రూ.25 వేల కోట్లను అప్పుగా తెచ్చారు. లిక్కర్ వ్యాపారం తాకట్టు పెట్టొచ్చన్న పాలసీని చూసి కేంద్రం కూడా ఆశ్చర్యపోయింది. దీనికి కేంద్రం అంగీకరించకపోయినా బుద్దిలేని బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. దామాషా పద్దతిలో ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చే 15 ఏళ్లు ఆ అప్పు కట్టాలి. అంతా డబ్బు రూపంలో తీసుకుని దండుకున్నారు. మేము పారదర్శకంగా లిక్కర్ పాలసీని తీసుకువచ్చి నాణ్యమైన లిక్కర్ తక్కువ ధరకే తీసుకొస్తున్నాం.
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు
పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, మంత్రులు అహర్నిశలు శ్రమి స్తున్నారు. శ్రీసిటీ, కడపలో ప్రాజెక్టులు రావడంతో 90 వేల ఉద్యోగాలు రానున్నాయి. హెచ్‌పీసీఎల్ వారు రూ.70 వేల కోట్లతో కోస్టల్ కారిడార్‌లో రిఫైనరీ కట్టడానికి ముందుకు వచ్చారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలను వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్ని స్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఐదేళ్లలో 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించేందు కు టీడీపీ, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది.. నాలుగు పోస్టులకు 600 మంది దరఖాస్తు చేస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా చిన్నచిన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. వచ్చే కంపెనీలకు అవసరమయ్యే వర్కర్లకు ప్రభుత్వమే నైపుణ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటుంది.
చంద్రబాబు కృషి అనిర్వచనీయం
అమ్మఒడి, రైతు భరోసా లబ్ధిదారులకు గత ప్రభుత్వం మోసం చేసింది. కేంద్రం ఇచ్చే వాటా తప్ప రాష్ట్రం నుంచి ఎటువంటి మేలు జరగలేదు. కౌలు రైతులకు సాయం చేయ లేదు. విదేశీ విద్యలో రూ.65 కోట్ల బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. గత ప్రభుత్వం విస్మరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌లకు బడ్జెట్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటే పాలకులు వందరోజుల్లో ఎంత కృషి చేసి ఉంటారో ప్రజలందరూ ఆలోచించాలి. చాలామంది కొత్త మంత్రులు ఉన్నారు.. అధికారులు సమ న్వయం కావాలి. ఈలోపే విజయవాడలో వరదలతో అపార నష్టం నరిగింది. చంద్రబాబు రేయింబవళ్లు అక్కడే ఉండి శ్రమించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులందరికీి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. నేడు బాధితులకు దాదాపు రూ.1000 కోట్ల పరిహారం ఇస్తున్నాం. వరదల వల్ల మొత్తం రూ.8000 కోట్లు నష్టం వాటిళ్లింది. ఈ వెయ్యి కోట్లు వరదల వల్ల నష్టపోకుంటే ప్రజల కోసం మరో రకంగా ఉపయోగపడేవి. 74 ఏళ్ల వయసు లో ప్రజల కోసం నభూతో న భవిష్యత్ అనేలా చంద్రబాబు చేసిన కృషి అనిర్వచనీయం. ఏపీలో చదువుకునే పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఆ విధంగా విద్యావిధానాలు తీసుకొస్తున్నారు.
వరద బాధితుల కోసం జగన్‌రెడ్డి ఏం చేశారు?
అటు సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. వైద్యం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుబెట్టకుండా ప్రతి ఇంటికి రూ.25 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించేలా స్కీమ్‌ను రూపొందిస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కడుతుంది. దీంతో ఉత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు విజన్‌లో భాగంగా ఈ స్కీమ్‌లు అమలై మళ్లీ 2029 నాటికి ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి, విజయవాడ మేయర్ లు వరద బాధితుల కోసం ఏం చేశారు? వారానికి ఒకసారి బెంగళూరు వెళ్లి రావడం తప్ప? వైసీపీ నేతల అవినీతి చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇసుక, భూములు, తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాలు ఇలా అన్నీ వస్తాయి.
ఏ ప్రభుత్వం బాగుందో అడిగే దమ్ముందా?
వైసీపీ నేతలకు దమ్ముంటే మేము పెట్టిన సభకు వెళ్లి ఏ ప్రభుత్వం బాగుందో అడగాలి. ప్రజల స్పందన చూసి తరువాత వైసీపీ నేతలు ఏపీలో ఉండలేరు. జగన్ వల్ల లాభపడిన వర్గం ఏదీ లేదు..అందరూ నష్టపోయారు. ఇంత మోసం చేసి సంపాదించిన సొమ్ము ఏం చేసుకుంటాడో ఎవరికీ తెలియడం లేదు. అందుకే ఆయనను చూసి సైకో జగన్ అంటున్నా రు. సైకో వదిలిపోయి రాష్ట్రం మంచివాళ్ల చేతిలో పడిరది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వ్యక్తి వికాసం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును అం దరూ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేటి యువతకు కావాల్సిన భరోసా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఎన్ని విపత్తులు వచ్చినా వాటిని సవాల్‌గా తీసుకుని కూటమి ప్రభు త్వం ముందుకు వెళుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుం ది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నాయకుల దేనని..అందుకు వారు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.