- మంచిస్థానంలో ఉంచుతాం
- పార్టీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): పొత్తులో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. అదేవిధంగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. పార్టీ నాయకులు మిత్రపక్ష పార్టీల నేతలతో సమన్వయంతో పనిచేయాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన నేతలను గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉంచుతామని హామీ ఇచ్చారు. త్వరలో జిల్లాలకు ఇన్ఛార్జిó మంత్రులను కూడా నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.