చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకుంటాం

జలవనరుల మంత్రి నిమ్మల ఉద్ఘాటన

by చైతన్యరధం
Jul 11, 2024 at 6:26am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకుంటాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు నీరు విడుదల
  • సీఎం చంద్రబాబు నాయుడి దూరదృష్టికి నిలువుటద్దం పట్టిసీమ
  • నిర్లక్ష్యానికి గురైన తాగునీరు, సాగునీటి రంగాలకు జీవం పోసేందుకు చర్యలు
  • యుద్ధప్రాతిపదికన కాలువలు, డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపుడెక్క తొలగింపు

అమరావతి(చైతన్యరథం): జగన్‌ అసమర్థ, అరాచక పాలనలో ప్రాణాల్ని నిలుపుకునేందుకు అత్యవసరమైన తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి.. సద్వినియోగం చేసుకొని ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషిచేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ప్రకాశం బ్యారేజీ-కృష్ణా తూర్పు డెల్టా హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), జిల్లా కలెక్టర్‌ జీ సృజన, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, విజయవాడ సెంట్రల్‌, అవనిగడ్డ, పెడన, గన్నవరం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మండలి బుద్ధ ప్రసాద్‌, కాగిత కృష్ణ ప్రసాద్‌, యార్లగడ్డ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి, పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు.

అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సమర్థవంతమైన జల వనరుల నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున సంపద సృష్టించవచ్చని.. తద్వారా సమాజంలోని అన్ని వర్గాలూ లాభపడటమే కాకుండా ఆయా ప్రాంతాలతో పాటు, రాష్ట్రం మొత్తం సుభిక్షమవుతుందని పేర్కొన్నారు. ఉన్న ఆయకట్టును కాపాడుకుంటూ కొత్త ఆయకట్టు అభివృద్ధికి కృషిచేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని, రైతులను అభివృద్ధి పథంలో నడిపించొచ్చన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని.. దీంతో గోదావరి జలాలు, కృష్ణాకు చేరి దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు, 30-40 లక్షల మందికి తాగునీరు అందించేందుకు వీలవుతోందన్నారు. జగన్‌ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పట్టిసీమతో పాటు తాడిపూడి, పురోషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

పట్టిసీమ నుంచి 6,500 క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతోందని.. మరో 500-600 క్యూసెక్కుల తాడిపూడి నీరు కూడా దీనికి తోడవుతోందని వివరించారు. కృష్ణా డెల్లా కాలువలకు నీరు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని.. ఈ నీటిని తొలి ప్రాధాన్యంగా తాగునీటికి, తర్వాత ఖరీఫ్‌ నారుమళ్లకు ఉపయోగించుకోవాలని సూచించారు. తూర్పు డెల్టాలో ఎన్‌టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 7,38,000 ఎకరాలకు సాగునీరుతో పాటు 11 నియోజకవర్గాల పరిధిలో చెరువులను నింపి ప్రజల దాహార్తిని తీర్చేందుకు వీలవుతుందన్నారు. డెల్టా కాలువలు, డ్రెయిన్లలో పూడిక, గుర్రపు డెక్క, తూటికాడ వల్ల నీరు సరిగా ప్రవహించడం లేదని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్క, తూడు తీసే పనులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

సరైన నిర్వహణ లేక తీవ్ర నష్టం: మంత్రి కొలుసు
రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జగన్‌ పాలనలో సరైన నిర్వహణ లేక సాగునీటి రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని.. చిన్నపాటి వర్షాలకు పంట నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీటి కాలువలతో పాటు డ్రెయిన్లు చాలా ముఖ్యమని.. వీటిలో పూడిక తీయకపోవడం వల్ల కృష్ణా డెల్టా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. పెడన, అవనిగడ్డ, బందరు ప్రాంతాల రైతులు ఇబ్బందిపడ్డారన్నారు. మెట్టప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు ప్రాంతాలకు ప్రాణాధారమైన చింతలపూడి ఎత్తిపోతలకు గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తే.. గత ప్రభుత్వం రూ. 50 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. దాదాపు 2,80,000 ఎకరాలకు సాగునీరు అందించగలిగే సామర్థ్యమున్న చింతలపూడిని నిర్లక్ష్యం చేయడం వల్ల పంట భూములు బీళ్లుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంతలా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కాలువలకు నీరు విడుదల చేసే ముందు నిర్వహణ పనులు పూర్తిచేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

చివరి ఎకరాకూ సాగునీరు: మంత్రి కొల్లు
రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సాగునీరు మాట అటుంచి కృష్ణా డెల్టా ప్రజలు తాగునీటి సమస్యతో గొంతెండుతున్న పరిస్థితి ఎదురైందని.. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి, జలవనరుల శాఖ మంత్రికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతలను గతంలో హేళన చేస్తూ మాట్లాడారని.. నేడు ఆ పథకంతో ఎంత ప్రయోజనం జరుగుతుందో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. పులిచింతలలో 35 టీఎంసీల నీరు నిల్వచేసే అవకాశం ఉన్నా గత పాలకులు చేతకానితనంతో నేడు 0.5 టీఎంసీల నీరు కూడా లేకుండా తయారు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన నిర్వహణ పనులను పూర్తిచేసి చివరి ఎకరాకూ సాగునీరు అందించేందుకు కృషిచేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

కార్యక్రమంలో ఇరిగేషన్‌ సలహాదారులు ఎం.వెంకటేశ్వరరావు, ఇరిగేషన్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, ఎస్‌ఈ టీజేహెచ్‌ ప్రసాద్‌బాబు, కేసీ డివిజన్‌ ఈఈ పీఆర్‌ కృష్ణారావు, సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కగా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఇందులో రైవస్‌ కెనాల్‌కు 900 క్యూసెక్కులు, ఏలూరు కెనాల్‌కు 300 క్యూసెక్కులు, బందరు కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నట్లు ఇరిగేషన్‌ ఎస్‌ఈ టీజేహెచ్‌ ప్రసాద్‌ బాబు తెలిపారు.

Previous Post

ప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలు వీడని వైసీపీ

Next Post

ఏపీకి రిఫైనరీ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు
ఆంధ్రప్రదేశ్

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో..
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో..

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…
ఆంధ్రప్రదేశ్

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist