- గత ప్రభుత్వంలో రూ.13 వేల కోట్లు దారిమళ్లించారు
- జాబ్ కార్డులు తొలగించి పనులు లేకుండా చేశారు
- నరేగ నిధులను కూడా పక్కదారి పట్టించి దోచుకున్నారు
- నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
- పల్లె పండుగ వారోత్సవాలను విజయవంతం చేయాలి
- టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత
మంగళగిరి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వంలో గాడితప్పిన పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మం త్రి పీతల సుజాత తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోమవారం నుంచి వారంరోజుల పాటు రాష్ట్రంలో పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభమయ్యాయని, రూ.4500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. గత వైసీపీ పాలనలో పంచా యతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దాదాపు రూ.13 వేల కోట్ల పంచాయతీల నిధులను దారి మళ్లించి అభివృద్ధి పనులు చేయనివ్వ లేదన్నారు. సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఉత్సవ విగ్రహాల్లా మార్చి అవమానించారని మండిపడ్డారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో 45180 జాబ్ కార్డులను వైసీపీ ప్రభుత్వం తొలగించి 2 లక్షల మంది పేదలకు పనులు లేకుండా చేశారన్నారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.2 వేల కోట్లు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వాటిని విడుదల చేసిందని తెలిపారు. 2014`19 మధ్య టీడీపీ హయాంలో 27000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 22 వేల కిలోమీటర్లు బీటీ రోడ్లు వేయించిన ఘనత లోకేష్‌కు దక్కుతుందన్నారు. 27 లక్ష్లల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు..దాదాపు 6000 వరకు అంగన్‌వాడీ భవనాలు నిర్మిం చారు..ఇలా ఎన్నో అభివృద్ధి పనులను టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిందని వివరిం చారు. నరేగ నిధులను ఉపయోగించి గ్రామాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం నరేగ నిధులను పక్కదారి పట్టించి జేబులు నింపుకుంది..జలజీవన్ మిషన్‌ను నిర్వీర్యం చేసి అందులోనూ 100 కోట్ల కుంభకోణం చేశారు.. పేదలకు తాగు నీరు ఇచ్చే విషయంలో కూడా నిధులను దోచుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా చేసిన ఘనత వైసీపీదేనని ధ్వజమెత్తారు. నేడు కూటమి ప్రభుత్వంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారురోడ్లు నిర్మిం చాలని నిర్ణయించినట్టు తెలిపారు. 25000 గోకులాల నిర్మాణం, 10 వేల కాంటూర్ల ఏర్పా టుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పల్లె పండుగ వారోత్సవాలను విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు.