- వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడో చెప్పాలి?
- వేలాది ఎకరాలు కబ్జా చేసింది వాస్తవం కాదా?
- రాష్ట్ర ఖజానాను, ప్రకృతి సంపదను దోచేశారు
- వైసీపీ నేతలు 13.59 లక్షల ఎకరాలు ఆక్రమించారు
- తప్పులను అంగీకరించి భూములను అప్పగించాలి
- లేదంటే కబ్జాకోరుల కోరలు తీసే బాధ్యత ప్రభుత్వానిదే
- వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): సజ్జల దోచుకున్న ప్రైవేటు ఆస్తులు, ప్రభుత్వ సొమ్ము కూటమి ప్రభుత్వం కోరలు తీసి కక్కిస్తుందని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాపాలు నేడు ప్రజలకు శాపాలయ్యాయని, జగన్ పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయని మండిపడ్డారు. జగన్ అండ్ కో ప్రభుత్వ ఖజానాను, ప్రకృతి సంపదను అడ్డంగా దోచేచి అనేక పాపాలు చేశారని ధ్వజమె త్తా రు. రోజుకో భారతం బయటపడుతోంది. తేనెలొలుకు మాటలతో అటవీ భూముల ను తెగ దోచేసిన వ్యక్తి సజ్జల..సామాన్య జర్నలిస్టుగా వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో చెప్పగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు. కడప, అన్నమయ్య జిల్లాల్లో సజ్జల వేలాది ఎకరాల భూమి కబ్జా చేసింది వాస్తవం కాదా? మీడియా ముందు కబుర్లు చెప్పడం కాదు.. కోట్లకు పడగెత్తిన ఆయన ఎలా ఎదిగాడో తోటి జర్నలిస్టులకు ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని హితవుపలికారు. సీకే దిన్నెలో సర్వే నెంబర్ 1629లో 52 ఎకరాలు సజ్జల, అతని సోదరులు ఆక్రమించ లేదా? అని ప్రశ్నించా రు. ప్రభుత్వ సంపదను రక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
13.59 లక్షల ఎకరాలు కబ్జా చేశారు
జగన్ రెడ్డి పాలనలో గత ఐదేళ్లు రాష్ట్రం అంతా భూ భక్షకుల కబంధ హస్తాల లో ఊపిరాడక అల్లాడిపోయింది. జగన్‌రెడ్డి అండ్ కో భూ కబ్జాలతో ఆంధ్రప్రదేశ్‌ను అస్తవ్యస్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో గ్రామ సర్వీసు ఇనామ్ ల్యాండ్ 1,38,848 ఎకరాలు, చుక్కల భూములు 1,94, 232 ఎకరాలు, షరతుల గల పట్టా భూములు 33,441 ఎకరాలు కలిసి మొత్తం 13,59,806 ఎకరాలు గత వైసీపీ ప్రభుత్వం కబ్జా చేసింది. అందులో 4.21 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి… అంటే దాదాపు 45 శాతం భూములు కబ్జాకు గురయ్యాయంటే రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ఆలోచిస్తే మతిపోతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు …పోకాలం దాపురించి నప్పుడు చేసిన పాపాలే వెంటాడి సమూలంగా ప్రక్షాళన చేస్తాయన్నది అక్షర సత్యం.. అది సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జగమెరిగిన సత్యం.
కడప నుంచి నెల్లూరు వరకు రాష్ట్రమంతా కబ్జాలే
కడప నగర శివారులోని సీకేదిన్నె రెవెన్యూ పొలంలో చిత్తూరు- కర్నూలు జాతీ య రహదారిని ఆనుకుని ఉన్న భూములు, రాయచోటిలో గువ్వల చెరువు నుంచి ఘాట్ రోడ్డు వరకు భూములను సజ్జల ఆక్రమించారు. అంతేకాదు కడప వైసీపీ నేతలకు ఫామ్ హౌసలు ఉన్నాయి.. అక్కడే జగన్ బందిపోటు ముఠా అంతా రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారు. సీకే దిన్నె రెవెన్యూ పొలంలో సర్వే నం.1629లో ఉన్న 11,129 ఎకరాల్లో 52 ఎకరాలు సజ్జల, అతని సోదరులు ఆక్రమించారు. అంతేకా దు.. ఇక్కడ సజ్జల ఎస్టేట్‌కు సంబంధించి మొత్తం 206 ఎకరాల భూమి ఉంటే ఇందులో పట్టా భూమి 146.75 ఎకరాలు, ప్రభుత్వ భూమి 10.2 ఎకరాలు, డీకేటీ 5.14 ఎకరాలు, చుక్కలు భూమి 2.02 ఉంది. అటవీ భూమి 52 ఎకరాలను ఆక్రమించేశాడు. కబ్జా చేసిన అటవీ ప్రాంతంలో మామిడి, నేరేడే, టేకు ఇతర పం టలు సాగు చేస్తూ ఆక్రమసంపాదనకు తెరతీశాడు. ఆ కబ్జా చేసిన ప్రాంతాలకు కుటుంబసభ్యులే తప్ప బయట వ్యక్తులను అనుమతించడం అసాధ్యం.. అంటే ఏ విధంగా అటవీ సంపదలను కొల్లగొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సజ్జల అండ తోనే కోట్ల విలువైన అటవీ భూములను కొట్టేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకోని చోద్యం చూస్తుంది.
1993లో ప్రభుత్వం రాజానాయక్ భార్య బుక్కాదేవి పేరిట 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట 1.30 ఎకరాలను ఇస్తే వాటి రాజా నాయక్ నుంచి బలవంతంగా లాక్కుని సజ్జల తన ఎస్టేట్‌లో కలిపేసుకున్నాడు. రాజానాయక్ కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే ఏమి చేస్తావో చేసుకో అంటూ బెదిరించి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నెల్లూరు సెజ్ సమీపంలో 40 ఎకరాల స్థల దుర్వినియోగం లో సజ్జల భార్గవరెడ్డి, సెల్కాన్ సీఎండీ వై.గురు అసహజంగా పాల్గొన్నారని ఆరోప ణలు ఉన్నాయి. కుప్పం సమీపంలో గ్రానైట్ తవ్వకాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొ న్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సజ్జల జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రాజ్యంలో పాగా వేశాడు. రాష్ట్రంలో అవినీతికి తెరలేపారు. దీనికి శిక్ష పడక తప్పదు. సజ్జల ముక్కు నేలకు రాసి, తప్పును అంగీకరించి కొట్టేసిన భూములను తక్షణం అప్ప గించాలి. లేకుంటే ప్రజల పక్షాన ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కబ్జాకోరులను వదల దు. కోరలు తీసి ప్రభుత్వ సంపదను, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సంరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం కచ్చితంగా తీసుకుంటుంది. శిక్ష అనుభవించడానికి సజ్జల సిద్ధం గా ఉండాలి. దోచుకున్నది ప్రజానీకానికి, ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కోరారు.