ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది.
రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధి పై ఓపెన్ ఛాలెంజ్ నేను చర్చకు సిద్ధం ఇద్దరు ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు సిద్దామా? జగన్ పీకింది ఏంటో చెప్పే దమ్ముందా? అద్దంకిని అభివృద్ధి చేసింది టిడిపి. ప్రకాశం పులి గొట్టిపాటి రవి గారు రూ.2000 వేల కోట్లతో అద్దంకిని అభివృద్ధి చేసారు.
ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేసాం. సింగరకొండలో ఐటిఐ కాలేజ్, ఇండోర్ స్టేడియం నిర్మించాం. అద్దంకి ప్రజల దాహం తీర్చేందుకు 80 కోట్లతో శాశ్వత తాగునీటి పధకం ఏర్పాటు చేసాం. రైతులు పండించిన పంట దళారుల చేతికి వెళ్లకుండా రైతులే అమ్ముకునే విధంగా అన్న గారి సంత ఏర్పాటు చేసాం. రాష్ట్రంలోనే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది అద్దంకికే. సాగు నీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసాం. ఎస్సి, ఎస్టీ మత్స్యకారులకు 90 శాతం సబ్సిడీతో మోపిడ్ లు, ఆటోలు, వలలు అందజేశాం. నియోజకవర్గంలో ఎక్కువుగా ఎన్టీఆర్ జలసిరి బోర్లు వేయించాము. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత అద్దంకి పరిస్థితి ఏంటి? అద్దంకి ప్రజలంటే జగన్ కి కోపం అందుకే అద్దంకి ని అనాధ గా వదిలేసాడు.
పెద్ద సైకో ని చూసి పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. అద్దంకిని అడ్డగోలుగా దోచుకున్నారు. పిల్ల సైకోల ఇసుక దోపిడీ ఏ రేంజ్ లో ఉందో తెలుసా గుండ్లకమ్మ డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి ఏడాది అయ్యింది. గేట్లు బిగిస్తే ఇసుక దోపిడీ సాధ్యం కాదని గేట్లు పెట్టడం లేదు. పిల్ల సైకోల కక్కుర్తి వలన గుండ్లకమ్మ నదిపై ఆధారపడిన 13 గ్రామాల మత్స్యకారులు రోడ్డున పడ్డారు. సెంటు స్థలాల్లో భారీ స్కాం చేసారు పిల్ల సైకోలు. ఎకరం రూ. 10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.27 లక్షలకు అమ్మేసారు. చేపల చెరువులు మొత్తం పిల్ల సైకోలు కబ్జా చేసారు రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదు పిల్ల సైకోలు. కస్యపురం గ్రామంలో శివారెడ్డి రైస్ మిల్లు ద్వారా వందల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు.
దేవుడ్ని కూడా వదలలేదు సింగరకొండ పుణ్యక్షేత్రంలో కాంట్రాక్టు పోస్టుల దగ్గర నుండి, షిఫ్ట్ ఆపరేటర్, వాచ్మెన్, అంగన్వాడీ పోస్టుల వరకూ ప్రతి ఉద్యోగానికి ఒక రేటు పెట్టి అమ్మేస్తున్నారు పిల్ల సైకోలు. గ్రానైట్ యజమానులను బెదిరించి లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు పిల్ల సైకోలు. మల్లాయపాలెంలో ఎస్టీలు నివసిస్తున్న 15 ఎకరాల్లో గ్రానైట్ ఉండటంతో వారిని ఖాళీ చేయించి 15 ఎకరాలు కబ్జా చేసారు ఈ పిల్ల సైకోలు. భూకబ్జాలకు లెక్కేలేదు, వెంచర్ వెయ్యాలంటే వైసిపి పిల్ల సైకోలకు కప్పం కట్టాల్సిందే.
జగన్ పనైపోయింది. 2024 లో గెలిచేది టిడిపి నే. అద్దంకి లో భారీ మెజారిటీ తో మన పులి రవి గారిని గెలిపించండి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దంకి ని ప్రకాశం జిల్లాలో కలుపుతాం. వైవి సుబ్బారెడ్డి గారి తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన పోలిరెడ్డి కోరిశపాడు లిఫ్ట్ ప్రాజెక్ట్ జగన్ పూర్తి చెయ్యలేదు. టిడిపి గెలిచిన వెంటనే పూర్తి చేస్తాం. ఆపేసిన భవనాశి రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం అని నారా లోకేష్ అన్నాడు.