- అమరావతి రైతులకు అండగా నిలుద్దాం
- టిడిపి సీనియర్ నేతల నిర్ణయం
అమరావతి : పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత కొద్దిరోజులుగా మూడురాజధానుల పేరుతో ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఆయన పరివారం ఆడుతున్న కపటనాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని తెలుగు దేశం పార్టీ ముఖ్యనేతలు నిర్ణయించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కిమి డి కళావెంకట్రావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనంద్‌బాబు, పర్చూరి అశోక్‌బాబు, పంతగాని నరసింహప్రసాద్ తదితరులు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అమరావతి రై తుల పాదయాత్రపై జగన్ అండ్ కో విషంగక్కుతున్న తీరును ముఖ్యనేతలు తీవ్రంగా ఖండిరచారు. గత మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో ఏ అభివృద్ధి కార్యక్రమంపైనా కనీసం నాలుగు ఇటుకలు పెట్టని జగన్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రకు ఎవరి హయాంలో మేలు జరిగిందో వివరంగా చెప్పేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముం దుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సమావేశం అభి ప్రాయపడిరది. విశాఖలో 40నెలల్లో జగన్ అండ్ కో 40వేలకోట్లకు పైగా చేసిన దోపిడీ, దసపల్లా భూము ల కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్రను జనం లోకి తీసుకెళ్లాలని ముఖ్యనేతలు నిర్ణయించారు. అమరావతి నుంచి అరసవల్లివరకు రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు అండగా నిలవాలని, బెదిరింపులకు దిగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు దీటుగా బదులి వ్వాలని సీనియర్ నేతలు నిర్ణయించారు.