.కుప్పంలో టిడిపి కార్యకర్త ముఖేష్ రణన్నినాదం!
.చిద్విలాసంగా జైలుకెళ్లిన కుప్పం హీరోలు
.పార్టీ అండగా ఉంటుందని అధినేత అభయం
కుప్పం : ఆకలిగొన్న పేదవాడి పొట్టనింపేందుకు కుప్పంలో తెలుగుదేశం పార్ధీ అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ రెండురోజుల క్రితం వైసిపి పేటిఎం బ్యాచ్ ధ్వంసం చేసింది. అయినా చంద్రబాబునాయుడు ఉక్కు సంకల్పం ముందు వైసిపి ముష్కరుల కుట్రలేమీ పనిచేయలేదు. ఎక్కడైతే వైసిపి విధ్వంసానికి పాల్పడిరదో అదేచోట చంద్రబాబునాయుడు చేతులమీదుగా అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. ప్రతిరోజూ వందలాది మంది ఆపన్నుల ఆకలి తీరుస్తూ ప్రజాదరణ పొందుతోంది. డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్ తెలియని జె-గ్యాంగ్ కుప్పలో టిడిపి కేడర్ మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతోంది. ఈ క్రమంలో కుప్పంకు చెందిన టిడిపి కార్యకర్త ముఖేష్ (అప్పు)ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో పిడికిలి బిగించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ కు స్పూర్తిదాయకం. ‘‘చంద్రబాబునాయుడు కోసం నూరుకేసులు ఎదుర్కొంటా.. వంద సార్లయినా జైలుకెళ్తా’’ నంటూ ముఖేష్ చేసిన సింహగర్జన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60లక్షలమంది పసుపు సైన్యానికి ప్రేరణ. పేటిఎం బ్యాచ్ కు, గూండా పాలకులకు, రౌడీ పోలీసులకు సగటు తెలుగుదేశం కార్యకర్త కూడా బెదరడన్న సంకేతమిస్తూ తమ గళాన్ని విన్పించిన ముఖేష్ తెలుగుదేశం పార్టీ అభినందనలు తెలుపుతోంది.
కుప్పం ఘటనలో ఆరుగురికి రిమాండ్
చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కుప్పంలో విధ్వంసం సృష్టించిన వైసిపి రౌడీమూకలు, పేటిఎం బ్యాచ్ ను వదిలి 60మంది టిడిపి నాయకులు, కార్యకర్తలపై ఆరు ఎఫ్‌ఐఆర్ లు నమోదుచేశారు. శాసనమండలి సభ్యులు గౌనివాని శ్రీనివాసులు, ముని స్వామి, మంజు, మునెప్ప, అప్పు, సుబ్రహ్మణ్యంలను పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి అదుపులోకి తీసుకొని శనివారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించారు. దీంతో పై ఆరుగురు చిత్తూరు జైలుకు తరలించారు. చిద్విలాసంతో టిడిపి నేతలు జైలుకు వెళ్లారు. తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు కోసం తాము ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. పదిమందికి ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఏర్పాటుకు తాము కృషిచేస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, దీనికి తామేమీ బాధపడటం లేదని టిడిపి నేతలు పేర్కొన్నారు.