- మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన
- చిన్న దేవాలయాలకు పెద్ద సాయం
- ధూప, దీప నైవేద్య సాయం రూ.10 వేలకు పెంపు
- ఇది అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం
అమరావతి(చైతన్యరథం): యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా నా దృష్టికి తెచ్చారు. వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయాన్ని రూ.10 వేలకు కూటమి ప్రభుత్వం పెంచింది. దీనివల్ల రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుంది. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం మాది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.