చట్టాలను అమలుచేసే పాలకుడే 420, ఆర్థిక నేరగాడైతే సమాజంలో సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ యువనేత, యువగళం రథసారధి నారా లోకేష్ ప్రశ్నించారు. ఒంగోలు శివారు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట నిర్వహించిన జయహో బిసి సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున బిసిలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను సంధానకర్తగా వ్యవహరించారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఎవరికి అన్యాయం జరిగినా గన్ కన్నా ముందొస్తానన్నజగన్ పాలనలో స్టేషన్ కెళ్లి కేసుపెట్టినా దిక్కులేని పరిస్థితి నెలకొనడం బాధాకరం.
సైకో పాలనలో సమాజం మొత్తం భయాందోళనలతో బతుకోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో బిసిల రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తాం. అధికార మదంతో బిసిలను వేధించిన కామాంధులను రోడ్లపై వెంటాడి కటకటాల్లో పెడతాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం లభించింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది స్వర్గీయ నందమూరి తారకరామారావు. బిసిలకు దామాషా పద్ధతిన నిధులు కేటాయించి, కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని లోకేష్ అన్నారు. వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఆదరణ పథకాన్ని పునరుద్దరించి, బిసిలకు పనిముట్లు అందజేస్తాం.
విదేశీవిద్య పథకంతో బిసిబిడ్డలకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తాం. పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. కులధృవీకరణ పత్రాల కోసం తరచూ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సెల్ ఫోన్ ద్వారా ఒక్క బటన్ తో బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకుంటాం. పేదరికం లేని రాష్ట్రం కోసం కులవృత్తులను ప్రోత్సహించి, వారి ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తామని లోకేష్ అన్నారు