వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకొని రైతులను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఆలూరు నియోజకవర్గం లోని వెంకటాపురం వద్ద రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. కర్నూల్ జిల్లాలో రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చిన వారి పై కటిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన సోలార్, డ్రిప్ ఇవ్వకుండా మోటార్ల మీటర్లు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉల్లి రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని… తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరారు. రైతు సమస్యల పై స్పందించిన లోకేష్ వైసిపి ప్రభుత్వం లో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారని… రైతులను ఆదుకునేందుకు ఒక ప్రణాళికను రూపొందించి రైతు ఇబ్బందులను తొలగిస్తామని లోకేష్ రైతులకు ఇచ్చిన హామీ పై సంతోషం వ్యక్తం చేశారు