- పర్యాటకాభివృద్ధి, పరిశ్రమలతో అవకాశాలు
- చిరకాల కోరిక పోర్టును త్వరితగతిన పూర్తిచేయాలి
- కేంద్రం, రాష్ట్రం పూర్తి సహకారం అందించాలి
- గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
- మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రారంభం
మచిలీపట్నం(చైతన్యరథం): బందరులో ఉన్న మానవవనరులు, సహజ వనరులను ప్రపం చానికి పరిచయం చేసి బందరును ఉపాధికి కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిరచారు. మచిలీపట్నంలో బుధవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. బందరు వాసుల చిరకాల కోరిక పోర్టును వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నామని తెలిపా రు. కేంద్రం సహకారంతో పర్యాటక అభివృద్ధికి తోడ్పాటు, మత్స్యకారులకు కామన్ డెవలప్‌మెంట్ కేంద్రం, గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు ఎంఎస్‌ఎంఈని జతచేసి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని.. అందుకు కేంద్రం, రాష్ట్రం సహకారం అందిం చాలని కోరారు. చారిత్రక నేపథ్యం కలిగిన మచిలీపట్నం కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురైందని, అన్న నందమూరి తారకరామారావు చొరవతో బందరుకు తాగునీటి సమస్య తీరిందని తెలిపారు. పెరిగిన జనాభా నేపథ్యంలో మరో రెండు చెరువులు అవసరం ఉంద న్నారు. బందరును వేధిస్తున్న మురుగునీటి సమస్యకు ఇప్పుడిప్పుడే శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. డంపింగ్ యార్డును వీలైనంత త్వరగా తరలిం చాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ జయంతి రోజున బందరు గడ్డపై స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.