కాకినాడ(చైతన్యరథం): యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుడు ప్రమాదానికి కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తెలిపారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమి తికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పని చేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పని చేయిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడి యాతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చే ముందు సీఎం చంద్రబాబుతో నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించాం. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తు న్నాం. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చుల ప్రభుత్వమే భరి స్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.













