నెల్లూరు: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన ఆయన సతీమణి భువనేశ్వరి.. ‘మేమున్నాం..అధైర్యపడొద్దు’’ అని ధైర్యం చెప్పారు. నిజం గెలవాలి కార్యక్రమం కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో గురువారం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో కలత చెంది గుండె పగిలి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. కందుకూరు ఆలా వారి కళ్యాణమండపం వద్ద విడిది కేంద్రం నుండి ప్రారంభమైన భువనేశ్వరి మొదటగా కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో పార్టీ కార్యకర్త కర్పూరపు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారు. సుబ్రహ్మణ్యం(49), గత ఏడాది అక్టోబర్ 19న గుండెపోటుతో మృతిచెందారు. సుబ్రహ్మణ్యం భార్య రమాదేవి, కుమారుడు బ్రహ్మయ్యలను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. అనంతరం గుడ్లూరు గ్రామంలో మరో కార్యకర్త పువ్వాడి చినవెంకయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చినవెంకయ్య(80), గత ఏడాది అక్టోబర్ 13న గుండెపోటుతో మృతిచెందారు. చినవెంకయ్య కుమారుడు వేణుగోపాల్, కుమార్తె పద్మావతిలను భువనేశ్వరి పరామర్శించి, ధైర్యం చెప్పారు. చినవెంకయ్య కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం గుడ్లూరు మండలం, దార్కానిపాడు గ్రామంలో పార్టీ కార్యకరర్త దగ్గుమాటి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటేశ్వర్లు(47), గత ఏడాది సెప్టెంబర్ 15న గుండెపోటుతో మృతిచెందారు. వెంకటేశ్వర్లు భార్య కోటేశ్వరమ్మ, కుమారులు వంశీ, కిషోర్ లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం ఉదయగిరి నియోజకవర్గం, కొమ్మి గ్రామంలో పార్టీ కార్యకర్త తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సుధాకర్(55), గత ఏడాది సెప్టెంబర్ 14న గుండెపోటుతో మృతిచెందారు. సుధాకర్ భార్య ఎంగమ్మ, కుమారుడు మధు, కుమార్తెలు మనోజ్, రaాన్సీలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సుధాకర్ కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు. అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నెల్లూరు 29వ వార్డులోని పార్టీ కార్యకర్త రేగల వెంకయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకయ్య(72), గత ఏడాది సెప్టెంబర్ 21న గుండెపోటుతో మృతిచెందారు. వెంకయ్య భార్య లక్ష్మీదేవమ్మ, కుమారులు శ్రీనివాస్, అమరావతి, కుమార్తె మల్లీశ్వరిలను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వెంకయ్య కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. అనంతరం నెల్లూరు 41వ డివిజన్ లో పార్టీ కార్యకర్త పూల సుబ్బారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సుబ్బారావు(72), గత ఏడాది అక్టోబర్ 4న గుండెపోటుతో మృతిచెందారు. సుబ్బారావు కుమారుడు సుబ్రహ్మణ్యం, కుమార్తెలు ఆదిశేషమ్మ, సావిత్రిలను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. సుబ్బారావు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు.