- ఇసుకలో రూ. 50 వేల రూపాయల కుంభకోణం
- ఈ దోపిడీలో గనులశాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి వాటా ఎంత?
- దోపిడీని బయటపెడితే చంద్రబాబుపై ఎదురు కేసులా?
- గత క్యాబినెట్ నిర్ణయాలను తప్పుబట్టే అధికారం వెంకటరామిరెడ్డికి ఎక్కడిది?
- ప్రస్తుతం రహస్యంగా నడిపిన టెండర్లు మరో భారీ స్కామ్
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక కుంభకోణంలో ఏపీ సీఎం జగన్ వాటా రూ.50వేల కోట్లయితే.. గనులశాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి వాటా ఎంత అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు. ఇసుక దొంగ వే బిల్లులతో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారంటూ ఆధారాలు బయటపెట్టారు. కలకత్తా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. మద్యం, ఇసుక ను దోపిడీకి కీలక వనరులుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో అక్షరాలా 50 వేల రూపాయల కుంభకోణం జరిగింది. జగన్ పాలన నాలుగున్నర సంవత్సరాల్లో ఒక సంవత్సరంపాటు రాష్ట్రంలో ఇసుక పాలసీ అనేదే లేకుండా నడిపారు. ఆ సంవత్సరంపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు అడ్డగొలుగా దోచుకున్నారు. భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. దాదాపు 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. భవన నిర్మాణ కార్మికులను ఆకలితో అలమంటించేలా చేశారు. సంవత్సరం తరువాత ఇసుక పాలసీ తెచ్చి జేపీ వెంచర్స్ అనే ఒక బినామీ కంపెనీని తెరపైకి తెచ్చారు. ఆ సంస్థను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారు. జేపీ వెంచర్స్ మధ్యలో టర్న్ కీ అనే ఒక సబ్ కాంట్రాక్టు సంస్థను తీసుకొచ్చారు. ఆ సంస్థ కూడా కొంతకాలం సబ్ కాంట్రాక్టు నిర్వహించి పక్కకు తప్పుకుంది. ప్రభుత్వ పెద్దలు, మైనింగ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డి, జగన్ ప్యాలెస్ సిబ్బంది.. ఏజెంట్లను పెట్టుకుని అడ్డగోలు ఇసుక దోపిడీకి తెరతీశారు. చంద్రబాబు హయాంలో 12 వందలకు వచ్చిన ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం రూ. 6 వేలు పెట్టి కొనాల్సివస్తోంది. ఇసుక కుంభకోణం డబ్బుతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నాడని ఆనందబాబు విమర్శించారు.
ఎన్‌జీటీ ఆదేశాలకూ వక్రభాష్యం
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలన్నీ నిలిపివేయాలని మార్చి నెలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలు ఇచ్చింది. ఇసుక అనుమతుల్ని రద్దు చేసింది. స్టేట్ లెవల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్టు అసెస్మెంట్ అథారిటీ వాళ్లు కూడా అనుమతులన్నీ రద్దు చేశామని చెప్పారు. అన్ని ఆదేశాలనూ జగన్‌రెడ్డి తుంగలో తొక్కారు. సుప్రీం కోర్టు ఇచ్చిన, ఎన్‌జీటీ ఆదేశాలు చిత్తూరుకు మాత్రమే అంటూ మైనింగ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి వక్రభాష్యం పలికారు. జేపీ వెంచర్స్ కు ఇచ్చిన కాంట్రాక్టు మే నెల 12వ తేదీతో ముగిసింది. ఒప్పందం ముగిసి ఆరు నెలలౌతోంది. అయినా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఇసుకలో రూ. 40 వేల కోట్లు దోచిన వైనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే ఎండగడుతూ రాష్ట్ర ప్రజలకు ఇసుక దోపిడీ గురించి విడమరచి చెప్పారు. ఇసుకలో అడ్డగోలుగా దోచుకున్న కుంభకోణాన్ని మేము బయట పెడితే దానికి సమాధానం చెప్పలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకు 9 సంవత్సరాల క్రితం అమలు చేసిన ఇసుక పాలసీపై అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై కేసులు పెట్టారు. డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చిన వెంకటరామిరెడ్డి, తెలుగుదేశం ఇచ్చిన ఉచిత ఇసుక విధానంలో అవినీతి అని ఫిర్యాదు చేశాడన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ నిర్ణయాలు తప్పని చెప్పే అధికారం ఆయనకు ఎక్కడిది. ఇసుక అక్రమాల్లో తనకు భవిష్యత్తులో శిక్ష తప్పదనే ముందుగా ఓ ఫిర్యాదు పడేశాడు. గుండె ఆపరేషన్ వంకతో ఇంటినే కార్యాలయంలా మార్చుకున్న వెంకటరామిరెడ్డి రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. ఇసుక అక్రమాలు, బిల్లుల చెల్లింపులపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక వెంకట్ రెడ్డి ఎక్కడున్నా బయటికి లాగుతాం. జెపీ వెంచర్స్ లేదు, టర్న్ కీ లేదు, అందరూ పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. మైనింగ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఏ విధానం ప్రకారం ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారో ప్రజలకు వివరించాలి. వెంకటరామిరెడ్డే ఇసుక అక్రమ తవ్వకాల్లో కీలక వాటాదారు అని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.
వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలి
జిల్లా కలెక్టర్లు కూడా ఆలోచించాలి. ఇసుక పై వే బిల్లు కలెక్టర్ ఆఫీసు నుంచి. ఇందులో కలెక్టర్ల భాగస్వామ్యం కూడా ఇందని అనుమానించాల్సి వస్తోంది. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో వే బిల్లులు జారీ చేస్తున్నారు. హైవేల పక్కనే డంప్ లు పెట్టి దోచుకుంటున్నారు. అనుయాయులు, కజిన్ బ్రదర్ అనిల్ రెడ్డికి ఇసుకను జగన్ దోచిపెడుతున్నాడు. పారదర్శకత లేకుండా టెండర్ లు పిలవడం అన్యాయం. ఎంఎస్‌టిసి బ్రాంచ్ ఆఫీస్ విశాఖపట్నంలో ఉండగా.. కలకత్తా నుంచి ఇసుక టెండర్లు పిలవడంలోనే పెద్ద కుంభకోణం ఉంది. వీటన్నింటికి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆనందబాబు డిమాండ్ చేశారు.
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ సుధాకర్ రెడ్డి హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ లలో ప్రెస్ మీట్ లు పెట్టి అభాసుపాలయ్యారు. చంద్రబాబుపై మద్యం కేసులు పెట్టటంపై బ్యావరేజెప్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సమాధానం చెప్పాలి. అసలు నిందితులను వదిలేసి.. ప్రతి దానికి చంద్రబాబుపై కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతపై కూడా కేసు పెట్టారు. ప్రజలెవరూ జగన్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి సిద్ధంగా లేరు. తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.