- సర్పంచ్‌ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు
- పెండింగ్ బిల్లులన్నీ అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో వడ్డీతో చెల్లింపు
- పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులకు విధులు, నిధులు, గౌరవం తిరిగి కల్పిస్తాం
- రాష్ట్ర స్థాయి సదస్సులో పంచాయతీరాజ్ డిక్లరేషన్‌ను ప్రకటించిన చంద్రబాబు
- హాజరైన అన్ని పార్టీల పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు
అమరావతి, చైతన్యరథం: గత మూడేళ్లుగా జగన్ రెడ్డి విధ్వంసం చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థకు అధి కారంలోకి రాగానే తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తామని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీలకు ఉన్న సర్వ హక్కులను పునరుద్దరిస్తామని భోరసా నిచ్చారు. సర్పం చ్‌లకు విధులు, నిధులు, గౌరవం తిరిగి కల్పించి వారు సమాజంలో తిరిగి తలెత్తుకొని పని చేసేలా చేస్తామని హామీనిచ్చారు. సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని కూడా మూడు వేల నుండి 10వేల రూపాయలకు పెంచుతా మని చెప్పారు. పంచాయతీల్లో పెండిరగ్‌లో ఉన్న బిల్లు లన్నీ తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా వడ్డీతో సహా చెల్లిస్తామని హామీనిచ్చారు. తాము అధికా రంలోకి వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను ఎలా బలో పేతం చేస్తారోతెలుపుతూ డిక్లరేషన్‌ను విడుదలచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి పక్కనే ఉన్న సికె కన్వెక్షన్ సెంటర్‌లో బుధవారం జరిగిన ‘పంచాయతీతో ప్రగతి’ అనే రాష్ట్రస్థాయి సదస్సులో చంద్రబాబు ముఖ్యఅతిధి గా పాల్గొన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన పంచాయతీ రాజ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత మూడేళ్లలో తమ ఉనికినే కోల్పొయా మని, సిఎ జగన్ తమను దొంగదెబ్బ తీశాడని, పంచా యతీరాజ్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశాడని సదస్సు లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. తమకు దక్కాల్సిన విధులు, నిధులు, గౌరవాన్ని ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీనేనని, వచ్చే ఎన్నికల్లో మోసగాడు జగన్ రెడ్డికి బుద్దిచెప్పి టీడీపీ`జనసేన ప్రభుత్వాన్ని అధికారం లో తీసుకువస్తామని చెప్పారు.
ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్ర బాబు మాట్లాడుతూ జగన్ సర్పంచ్‌లను బానిసలు చూస్తు న్నారని, రోషం ఉన్న సర్పంచులేవ్వరూ వైసిపి లో కొన సాగరు అనిఅన్నారు. జగన్‌రెడ్డి పాలనలో పూర్తిగా ధ్వం సమయిన పంచాయతీరాజ్ వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామని చెప్పారు. రానున్నది వంద కు వందశాతం టీడీపీ`జనసేన ప్రభుత్వమేనని, సర్పం చ్‌ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ నిచ్చారు. ఎప్పటికప్పడు స్థానిక సంస్థలను, గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేసుకోవా లని మహాత్మా గాంధీ చెప్పారని, పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధు లకు నిధులు, విధులు, గౌరవాన్ని ఇచ్చింది టీడీపీ ప్రభుత్వ మేనన్నారు. 1999లో మొదటిసారిగా సర్పంచ్‌లకు గౌరవ వేతనం వెయ్యిరూపాయలను తమ ప్రభుత్వమే ఇచ్చిందని, అదేవిధంగా 2002లో పంచా యతీలకు 64 అధికారాలను కల్పించింది కూడా తమ ప్రభుత్వమేనన్నారు. ఆ తర్వాత సర్పం చ్‌ల గౌరవ వేత నాన్ని మూడు వేలకు పెంచామని, తిరిగి తాము అధికారంలోకి రాగానే ఆ గౌరవ వేతనా న్ని పదివేలకు పెంచుతామని చెప్పారు. కౌన్సిలర్లుకు, ఎంపిటీసీలకు కూడా పది వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతానని చెప్పారు. అలాగే జెడ్‌పిటీసీలకు, ఎంపిపిలకు, కార్పొరే టర్లకు వేతనాన్ని 15వేలకు పెంచుతామని హామీని చ్చారు. సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను ఇచ్చింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని, ప్రస్తుత వైసీసీ ప్రభుత్వం సర్పంచ్‌లను పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మార్చిం దని, తాము అధికారంలోకి రాగానే వారికి తిరిగి అధికారాలను ఇస్తామని చెప్పారు. గ్రామంలో ఏ పని జరిగినా సర్పంచ్‌ల ద్వారానే జరగలన్నారు. గతంలో పంచాయతీల్లో వసూలయ్యే అనేక రకాల పన్నుల ఆదాయంలో పంచాతీయలకు వాటా ఇచ్చేవా రమని, ప్రస్తుత జగన్‌రెడ్డి దీన్ని కూడా దిగమింగాడని, తమ ప్రభుత్వం రాగానే వాటి ఆదాయాన్నంతా పంచా యతీలకే అప్పజెప్తామని తెలిపారు. నరేగా పనులు కూడా పంచాయతీ ఆధ్వర్యంలోనే జరిగేలా చూస్తా మని, సోషల్ ఆడిట్ కూడా సర్పంచ్‌ల ద్వారా జరిగే లా చేస్తామని చెప్పారు. 14,15ఆర్ధిక సంఘం నిధులను పంచాతీయలకు ఇవ్వకుండా జగన్‌రెడ్డి దారి మళ్లించడాని, సర్పంచ్‌ల అనుమతి లేకుండా పంచా యతీలో తీర్మానాలు చేయ కుండా ఇలా తీసుకోవడం చట్టవిరుద్దమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్ధిక సంఘం నిధులన్నీ పైసలతో సహా పంచాయతీలకు అప్పజెప్తామని, అంతేకాక రాష్ట్ర పైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బడ్జెట్‌లో ఐదు శాతం పంచాతీ యలకే కేటాయిస్తామని, నిదా నంగా దాన్ని పది శాతానికి పెంచుకుంటూ పోతామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ సర్పంచ్‌లచే ఒక విజన్ డాక్యు మెంట్‌ను తయారు చేసి ఐదేళ్ల ప్రణాళికను రూపొందించి ఆ గ్రామాలను ప్రపంచంతో అను సంధానం చేసేలా చేస్తామని చెప్పారు. గ్రామంలో ప్రతి ఇంటి కీ వై`ఫై సౌకర్యాన్ని కల్పిస్తా మని, మన పిల్లలు ఇంటి వద్ద నుండే పని చేసుకునే వాతా వారణాన్ని సృష్టిస్తామని, దీని వల్ల పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని అన్నారు.