టిడిపి అధికారంలోకి రాగానే గతంలో అమలుచేసిన రైతు సంక్షేమ పథకాలు అన్నింటినీ పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గం పి కొట్టాలపల్లి గ్రామంలో రైతులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
టిడిపి అధికారంలోకి రాగానే రైతులను అన్నివిధాల ఆదుకుంటామని లోకేష్ చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పరిపాలన చేశారని చెప్పారు. రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక పరిపాలన చేస్తోందని విమర్శించారు.