- గత ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించింది
- సెంటు స్థలాల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడిరది
- లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.4.30 లక్షలు అందిస్తాం
- టూరిజం ప్రాజెక్టులతో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు
- కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇల్లు లేని ప్రతిఒక్కరికీ నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లతో సదస్సులో భాగంగా గృహ నిర్మాణం, పర్యాటక రంగాలపై చర్చలో మాట్లాడారు. రాష్ట్రంలో పీఎంఏవై అర్బన్, పీఎంఏవై రూరల్, పీఎం జన్మన్, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్‌లో కలిపి 9,11,594 ఇళ్లు పెండిరగులో ఉన్నాయని, 5,74,710 ఇళ్ల నిర్మాణం అసలు చేపట్టలేదని, ఇవి పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకుంటామని వెల్లడిరచారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని, సెంటు స్థలం పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. 25 లక్షల ఇళ్లు కడతానని గొప్పగా చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే చేపట్టిందని తెలిపారు. కేంద్రం దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు మంజూరు చేసిందని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.
మన ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వబో తోందని, 2014-19 మధ్య మంజూరై నిర్మాణ దశలో నిలిచిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ రూరల్ హౌస్‌లో ఇచ్చిన ఇళ్లకు గత ప్రభుత్వం నిధులు నిలిపేసిందని, వాటికి కూడా నిధులు చెల్లిస్తామని వివరించారు. నీరు-చెట్టులో పెం డిరగ్‌లో ఉన్న బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన రూ.3,183 కోట్లను గత ప్రభుత్వం మళ్లించిందని, రూ.500 కోట్లు గ్రామీణ హౌసింగ్ నుంచి మళ్లించిందని, నిధులు మళ్లించినందుకు కేంద్రం రాష్ట్రంపై రూ.28 కోట్లు ఫైన్ కూడా వేసిందని తెలిపారు. రూ.8 వేల కోట్లు కేంద్ర నుంచి రాకుండా చేశారని, 5 వేల కోట్లు కార్పొరేషన్లకు రావాల్సిన ఫండ్స్ రాకుండా చేశారని మండిపడ్డారు.
పర్యాటక రంగ అభివృద్ధితో ఉద్యోగాలు
రాష్ట్రంలో మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంలో నెంబర్ వన్‌గా ఉందని, పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీశైలంలో టెంపుల, వాటర్ ప్రాజెక్టు, టైగర్ రేంజ్ ప్రాంతం కావడంతో అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని వివరిం చారు. ఐటీసీ, నోవోటెల్ మిగతా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. అమరావతికి కూడా స్టార్ హోటల్స్ రావాల్సి ఉందని, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పీపీపీ మోడల్‌లో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 10 పోర్టులు, 10 ఎయిర్ పోర్టులు ఉన్నాయని, కొద్దిగా శ్రద్ధ పెడితే పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు.