- మత్స్యకారులకు నెలరోజుల్లో పరిహారం అందిస్తాం
- ప్రతిఇంటికీ సురక్షితమైన తాగునీరు అందిస్తాం
- నావల్ బేస్ బాధిత మత్స్యకారులతో నారా లోకేష్
యలమంచిలి: టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేవీతో మాట్లాడి రెండేళ్ల లోపే జెట్టి నిర్మాణం తో పాటు, మత్స్యకారులకు మంచి ప్యాకేజ్ ఇప్పిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గం వెదురువాడలో నావల్ ఆల్టర్నేట్ ఆపరేటింగ్ బేస్ (ఎన్‌ఎఓబి) బాధిత మత్స్యకారులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మత్స్యకారుల సమస్య పరిష్కారం చేస్తాం. భూమి కోల్పోయిన అందరికీ న్యాయం చేస్తాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే 31 రోజుల్లోనే వేట కి వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తాం. ఎన్‌ఎఓబి బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
మత్స్యకారులను దెబ్బతీసిన జగన్
మత్స్యకారులను ఆదుకుంది టిడిపి. వేట నిషేధ సమయంలో సాయం అందించాం. కార్పొరేషన్ ఏర్పాటు చేసి 800 కోట్లు ఖర్చు చేసింది టిడిపి ప్రభుత్వం. బోట్లు, వలలు, డీజిల్, జిపిఎస్, ఇతర పరికరాలు అన్ని సబ్సిడీ లో అందించాం. వేటకి వెళ్లి ఎవరైనా చనిపోతే టిడిపి ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునేది. జగన్ ప్రభుత్వం మత్స్యకారులను దెబ్బతీసింది. బోట్లు, వలలు, ఇతర పరికరాలపై ఇచ్చే సబ్సిడీ లను జగన్ ప్రభుత్వం ఆపేసింది. వేట కి వెళ్లి ఎవరైనా చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవడం లేదు. ఎన్నికల ముందు ఎన్‌ఎఓబి సమస్య ను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయం, ముడుపుల కోసం ఎన్‌ఎఓబి సమస్య ను వాడుకుంటున్నాడు. మత్స్యకారులు, మత్స్యకారయేతర గ్రామాలు, నేవి మధ్య చిచ్చు పెట్టి స్థానిక ఎమ్మెల్యే లబ్ది పొందుతున్నాడు. దేశం కోసం త్యాగం చేసి భూములు ఇచ్చిన మత్స్యకారులకు, రైతులకు న్యాయం చేయాలి.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్‌ఎఓబి పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఎన్‌ఎఓబి లో పనిచేసే అవకాశం స్థానికులకు ఇవ్వాలని మా ఎంపిల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎన్‌ఎఓబి లో స్థానికులకు ఉపాధి అవకాశాలు వచ్చేలా ప్రయత్నిస్తాం. భూములు తీసుకున్నప్పుడు కేంద్ర విద్య, వైద్యం తో పాటు ఇచ్చిన 13 హామీలు అమలు అయ్యేలా మన ప్రభుత్వం చూస్తుంది. మత్స్యకారులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బోట్లు, వలలు, ఐస్ బాక్సులు, వ్యాన్లు, టూ వీలర్, జిపీస్ పరికరాలు అన్ని సబ్సిడీలో అందిస్తాం. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం. క్రమ పద్ధతిలో ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగు నీరు అందిస్తాం. ఎన్‌ఎఓబి కి భూములు ఇచ్చిన మత్స్యకారులు, మత్స్యకారయేతరులకి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం. ధరల పెరుగుదల ఆధారంగా మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ పెంచుతామని చెప్పారు.
ఎన్‌ఎఓబి బాధిత మత్స్యకారులు మాట్లాడుతూ…
ఎన్‌ఎఓబి కోసం భూములు ఇచ్చి పూర్తిగా నష్టపోయాం. పాదయాత్ర లో ఎన్‌ఎఓబి సమస్య పరిష్కారం చేస్తానని జగన్ మోసం చేసాడు. ప్యాకేజ్ అందలేదు, వేట కి వెళ్లే అవకాశం లేక మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూములు ఇచ్చిన మత్స్యకారులకు ప్యాకేజ్ అందలేదు. వేటకి వెళ్లి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని గ్రామాలకు ప్యాకేజ్, కాలనీలు ఏర్పాటు చేసారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క గ్రామానికి కూడా ప్యాకేజ్ అందలేదు. ఒక్క కాలనీ కట్టలేదు. టిడిపి హయాంలో కట్టిన కాలనీల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చొరవచూపడం లేదు. మేజర్ సన్స్, మేజర్ డాటర్స్ కి ఇస్తామని చెప్పిన ప్యాకేజ్ కూడా ఇవ్వడం లేదు.
మత్స్యకార గుర్తింపు కార్డులు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎన్‌ఎఓబి కోసం భూములు తీసుకున్నప్పుడు ఉపాధి, కేంద్ర విద్య, వైద్యం అన్నారు. కానీ హామీలు నెరవేర్చలేదు. యలమంచిలి ఎమ్మెల్యే మమ్మలని తన ప్రయోజనాల కోసం వాడుకొని వ్యక్తిగతంగా లబ్దిపొందాడు. మత్స్యకారులు జీవనోపాధి కల్పోయారు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. టిడిపి హయాంలో బోట్లు, వలలు కొనడానికి 90 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ సబ్సిడీ ఎత్తేసింది. డీజిల్ రేటు పెరిగినా టిడిపి హయాంలో ఇచ్చిన డీజిల్ సబ్సిడీ నే జగన్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. డీజిల్ సబ్సిడీ పెంచాలని కోరారు.