ఉండవల్లి: టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడు సమక్షంలో వివిధ ప్రాంతా లకు చెందిన పలువురు నేతలు తెలుగు దేశం పార్టీలో చేరారు. కడప జిల్లా కమలా పురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలిక పూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలన కు చరమగీతం పాడేందుకు… తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నేతలు చెప్పారు. రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.