- మేము తలుచుకుంటే జగన్ ఇంట్లోనుంచి బయటకు రాలేడు
- మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి హెచ్చరిక
విశాఖపట్నం: బొత్స సత్యనారాయణ సీనియర్ పొలిటీషన్ అని, 20 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నారని, ఈ మూడున్నర ఏళ్ళుగా ఉత్తరాంధ్రకు ఏమేమి తెచ్చారో చెప్పాలని మాజీ మంత్రి బండారు సత్య నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ పన్నులు మీ ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. 7 వేల ఎకరాల అచ్యుతాపురం ఎస్‌ఈజడ్, 3500 ఏకరాల పరవాడ ఫార్మాసిటీ, విశాఖ హెచ్‌ఎస్‌బీసీ, విశాఖ స్మార్ట్ సిటీ, అనకాపల్లి నుంచి ఆనందపురం ఆరు లైన్లు, షీలా నగర్ నుంచి సబ్బవరం నాలుగు లైన్లు,విశాఖ బీచ్‌లో నాలుగు లైన్లు టీడీపీ హయాంలో వచ్చినవేనని వివరించారు. సబ్బవరం మీదగా ఒడిశా కు జాతీయ రహదారి, ఐఐఎం, గంగవరం పోర్టు, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, ఏసియన్ పెయింట్స్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, సింహాద్రి వెయ్యి మెగావాట్స్…ఇవన్నీ టీడీపీప్రభుత్వం హయాం లో జరిగినవేనని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏం తెచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.మేముతలుచుకుంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాలేడని హెచ్చరించారు. ఈ మూ డేళ్ళలో విశాఖకు ఇచ్చిన నిధులు, అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.
తనఖాపెట్టిన విశాఖ ఆస్తులు విడిపించాలి: వెలగపూడి
తనఖాపెట్టిన విశాఖఆస్తులను విడిపించాలని, లేక పోతే బ్యాంక్‌లు అమ్మేస్తాయని విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ హయంలో విశాఖలోని వుడా భూములు అమ్మి హైద్రాబాద్‌లో ఖర్చుపెట్టినట్లు తెలిపారు.తండ్రి వైఎస్ నుంచి తనయుడు జగన్‌వరకు విశాఖ ఆస్తులు తనఖా పెట్టినట్లు చెప్పారు. తనఖా పెట్టిన ఆస్తులు విడిపిస్తే విశాఖను అభివృద్ధి చేసినట్లేనన్నారు. రాష్ట్రంలో ఏ నగ రంలోనూ ఆస్తులు అమ్మలేదని చెప్పారు. ఒక్క విశాఖ లోనే ఆస్తులు తనఖా పెట్టినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి బెదిరించి మరీ భూములు కొనుగొలు చేసినట్లు చెప్పారు. ఆ భూము ల వైపు నుంచి మాస్టర్‌ప్లాన్ రోడ్డువేసుకున్నట్లు తెలిపా రు. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో విత్ డ్రా చేసుకుని, ఇప్పుడు మళ్లీ దాని గురించి మట్లాడుతు న్నారన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో చంద్ర బాబు ఇక్కడే ఉండి సేవలు చేసిన విషయం గుర్తు చేశారు. ఈ వైసీపీ నేతలు ఆ సమయంలో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. విశాఖలో యువతను డ్రగ్స్‌కు బానిస చేస్తున్నారని వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు.
విశాఖను గంజాయికి రాజధానిన చేశారు: పల్లా శ్రీనివాసరావు
విశాఖను గంజాయికి రాజధానిని చేసి, జాతీయ స్థాయిలో పెద్ద పేరు తెచ్చారని టీడీపీ విశాఖ పార్లి మెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎద్దేవా చేశా రు.బెస్ట్ క్వాలిటీ గంజాయి విశాఖలో దొరుకుతుందని ప్రచారం అవుతోందన్నారు. మూడేళ్ళ నుంచి ఇక్కడ అన్నిదోచుకున్నారని మండిపడ్డారు.విశాఖకు ఏంచేశా రో వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం సాధ్యం కాదని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ భీమిలి నియోజవర్గ ఇన్ చార్జి కోరాడ రాజబాబు, విశాఖ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్,ఎల్లపు శ్రీనివాసరావు,బుగత సత్యనారా యణ, మద్దిల రాజశేఖర్, నడిగట్ల శంకరరావు, సారి పల్లి మహేష్, సెల్వరాజ్, నూకరాజు పాల్గొన్నారు.