అమరావతి (చైతన్య రథం): అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమంది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని పేర్కొంది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.