- షర్మిల రెండో పెళ్లిని కూడా తప్పుబడతారా?
- పవన్ పెళ్లిళ్ల వల్ల సమాజానికి నష్టం లేదు.
- మీ అడ్డగోలు దోపిడీతో 5కోట్లమందికి నరకం
- హవ్వ.. రౌడీయిజం గురించి మీరా మాట్లాడేది?
- తల్లి,చెల్లిని పొరుగురాష్ట్రానికి తరిమిన మీరు.. మహిళాలోకానికి న్యాయం చేయగలరా?
- లోపాయికారీ పొత్తులతో అధికారం చేపట్టిన మీరు.. సింహం.. సింగిల్ అని సోదికబుర్లు చెప్పొద్దు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవనిగడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు గురివింద సామెను గుర్తుకు తెస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకొకటిగా బయల్పడుతున్న భూకుంభకోణాలు, ప్రజాసమస్యలను గాలికొదిలి పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగిన తీరు ఆయన దిగజారుడు మనస్థత్వానికి అద్దంపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించిన జగన్ మాట్లాడుతూ..మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని ఆయన అంటున్నారు, అందరూ మూడు పెళ్ళిళ్లు చేసుకుంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏమిటి? చెప్పుచూపించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీధి రౌడీలు కూడా ఆయన లా మాట్లాడరని సిఎం నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది వారి వ్యక్తిగతమైన విషయం. ఆ మాటకొస్తే మీ కుటుంబంలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్నవారు లేరా? మీతోపాటే ఒకే వేదికపై మొదటి పెళ్మి చేసుకున్న మీ చెల్లి షర్మిలకు మీతోపాటే మీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో తొలుత వివాహం జరిగింది. కొద్దిరోజులకే మొదటి భర్తతో పొసగక పరస్పర అంగీకారంతో తొలి భర్తను వదిలేసి… తర్వాత అనిల్ కుమార్ ను పెళ్లి చేసుకోలేదా? పవన్ పెళ్లిళ్లను తప్పుబడుతున్న మీరు షర్మిలను కూడా తప్పుబడతారా?
మీ గజదొంగల వల్లే సమాజానికి నష్టం
పవన్ కళ్యాణ్ మొదటి, రెండవ భార్యలతో పొసగక వారికి కోట్లల్లో నగదు, ఆస్తులను భరణంగా చెల్లించి చట్టానికి లోబడి 3వ వివాహం చేసుకున్నాడు. ఇది పూర్తిగా చట్టపరిధిలోనే జరిగింది. ఒకటికి మించి పెళ్లి చేసుకోరాదని చట్టం ఉంటే మీరు సంబంధిత చట్టపరిధిలో పవన్ కళ్యాణ్ ను శిక్షించవచ్చు. ఇకపోతే ఇస్లాం లా ప్రకారం ఇప్పటికీ ముస్లింలు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకునే సౌలభ్యం ఉంది. ఈవిధంగా పెళ్లి చేసుకున్న ముస్లిం సోదరులు లక్షలాదిమంది ఉన్నారు. వారిని కూడా జగన్ తప్పుబడతారా? పెళ్ళిళ్లు అనేవి పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలు. ఇరువురు పరస్పర అంగీకారంతో ఇష్టపూర్వకంగా చేసుకునే పెళ్లిళ్లవల్ల సమాజానికి వచ్చే నష్టం లేదు. కానీ జగన్ అండో కో చట్టాన్ని అతిక్రమించి చేస్తున్న లక్షలకోట్ల దోపిడీవల్ల 5కోట్ల ఆంధ్రప్రజలు ఎప్పుడు ఎవడొచ్చి తమ ఆస్తులు ఆక్రమిస్తారోనని భయంభయంగా బతుకుబండి లాగిస్తున్నారు. సమాజానికి జగన్ అండో కో లాంటి గజదొంగలవల్ల తీరని నష్టం తప్ప పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల ఎటువంటి నష్టం లేదు.
చెల్లికి న్యాయం చేయలేని మీరు మహిళోద్ధారకులా?
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు సొంత బాబాయ్ హత్య విషయంలో నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్న తీరుతో స్వయానా మీ చెల్లి సునీత ఇతర రాష్ట్రానికి కేసు బదిలీచేయాలని సుప్రీం కోర్టును వేడుకుంటే కోర్టు కూడా ఆమె అభ్యర్థనను అంగీకరించింది. మీ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం లేకపోవడం వల్లే కదా ఆమె కాలికి బలపం కట్టుకొని న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇక మీ రక్తంపంచుకొని పుట్టిన ముద్దుల చెల్లి షర్మిలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా బెదిరిం చడం వల్ల ఆమె రాష్ట్రం వదిలి పొరుగురాష్ట్రంలో తలదాచుకుంటున్నది నిజం కాదా? ఆమెతో న్యాయంగా ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చానని మీరు గుండెపై చేయివేసుకొని చెప్పగలరా? సొంతచెల్లెళ్లకు న్యాయం చేయలేని మీరు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాj ుచేస్తారు జగన్ రెడ్డీ? చెల్లికి అన్యాయం చేయడం తప్పు, ఆమెకు ఇవ్వాల్సింది ఇవ్వమన్నందుకు కదా మీరు మీ తల్లి విజయమ్మను కూడా హైదరాబాద్ తరిమేసింది? ఇది చట్టబద్ధం, న్యాయబద్దమైనది మీరు భావిస్తున్నారా? సొంత తల్లి, చెల్లిని అత్యంత అమానవీయంగా ఇంటినుంచేగాక రాష్ట్రం నుంచి కూడా తరిమేసిన మీరు రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఎవరికైనా ఉందా?
రౌడీయిజం గురించి మీరా మాట్లాడేది?
ఇక రౌడీయిజం గురించి, భాష గురించి ముఖ్య మంత్రి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉంది. కర్నూలులో ముక్కుపచ్చలారని చిన్నారుల సాక్షిగా ప్రతిపక్షాలు, మీడియాను నా వెంట్రుక కూడా పీకలేరని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సుభాషితాలా? మీతో పాటు ప్రతిరోజూ కొడాలి నాని వంటి వెదవలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతూ బూతులు తిట్టిస్తున్న మీరు పవన్ కళ్యాణ్ భాష గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకెన్నడూ లేనివిధంగా బూతులపై రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగే విషసంస్కృతికి బీజం వేసిందే మీరు కదా జగన్ రెడ్డీ? మీ ఇలాకాలోని మంత్రులు ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రతిపక్షనేత కుటుంబంపై విషంగక్కుతూ విమర్శలు చేస్తుంటే మీరు నవ్వుతూ పైశాచికానందం పొందిన తీరు యావత్ రాష్ట్ర ప్రజానీకం లైవ్ లో చూశారు. ఇప్పుడు మీరు గౌతమబుద్దిడి మాదిరిగా మాట్లాడుతుంటే నమ్మడానికి రాష్ట్రప్రజానీకం సిద్ధంగా లేరు.
పొత్తుపెట్టుకున్న మీ తండ్రినీ తప్పుబడతారా?
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అరాచకాలనుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే టిడిపి-జనసేనలు కలిసివచ్చే పార్టీలతో కలిసి పోరాడాలని నిర్ణయిం చారు. దీనికి ఇరుపార్టీలకు అక్రమసంబంధాలను అంటగడుగుతూ జగన్‌రెడ్డి సైకో బ్యాచ్ అవాకులు, చెవాకులు పేలుతోంది. 2019లో తెలుగుదేశం పార్టీని ఓడిరచేందుకు మీరు టిఆర్‌ఎస్, ఇతర రాజకీయపక్షాలతో పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. సింహం…సింగిల్ అంటూ సోదికబుర్లు చెబితే నమ్మడానికి రాష్ట్రప్రజలు ఇకపై సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్యంలో పొత్తులన్నవి రాజకీయ ప్రక్రియకు లోబడి ఉంటాయి.
ఇందులో ఎటువంటి తప్పూ లేదు. 2004 ఎన్నికల సమయంలో మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లారా? అప్పట్లో మీ తండ్రి నేతృత్వంలో కాంగ్రెస్ టిఆర్‌ఎస్ పాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని మీరు తప్పుబడతారా? పై ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాకే జగన్ నేతృత్వంలో సైకో బ్యాచ్ కి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే నైతిక అర్హత ఉంటుంది. వేలకోట్ల భూకుంభకోణాలను పక్కదారి పట్టించేందుకు ప్రతీసారి మీరు నడిపే డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రప్రజలందరికీ తెలుసు. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసిన మీరు ఈసారి జనసేన నేత పవన్ కళ్యాణ్ వైపు మళ్లించారు. చైతన్యవంతులైన రాష్ట్రప్రజానీకం మీ కుట్రలు, కుతంత్రాలను ఇప్పటికే గమనించింది. మరోమారు వంచనగురికావడానికి రాష్ట్రప్రజానీకం సిద్ధంగా లేరని జగన్ అండ్ కో గుర్తిస్తే మంచింది.