- నిర్విరామ శ్రామికుడు చంద్రబాబు
- తెల్లవార్లూ వరద నీటిలోనే
- ముంపు బాధితులకు భరోసా
- అర్ధరాత్రి వేళా పడవలో వరద నీటిలోనే
- బాధితులకు స్వయంగా ఆహారం పంపిణీ
- రోజు మొత్తంలో రెండు గంటలే విశ్రాంతి
విపత్తు సమయాల్లో స్పందించే తీరును బట్టే నాయకుడిలో సత్తా బయటపడుతుంది. ప్రజలను ఆదుకోవటంలో వేగంగా ఆలోచించి, క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవటంలోనే నాయకుడి సామర్థ్యం తెలుస్తుంది. ఎంతటి ఉపద్రవం ముంచుకొచ్చినా అడుగు బయట పెట్టకుండా, ఒకవేళ వెళ్లినా గాల్లోనే విహరించి వచ్చే జగన్ రెడ్డి ఎక్కడ…విపత్తు సమయాల్లో వెంటనే బాధితుల మధ్యకు వెళ్లిపోయి, వారికి తక్షణ సాయం అందించటంలోనూ, పరిస్థితిని చక్కదిద్దడంలోనూ మెరుపు వేగంతో స్పందించే సీఎం చంద్రబాబు ఎక్కడ… అసలు చంద్రబాబుతో పోల్చేందుకే జగన్ రెడ్డి అనర్హుడు. ఈ విషయం విజయవాడలో బుడమేరు ముంపుతో మరోసారి రుజువయింది. చంద్రబాబు నాయుడి పనితీరు విజయవాడ వాసులకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది.
గత శనివారం నుంచి వాయుగుండం ప్రభావం వల్ల కురిసిన అతి భారీవర్షాలతో విజయవాడ నీట మునిగింది. రాష్ట్ర చరిత్రలో 121 సంవత్సరాలు తరువాత ఇంతటి భారీ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి. కృష్ణా నదికి 1903లో 11.90 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. తరువాత 2009లో 11.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రస్తుతం 11.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చిందని అంచనా వేశారు. ఇంతటి విపత్తులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాలను పర్యవేక్షించి వరద బాధితులకు భరోసా కల్పించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో పడవలో తిరుగుతూ బాధితులకు ఆహారం ఆందజేశారు. తరువాత కేవలం రెండు గంటలు మాత్రమే విశాంత్రి తీసుకొని వెంటనే ఉదయం ఆరు గంటలకల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వరద ప్రాంత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటంతో సీఎం చంద్రబాబు తన మార్క్ చూపించారు.
వరద ప్రాంతాల ప్రజలకు అండగా సీఎం
బుడమేరు పొంగడంతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 2.76 లక్షల మంది వరద ముంపులో చిక్కుకున్నారు. శనివారం రాత్రి నుంచి ఆహరం.. తాగునీరు లేకుండా బిక్కుబిక్కుమంటూ నీటిలో చిక్కుకున్న బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. ఆదివారం ఉదయం 8 గంటలకల్లా దాదాపు 2.50లక్షల మందికి ఆహారం, తాగునీరు, పండ్లు, బిస్కెట్‌లు అందించారు. అలాగే ముంపు ప్రాంత బాధితులను తరలించడానికి ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 100 పునరావాస కేంద్రాలు, 61 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. వరద కారణంగా విద్యుత్ నిలిచిపోవడంతో వరద బాధితులకు కొవ్వొత్తులు పంపిణీ చేసి అండగా నిలిచింది. వరద బాధితుల సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 112 లేదా 1070 ఏర్పాటు చేసి వారిలో మనోధైర్యాన్ని కల్పించారు. 1996లో తూర్పు గోదావరిలో సూపర్ సైక్లోన్, 2014లో విశాఖలో హుద్‌హుద్ తుపాన్ వచ్చినప్పుడు పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉండి సహాయ, పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించిన నాయకుడు చంద్రబాబు. మళ్లీ నేడు అలాంటి పరిస్థితే వచ్చింది. ఇలాంటి పరిస్థితులు.. వాటిని ఎదుర్కోవడం అయనకు కొత్తేమీ కాదు.
ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు
ముంపు ప్రాంత ప్రజలను రక్షించడానికి కేంద్రం సహాయంతో 40 పవర్ బోట్లు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 6 హెలికాప్టర్లను రప్పించి, వేలాదిమంది ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో చంద్రబాబు నాయుడు చూపించిన చొరవ అనితర సాధ్యం. అలాగే 109 ప్రైవేట్ బోట్లు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. అలాగే డ్రోన్ల ద్వారా 8-10 కిలోల వరకు ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నారు.
వైసీపీ దుష్ప్రచారం
బుడమేరు పొంగడం వల్ల విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి సహాయ చర్యలను పర్యవేక్షించారు. అయితే చంద్రబాబు నివాసం ముంపునకు గురైంది..అందుకే వరద సహాయక చర్యల పేరుతో కలెక్టర్ కార్యాలయంలో బస ఏర్పాటు చేసుకున్నారని సాక్షి దినపత్రికలో తప్పుడు రాతలు రాశారు. వాస్తవానికి సైకో జగన్ తన ఐదేళ్ల దుర్మార్గ పాలనలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిని ముంచేయాలని ఎన్నో కుట్రలు చేశాడు. ప్రకాశం బ్యారేజీలో వరద నీరు దిగువకు వెళ్లకుండా గేట్లకు పడవను అడ్డు పెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా చంద్రబాబు ఇల్లు మునగలేదు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ఉండవల్లి నివాసం మునిగిపోయింది అంటూ సైకో జగన్ ముఠా ఫేక్ ప్రచారం సాగిస్తోంది. వాస్తవంగా అమరావతి పరిధిలో ఒక్క గ్రామం కూడా ముంపులో లేదు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడని సీఎం చంద్రబాబు స్వయంగా కలెక్టర్ కార్యాలయం నుంచి సమీక్షలు నిర్వహించారు.
అలాగే మంత్రుల ద్వారా వేగంగా ముంపు బాధితులకు సాయం అందించాలని అదేశాలు జారీ చేశారు. కానీ బ్లూ మీడియా మాత్రం ఫేక్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో 2019 ఆగస్టు 14-19 తేదీల్లో గోదావరి వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే జగన్ రెడ్డి మాత్రం అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈ వరదల్లో దాదాపు 276 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వేలాది హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 18,678 ఇళ్లు నీట మనిగాయి. అమెరికా నుంచి వచ్చిన నేలమీద కాలు మోపకుండా జగన్మోన్ రెడ్డి కేవలం హెలికాప్టర్ నుంచి కేవలం గాల్లోనే సర్వే చేశారు. నేడు చంద్రబాబు నాయుడు స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లి వరద బాధితులకు అండగా నిలిచారు. శనివారం రాత్రి నుంచి వరద ప్రాంతాల్లో పడవల్లో తిరుగుతూ బాధితులకు భరోసా కల్పించారు. వరద నీటిలో గంటలకొద్దీ నడిచి బాధితులను కష్టాలను తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సహాయక చర్యలు చేపట్టారు.
వరదలకు కారణం జగన్ రెడ్డే
విజయవాడలో వరదలు రావడానికి కారణం జగన్ రెడ్డి గత 5 ఏళ్ళుగా చేసిన పాపాలే. బుడమేరుకు ఈ స్థాయి వరదలు గతంలో రాలేదు. అందువల్లే ముందస్తుగా ముంపు సూచనలు రాలేదు. ఈ వరదల వల్ల గత 5 ఏళ్ళలో జగన్ రెడ్డి చేసిన బాగోతాలు బయట పడ్డాయి. జగన్ పాలనలో విజయవాడ శివారు ప్రాంతంలో బుడమేరు పరీవాహక ప్రాంతం ఆక్రమణలకు గురైంది. ఇష్టం వచ్చినట్టుగా బుడమేరు కట్టలు, సమీప భూములు కబ్జా చేసి, వైసీపీ నేతలు అమ్ముకున్నారు. దీంతో బుడమేరు కుంచించుకుని పోయింది. ఫలితంగానే, నేడు విజయవాడకు ఈ స్థాయి వరద వచ్చింది. జగన్ రెడ్డి పాపాలు, భావితరాలకు శాపాలుగా మారాయి.
చంద్రబాబు హయాంలోనే రిటైనింగ్ వాల్
వర్షాకాలం వచ్చిందంటే విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్న కృష్ణలంక, రామలింగేశ్వరనగర్, యనమలకుదురు, పెనమలూరు ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉండేది కాదు. 2014లో వచ్చిన వరదల సమయంలో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ ప్రాంత వాసుల కష్టాలు తొలగించేందుకు రిటైనింగ్ వాల్‌కి పునాది వేశారు. మొదటి దశను 2015-16లో మొదలు పెట్టారు. 2019 నాటికి రిటైనింగ్ వాల్ పూర్తి చేశారు. దాదాపు 2.5 కి.మీ మేర మొదటి దశ రిటైనింగ్ వాల్ చంద్రబాబు హయాంలోనే పూర్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టుకు తొలుత రూ.40 కోట్లు అంచనా వేయగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.104 కోట్లకు పెంచింది. 2014లో రూ.104 కోట్ల పనులకు ప్రభుత్వం సాంకేతిక అనుమతులు ఇచ్చింది. తరువాత అంచనాలు పెరగటంతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 138.78 కోట్లు కేటాయించింది. యనమలకుదురు నుంచి రామలింగేశ్వర నగర్ వరకు మొదటిదశ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ హయాంలోనే పూర్తి చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో అప్పటికే పూర్తయిన రిటైనింగ్ వాల్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్మించినట్లు తప్పుడు ప్రచారం చేసుకున్నారు.
ఎం ఎలీషా, అనలిస్ట్