(చంద్రబాబునాయుడును విమర్శించే నైతిక హక్కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్కడిది? రెండు దశాబ్దాల క్రితం ఒక చిన్న సీ క్లాస్ కాంట్రాక్టర్‌గా ఉన్న పెద్దిరెడ్డికి నేడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయి? ఇది ఎలా సాధ్యం? ఆయన చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గురివింద గింజ తన కింద నలుపెరగనట్లుగా ఆయన చంద్రబాబు గురించి మాట్లాడటం విడ్డూరం)
– 20 ఏళ్ల క్రితం ఆయన స్థాయి ఏంటి?
– చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం
– సిఎం జగన్‌రెడ్డికి కూడా ప్రవేశం లేదు
– టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమాలపై విచారణ
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అమరావతి, చైతన్యరథం: 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి, ఎటువంటి అవినీతి మచ్చ ఎరుగని నారా చంద్రబాబునాయుడును విమర్శి ంచే నైతిక హక్కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రాయమ్య అన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఒక చిన్న సీ క్లాస్ కాంట్రాక్టర్‌గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు వేల కోట్లకు అధిపతి ఎలా కాగలిగారని, ఇది ఎలా సాధ్య మని ప్రశ్నించారు. ఆయన చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని,గురివింద గింజలాగ నలుపెరగకుండా చంద్ర బాబు గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో ఒక పక్క ఎంపీగా పెద్దిరెడ్డి కుమా రుడు, మంత్రిగా ఆయన చిత్తూరు జిల్లాలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఈ సామ్రాజ్యం లోకి జగన్మోహన్‌రెడ్డికి కూడా ప్రవేశం లేదని విమర్శిం చారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చేమోగానీ పెద్దిరెడ్డి ప్రత్యేక సామ్రాజ్యంలో ప్రవేశం లేదని, డీజీపీ రాజేంద్రనాధరెడ్డికి కూడా వారి సామ్రాజ్యంలోకి ప్రవేశంలేదు. డీజీపీ అక్కడి పోలీసులను డైరెక్షన్ ఇవ్వ లేడని, పోలీసుశాఖ మొత్తంవారి ఎదుట చేతులు ముడు చుకు కూర్చుంటున్నారని అన్నారు.
చిత్తూరు జిల్లా నియంతలు
చిత్తూరు జిల్లా నిషిద్ధ ప్రాంతమని, పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు అక్కడ నియంతలని, పెద్దిరెడ్డి సంపాదిం చిన అవినీతి సొమ్ముతో అక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నా పెద్దిరెడ్డి అనుమతి కావాలని, పోలీసు అధికారులు పెద్దిరెడ్డి ఇంటికెళ్లి అనుమతి తీసుకొని వెళ్తేనే అక్కడ ఎఫ్ ఐఆర్ రిజిష్టర్ అవుతుందని, కాదని అక్కడి ఎస్పీనిగానీ, పోలీసు అధికారులు గానీ చెప్పగలిగే ధైర్యం లేదని అన్నారు. మేం చట్టప్రకారం వెళ్తున్నామని చెప్పగలిగే ధైర్యం ఏ అధికారికైనా ఉందా అని ప్రశ్నిం చారు. అక్కడి రెవెన్యూ అధికారులు ఒక చిన్న ఆర్డర్ కూడా పాస్ చేయలేరని, చిన్న పాస్ బుక్ కూడా రిలీజ్ చేయలేరని, పెద్ది రెడ్డి ఇలాకాలో ఎవరికైనా ధైర్యంగా జగన్ ఎమ్మెల్యే సీటు ఇవ్వగలడా అని ప్రశ్నించా రు. పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యా న్ని చూసి జగన్ కూడా భయపడతాడని, అటువంటి వ్యక్తులు చంద్రబాబు గురించి మాట్లాడట మా అని నిలదీశారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ వెనకున్నదెవరు?
2004లో ఎన్‌కౌంటర్‌లో ఎర్రచందనం దొంగ వీరప్పన్ చనిపోయాక స్మగ్లింగ్ అంతా ఎవరి చేతుల్లో ఉందో నిజాయితీగా చెప్పగలరా అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. కొల్లం గంగిరెడ్డికి పెద్దిరెడ్డికి ఉన్న సంబంధ మేంటి? సామాన్య సీ కాంట్రాక్టర్‌గా ఉన్న ఆయన ఇన్ని వేల కోట్లకు ఎలా పడగలెత్తా రు? ఆయనలా కోట్లకు పడగలెత్తిన మరో కాంట్రాక్టర్ ఉంటే పెద్దిరెడ్డి చూపించలగలా అని ప్రశ్నించారు. 2013 నుంచి శేషాద్రి అడవులు, వాటి చుట్టుపక్క ప్రాంతాల్లో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఆయన కనుసన్నల్లో నడిచింది నిజం కాదా? తమిళనాడు రాష్ట్రానికి చెందిన వందలాదిమంది దళితు లు జైల్లో ఉంటే వారి కేసుల కోసం కోర్టు ల్లో పని చేసింది నిజంకాదా? కాదంటే వివరాలు చూపించగలని అన్నారు. పెద్ది రెడ్డి ఆస్తుల గురించి విచారణకు సిద్దమా అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డికి ఎక్కడ ఎన్ని ఆస్తులున్నాయో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు.
పెద్దిరెడ్డి అక్రమాలపై విచారణ
చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లు స్వతం త్రంగా వ్యవహరించడం లేదని, పెద్దిరెడ్డిని కాదని వ్యవహరించే స్వేచ్ఛ వారికి లేదని వర్ల రామయ్య అన్నారు. టిడిపి అధికారం లోకి వచ్చాక ఐదేళ్లుగా పెద్దిరెడ్డి ఇలాకాలో జరిగిన అరాచకాలను బయటికి తీస్తామని, వారి అరాచకాలపై ఒక కమిషన్‌ను వేస్తా మని,ఈ పోలీసు స్టేషన్లలో రిజిష్టర్ అయిన కేసులను ఇన్వెస్టిగేషన్ చేయాలని, రిజిష్టర్ కాని కంప్లైంట్స్ పై ఒక సమీక్ష జరగాలని అన్నారు. తాము చేసే విచారణలో పోలీసు లు, రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు ఏ విధంగా బానిసత్వం చేసింది రాష్ట్ర ప్రజ లకు తెలుస్తుందన్నారు. చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలితే సూర్యుడిపై ఉమ్మేసినట్లే అవుతుందని వర్ల రామయ్య హెచ్చరించారు.