.ఇదిగో మా దగ్గర ఉంది
.నవ్వులపాలవుతారనే దాచిపెట్టారు
.ఓ కామాంధుడికి సీఐడీ చీఫ్ వత్తాసా?
.ఆ వీడియోని ల్యాబ్‌కు పంపే దైర్యం జగన్‌రెడ్డికి ఉందా?
.బూతు పార్టీగా మారిన వైసీపీ
.మహిళలకు అండగా టీడీపీ
.మహిళలే వైసీపీని భూస్థాపితం చేస్తారు
.టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అమరావతి: డర్టీ వీడియో కేసు నుంచి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడు మాధవ్‌పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మాధవ్ బూతు పురాణం వెనుక దాగున్న వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన టీడీపీ నేతలపై బురదజల్లడంపై ప్రభుత్వం, సీఐడీ అధికారులు పెట్టిన శ్రద్ధ, డర్టీ ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవడంపై పెట్టలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళల్లో తీవ్ర అభద్రతాభావం ఏర్పడిరది. ఇటీవల సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ తో సీఐడీ విభాగంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. మాధవ్ డర్టీ వీడియో నిజమేనంటూ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టను సీఐడీ చీఫ్ దాచిపెట్టి ప్రజలను పక్కదారిపట్టిస్తున్నారు. జిమ్ స్టాఫర్డ్ సునీల్ కుమార్‌కు పంపిన నివేదిక నా దగ్గర ఉంది. సునీల్ కుమార్ మీ ప్రెస్ మీట్‌లో దీనిని ఎందుకు రిలీజ్ చేయలేదు. మీరు తప్పు చేయకుంటే టీడీపీ విడుదల చేసిన డాక్యుమెంట్, మీరు ఎక్లిప్స్ ల్యాబ్‌కు పంపిన డాక్యుమెంట్ ను ప్రజలకు వివరించాలి.
సునీల్ దాచిపెట్టిన నివేదికలోని అంశాలు ఇవే:
ఆగస్టు 9, 2022న ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధినేత జిమ్ స్టాఫోర్డ్‌కు ప్రసాద్ పోతిని పంపించిన వీడియోపై ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఇలా ఉంది.
Purpose:
I was asked by Mr.Pothini to determine if the video was authentic or if it had been altered/edited. Process and Examination Steps: It was represented to me that this video is of a face time video call.
సవరణలు జరిగిన తర్వాత వచ్చిన నివేదికలో ఇలా ఉంది.
Purpose:
I was asked by Mr.Pothini on Aug 9th, 2022 to determine if the video was authentic or if it had been altered/edited. Process and Examination Steps: It was represented to me that this video is of a video call.
‘‘సీఐడీ దాచిపెట్టిన నివేదిక, టీడీపీ విడుదల చేసిన నివేదికలో దాగున్న అంశాలు ఇవే’’
‘‘2022 ఆగష్టు 11న ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ అధినేత జిమ్ స్టాఫర్డ్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక(సీఐడీ చీఫ్ దాచిపెట్టిన)లో ప్రసాద్ పోతిని వీడియోను ల్యాబ్ కు ఏ తేదీన ఇచ్చారో లేదు. వీడియో కాల్ కు బదులు ఫేస్ టైం వీడియో కాల్ అని ఉంది. దీంతో ప్రసాద్ పోతిని ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేలా ఉండేందుకు నివేదికలో రెండు చిన్న సవరణలను ల్యాబ్ సిబ్బందిని కోరారు. అవి ఏమంటే 1. వీడియో ఇచ్చిన తేదీ Aఆగస్టు9, 2022 చేర్చాలని, 2. ఫేస్ టైం వీడియో కాల్ కు బదులు వీడియో కాల్ అని చేర్చాలని కోరారు. దీంతో ల్యాబ్ సిబ్బంది ఈ రెండు చిన్న సవరణలను చేసి అందించారు. ఈ రెండు సవరణలు తప్ప ఏ ఒక్క అంశాన్ని సవరించలేదు. దీనిపై సీఐడీ చీఫ్ స్టాఫర్డ్ ను ఈ మెయిల్ ద్వారా సంప్రదించగా, ఆయన తన జవాబులో స్పష్టంగా అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేని (not substantive) రెండు మైనర్ సవరణలు మాత్రమే కోరారని తెలియజేస్తూ, తనకు ప్రసాద్ పోతిని పంపిన వీడియో నిజమైనదేనన్న (Authentic and Un edited) విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సవరించిన నివేదిక ప్రసాద్ పోతిని గారికి తమ ల్యాబ్ సిబ్బంది ద్వారా అందిన విషయం జిమ్ స్టాఫర్డ్ దృష్టికి రాకపోవడంతో ఆయన తాను ఇచ్చిన ప్రాథమిక నివేదికను జతపరిచి సునీల్ కుమార్‌కు ఈమెయిల్ పంపారు. ఈ విషయం చాలా స్పష్టంగా రెండు నివేదికలను పోల్చి చూస్తే అర్థమవుతుంది. సునీల్ కుమార్ జిమ్ స్టాఫర్డ్ ప్రాథమిక నివేదికను ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయకుండా, ఏదో ఆకాశం బద్దలై భూమిమీద పడినట్లు చాలా ఘోరమైన తప్పిదం జరిగిపోయినట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ వీడియో నూటికి నూరుశాతం నిజమని స్టాఫర్డ్ తేల్చిన విషయం వాస్తవం. ప్రభుత్వానికి నమ్మకం కుదరకపోతే ఈ వీడియోను తక్షణమే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపించి వాస్తవం తెలుసుకోవాలి. ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా? నేను నిప్పులాంటి మనిషిని, కాలర్ ఎగరేసి చెబుతున్నా. ఏ ఒక్కరిని అకారణంగా టార్గెట్ చేయాల్సిన అవసరం టీడీపీకి లేదు. ఫేక్ రిపోర్టులు సృష్టించాల్సిన అవసరం అంతకన్నా లేదు.
డర్టీ ఎంపీని వెనకేసుకొస్తున్న సీఐడీ
డర్టీ ఎంపీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఏపీ పోలీసు వ్యవస్థ అతనిని వెనకేసుకురావడం అత్యంత సిగ్గుచేటు. దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఓ వైపు పబ్లిసిటీని ఊదరకొడుతూనే, మహిళలకు రక్షణ కల్పిండంలో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది.
ప్రభుత్వం మౌనం వల్లే రంగంలోకి దిగిన టీడీపీ
కోట్లాది మహిళల మనసుల్ని గాయపర్చిన గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోని చూసి టీడీపీగా మేం స్పందించాం. ల్యాబ్ అధినేత జిమ్ స్టాఫర్డ్ కు వీడియోను పంపి, రిపోర్టు తీసుకున్నాం. రిపోర్టులో చాలా క్లియర్ గా »That the video shown in this recording is authentic and un-edited అని పేర్కొన్నారు. ఎక్లిప్స్ ల్యాబ్ రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో ఉంచి, ఎవరైనా చెక్ చేసుకోండని ఛాలెంజ్ విసిరాను. మేం ఫేక్ డాక్యుమెంట్ విడుదల చేస్తే ఛాలెంజ్ చేయగలనా? మేం తప్పు చేయలేదు గనుకనే ఆ రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఉంచి సవాల్ విసిరాను. ఒరిజినల్ డాక్యుమెంట్ ను మీడియా మిత్రులకు ఎందుకు రిలీజ్ చేయలేదో సునీల్ కుమార్ చెప్పాలి. నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఈ వీడియోను ఎందుకు పంపడంలేదో చెప్పండి. వైసీపీ నాయకులకు ఐపీసీ సెక్షన్లు వర్తించవా? వాళ్లు ఎటువంటి తప్పులు చేసినా, ఫేక్ నివేదికలు సర్క్యులేట్ చేసినా సీఐడీ పోలీసులకు కనిపించవా, కనిపించినా కనిపించనట్లు నటిస్తున్నారా?
డర్టీ ఎంపీపై రాష్ట్రపతి, మహిళాకమిషన్‌కు ఫిర్యాదు
ఎంపీ మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పట్ల రాష్ట్రంలోని మహిళలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని వివిధ మహిళా సంఘాల నాయకురాళ్లు, పార్టీ ప్రతినిధులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, డర్టీ ఎంపీ వ్యవహారశైలిపై రాష్ట్రపతిని, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్‌ను కలిసి ఫిర్యాదు, నివేదికలు ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలను పరిశీలిస్తే వాటిలో దోషులుగా వైసీపీ నాయకులే తేలుతున్నారు.
మహిళలకు టీడీపీ పెద్దపీఠ
మహిళలకు పెద్దపీట వేసిన పార్టీగా టీడీపీ మహిళల పక్షాన ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకోవాలి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారకరామారావు మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పించారు. దేశంలో ఇదొక చరిత్ర. తదనంతరం చంద్రబాబు మహిళలు స్వశక్తితో బ్రతకాలనే సదుద్దేశంతో డ్వాక్రా సంఘాలను ప్రారంభించారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ఏపీకి వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాల వ్యవస్థను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి, చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.
క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ మా నినాదం
ఏపీని జగన్‌రెడ్డి అనే నియంత కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలనే దృఢసంకల్పంతో మేము మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నాం. జగన్ రెడ్డి సర్కారు కూడా నాటి బ్రిటీషు పాలకుల మాదిరిగా మాపై కేసులు పెట్టి, వేధించాలని చూస్తోంది. అయినా భయపడకుండా పోరాటం చేస్తాం. మా నాయకుడు చంద్రబాబు అందించిన ‘క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునే వరకు పోరాడతాం.
వైసీపీని మహిళలే భూస్థాపితం చేస్తారు
మీ నాయకుడిలా మా నాయకుడు జైలులో చిప్పకూడు తినలేదు. 18 కేసుల్లో నిందితుడు కాదు. సొంత బాబాయ్‌ని గొడ్డలితో చంపలేదు. సొంత తల్లిని, చెల్లిని రోడ్డున పడేయలేదు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైసీపీ నాయకులకు ఈ అవకాశం లేదు. వైసీపీని రాష్ట్రంలోని మహిళలే భూస్థాపితం చేస్తారు.