- జగన్ రెడ్డి తీరుతో పులివెందులకు చెడ్డపేరు
- విద్వేష రాజకీయాలతో నైతికంగా పతనం
- అన్నివర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత
- సమీక్షల్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
- 126 నియోజకవర్గాల్లో మగిసిన సమీక్ష
అమరావతి : పార్టీ అధి ష్టానం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా నేతల పని తీరు మెరుగుపరుచుకోకపోతే, దానికి అనుగుణంగానే తమనిర్ణయాలు ఉంటాయని టిడిపిఅధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. నియోజకవర్గ సమీక్షల తర్వాత కూడా కొందరు నేతలు యాక్టివ్ కాలేదని తన దృష్టికి వచ్చిం దని, అటువంటి నేతల విషయంలో త్వరలో కఠిన నిర్ణ యాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టంచేశారు. గత రెండురోజులుగా పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండ నియోజకవర్గా లపై అధినేత సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 126 నియోజక వర్గాల ఇంచార్జ్‌లతో సమీక్షలు ముగిశాయి. జగన్‌రెడ్డి తీరుతో తనను ఎన్నుకున్న పులివెందులకూ చెడ్డపేరు వస్తోందని,ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యాడు. ఆయనకు ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్స్ చివరిచాన్స్‌గా మిగిలిపోతుందని అన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌ల ముఖాముఖి భేటీ సందర్భంగా బుధవారం పాలకొండ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ, తుని ఇన్‌చార్జి యనమల కృష్ణుడు, పాడేరు ఇన్చార్జి గిడ్డి ఈశ్వరిలతో సమావేశ మయ్యారు. జగన్‌రెడ్డి రివర్స్ పాలనతో సొంత నియోజ కవర్గ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత తెచ్చుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వివేకా హత్యపై సమాధానం చెప్పలేక, విద్వేష రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యాడని తెలిపారు. బాబాయ్ హత్యకేసులో స్వయంగా ముఖ్యమంత్రి దోషులను కాపా డడం స్థానిక ప్రజలకు కూడా మింగుడుపడడం లేదని అన్నారు. అన్ని వర్గాల్లో వైసిపిప్రభుత్వంపై పూర్తివ్యతి రేకత ఉందని,ఈ పరిస్థితిని రాజకీయంగానియోజకవర్గ ఇన్చార్జిలు అనుకూలంగా మలచుకోవాలని సూచిం చారు. ప్రజాసమ స్యలపై పోరాటం,పార్టీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని అన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు,మెంబర్ షిప్,పార్టీ కార్యక్రమాల నిర్వహణపైనా నేతలతో అధినే త సమీక్షలు జరి పారు. గ్రామస్థాయి వరకు గ్రూపులు అనే అంశమే ఉండకూడదని.. ఇంచార్జ్‌లు అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. ఇంచార్జ్‌లతో రివ్యూ ల అనంతరం వారి పనితీరులో మార్పు వచ్చిందా లేదా అనే అంశం పైనా సమాచారం తెప్పించుకుంటున్నా మని చంద్రబాబు పేర్కొన్నారు.