- వందలాది ఎకరాల ఎసైన్డ్ భూములు దోచిందెవరు?
- ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసుపెట్టిందెవరు?
- దొంగే దొంగ అని అరిచినట్లుగా జగన్‌రెడ్డి వైఖరి
రాష్ట్రంలో రాజధాని భూముల విషయంలో కుంభకోణం జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హడావిడి చేస్తున్న తీరుచూస్తే దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాకారం చేసేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాన్ని వైసిపి ప్రభుత్వం తప్పుబడుతూ ఎదురుదాడి చేయడం వెనుక మర్మమేమిటో 5కోట్ల ఆంధ్రులు ఇప్పటికే గుర్తించారు. ఎవరినైనా ఒకసారి మోసపోతారు కానీ..పదేపదే మోసపోరన్న సత్యనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలి.
అసైన్డ్ భూములకు ప్యాకేజి ఇవ్వడమే నేరమా?
జీవో41 ద్వారా అసైన్‌మెంట్‌దారులకు లాండ్ పూలింగ్ ప్యాకేజీ ఇచ్చినందుకు చంద్రబాబు నేరస్థుడైతే, జీవో నెం.72ద్వారా విశాఖలో అసైనీలకు లాండ్ పూలింగ్ ప్యాకేజీ ఇచ్చిన జగన్‌రెడ్డి కూడా నేరస్థుడే. అమరావతిలో 500ఎకరాలు అసైన్‌మెంట్ భూములు చంద్రబాబు రాష్ట్ర రాజధానికి తీసుకుంటే, విశాఖలో జగన్‌రెడ్డి 2500ఎకరాల అసైన్‌మెంట్ భూములు అమ్మకానికి తీసుకోవడం పెద్ద నేరం కాదా? లేపాక్షి, వాన్ పిక్ లాంటి ప్రైవేటు సంస్థలకు అసైన్ మెంటు భూములు కట్టబెట్టడం జగన్‌కుటుంబం నేరం కాదా? జీవో నెం.41 ద్వారా దళితులకు భూమిపై హక్కు కల్పించడం నేరమా? దళితులు, బడుగువర్గాల అసైన్ మెంట్ భూములకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించడం ఏ రకంగానూ నేరం కాదు. పైగా సామాజిక న్యాయం చేకూర్చడం అవుతుంది ల్యాండ్‌పూలింగ్ పాలసీని క్యాబినెట్ ఆమోదించి, దాని అమలుకు జీవో నెం.1 విడుదల చేసింది. అసైన్‌మెంట్ రైతులకు రెసిడెన్షియ ల్ కోటాలో 800 చ.గ.లతోపాటు కమర్షియల్ ప్లాటు 100 చ.గ., జరీబు రైతులకు 800 చ.గ.లతోపాటు కమర్షియల్ 200చ.గ. కేటాయించారు. వార్షిక కౌలు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించారు. దీని పై దళిత,బడుగువర్గాల రైతులు ఈ ప్యాకేజీని మరింత పెంచాలని విజ్ఞప్తిచేశారు. అలాగే పిల్లల చదువు తదితర అవసరాలకు తమకు కేటాయించిన ప్లాట్లలో అవ సరమైన మేరకు అమ్ముకొనే హక్కు కల్పించమన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుని బ్రతుకుతున్న ఆక్రమణదారులు కూడా తమ భూమిని తీసుకుంటే ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని, 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని వీరికి కూడా న్యాయం చేకూరుస్తూ జీవో నెం.1కి కొన సాగింపుగా జీవో.41 విడుదల చేయడమైంది. దీని ప్రకారం భూయజమానులుగా వున్న దళితులు, శివాయిజమేదారులు,భూమి సాగుదారుల పేరుతో ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమైంది. రిజిస్ట్రేషన్‌కు ముందు ఒకవేళ ఎవరైనా అసైన్‌మెంట్ భూములను కొనుగోలు చేసివున్నావారి పేరుతో ప్రభుత్వం వారికి రిజిస్ట్రేషన్ చేయలేదు. అసైన్‌మెంట్‌దారులైన దళితులు, బడుగుల పేర్లతోనే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. ఇందులో చట్ట వ్యతిరేకత ఏమున్నది?
జి.ఓ నెం.41పై తప్పుడు ప్రచారం
అసైన్డ్ భూములు కొన్న అగ్రకులస్తులకు చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని, అది నేరమని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. భూయజమానులైన దళితులు, బడుగు వర్గాలకు మాత్రమే ప్రభుత్వం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఇది పూర్తి గా చట్ట సమ్మతం. దళిత, బడుగులకు లబ్ధి చేకూర్చిన విధానం.జీవో నెం.41కి కేబినెట్ ఆమోదం లేదని, అది చట్టవ్యతిరేకమని మరో దుష్ప్రచారం చేస్తున్నారు. జీవో నెం.1కి కేబినెట్ ఆమోదం ఉన్నది. జీవో నెం. 41 కూడా జీవో1 కొనసాగింపు మాత్రమే. జీవో 41 లాగే జగన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖలో అసైన్‌మెంట్ భూ ములు తీసుకోవడానికి 2020జనవరి 25న జీవో 72 విడుదల చేసింది. ఈజీవోకు కేబినెట్ ఆమోదం లేదు.
దళితుల భూములు కబ్జాచేసిందెవరు?
దళిత ద్రోహులెవరు? వేలాది అసైన్‌మెంట్ భూ ములు స్వాహా చేసిందెవరు?ఇడుపుల పాయతో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం లో 700ఎకరాలకు పైగా జగన్‌రెడ్డి కుటుంబం అసైన్ మెంట్ భూములను కబ్జాచేసి అనుభవించింది. ఈ నేరాల నుండి శిక్ష తప్పించుకునేందుకు జగన్‌రెడ్డి తండ్రి 2007లో ఏపీ అసైన్‌మెంట్(పీఓటి)యాక్ట్ 1977 సెక్షన్ 7(1)కు సవరణ చేసి దళితులకు అన్యాయం చేశారు. రైత్వారీ పట్టాదారు హక్కువలె దళిత అసైన్ మెంట్‌దారులకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పిస్తూ చంద్రబా బు ఇచ్చిన జీవో 41ను నీరుగారుస్తూ జగన్‌రెడ్డి ప్రభు త్వం జీవో 44విడుదల చేసి రిజిస్ట్రేషన్ హక్కును రద్దు చేసి,దళితుల హక్కు కాలరాశారు. అంటే చంద్రబా బు తాత్కాలిక ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులుగా చేస్తూ ప్రమోషన్ ఇస్తే, జగన్‌రెడ్డి వారిని తిరిగి తాత్కా లిక ఉద్యోగులుగా మార్చి డీప్రమోట్ చేసి నట్లుగా ఉన్నది జీవో 44. ఇది దళిత ద్రోహం కాదా?
2019 ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం అసైన్ మెంట్ చట్టానికి సవరణచేసి 2019జనవరికి ముందు వున్న అసైన్‌మెంట్ పట్టాదారులకు రెగ్యులర్ పట్టాలు ఇచ్చే చట్టం చేసింది. దీన్ని కొనసాగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ, ఇతరవర్గాల అసైన్‌మెంట్ భూములకు జగన్‌రెడ్డి ప్రభుత్వం రెగ్యులర్‌పట్టాలు ఇవ్వకపోగా,ఈ భూముల్ని సోలార్ కంపెనీలకు కట్టబెడుతూ 2020 నవంబర్ 7న జీవో నెం.25ను విడుదలచేయడం దళి త, బడుగులకు ద్రోహం చేయడం కాదా?
వేలాదిఎకరాల దళితుల భూమి లాక్కున్నది ఎవరు?
సెంటు పట్టా పేరుతోను, ఇతరత్రా ప్రభుత్వం దాదాపు 10 వేల ఎకరాల అసైన్‌మెంట్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొన్నది. జగన్‌రెడ్డి తండ్రి 104 సెజ్‌లకు వేలాది ఎకరాల అసైన్‌మెంట్ భూము లను ధారాదత్తం చేశారు. నామమాత్ర పరిహారం మాత్రమే ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం 500ఎకరాల అసైన్ మెంట్ భూములను తీసుకొని వారికి పట్టాదారులతో పాటు కుడి ఎడమగా పరిహారంగా ప్లాట్లు కేటాయిం చి, వాటికి రిజిస్ట్రేషన్ హక్కు కల్పించింది. దీన్ని వైకాపా నేతలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరచినట్లుగా చంద్రబాబు కు నేరం అంటకడుతున్నారు.
దళితుల భూములకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించింది ఎవరు?
అసైన్‌మెంట్ భూములకు రిజిస్ట్రేషన్‌హక్కు కల్పించమని రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ, అగ్ర కుల పేదలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను అభ్యర్థి స్తున్నారు. డిమాండ్‌చేస్తున్నారు.పేదల్లోని ఈన్యాయ మైన వాంఛను గౌరవించి చంద్రబాబు ప్రభుత్వం 2015జీవో1 విడుదలచేసింది.2016లో దాన్ని జీవో నెం.41 ద్వారా మంత్రి పరిపుష్టం చేసింది. 2019 లో ఏపీ అసైన్‌మెంట్(పీఓటి) యాక్ట్ 1977కు సవర ణలుచేసి 2019ఫిబ్రవరి నెలకుముందు ఉన్న అసైన్ మెంట్ భూములకు రిజిస్ట్రేషన్ హక్కులుకల్పించింది.
ఏ రైతు ఈ జీవోలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ల లేదు. వైసీపీ కూడా కోర్టులో సవాల్ చేయలేదు. ఆరేళ్ల తరువాత ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పెరికే పని చేస్తున్నారు. జీవోలను వక్రీకరిస్తున్నారు. పేదల కు మేలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ, నాటి గుంటూరు జిల్లా యువ దళిత ఐఏఎస్ అధికారి కాంతీలాల్‌దండే పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద జగన్‌రెడ్డి ప్రభు త్వం అక్రమ కేసులు పెట్టింది. అట్రాసిటీ చట్టాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వంతన స్వార్థప్రయోజనాలకు, రాజ కీయ కక్షసాధింపులకు దుర్వినియోగం చేస్తున్నది. ఇది దళిత విద్రోహ చర్య. స్థానిక ఎన్నికల్లో అక్రమ మార్గంలో పొందిన గెలుపుతో అధికార దుర్వినియో గం లక్ష్మణరేఖ దాటుతున్నది.
– గురజాల మాల్యాద్రి, చైర్మన్, టిడిపి నాలెడ్జి సెంటర్