- వివేక హత్య కేసుకు అడ్డు తగులుతున్న అదృశ్య శక్తి ఎవరు?
- సీబీఐనే భయపెడుతున్న ఘనులు
- చెల్లి సునీతకే రక్షణ లేకుంటే రాష్ట్రంలో మహిళా భద్రత ఎక్కడ?
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అమరావతి: వివేక హత్య కేసుకు అడుగడుగునా అడ్డు తగులుతున్న అదృశ్య శక్తి ఎవరు? అని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేసిన జగన్‌రెడ్డి బాబాయి వివేకానంద హత్య కేసు సంచలనంగా మారినవిషయం జగద్విదితం. దర్యాప్తు కు అడ్డుపడుతున్న అజ్నాత వాసి ఎవరు? వివేక హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తులకు కోట్ల రూపాయ లు ఖర్చు చేస్తుందెవరు? వారిని కాపాడేందుకు సుప్రీం కోర్టులోఒక్కసారి వాదించేందుకు రూ.50లక్షలు తీసుకునే లాయర్లని నియమిస్తున్న అదృశ్యశక్తి ఎవరు? అభిషేక్ మనూ సింగ్వి లాంటి ప్రఖ్యాత లాయర్లని నియమించిందెవరు?
సీబీఐనే భయపెడుతున్న ఘనులు
కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను భయపెడుతున్నదెవరు? దేశంలో ఎన్నడా సీబీఐ అధికారులని బెదిరించిన సంఘటనలు చూడలేదు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ మంజూరు చేయడానికి లోకల్ కోర్టు నిరాకరించింది. హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వ లేదు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించడానికి రూ.50 లక్షలు ఫీజు చెల్లించి అభిషేక్ మనూ సింగ్విని నియమించుకునేంత ధనవంతుడు కాదు. అతనికి సాయం చేస్తున్న అదృశ్య శక్తి ఎవరో ప్రజలందరికి తెలియాలి. గ్రీన్ ట్రిబ్యూనల్ దగ్గర పోలవరం గురించి మాట్లాడటానికి వెళ్లాల్సిన అభిషేక్ మనూ సింగ్వి వివేక హత్య కేసు ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ మంజూరు చేయించే పనిలో ఉన్నారు. జగన్‌రెడ్డికి పోలవరం, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఏమైనా పర్వాలేదా? వైసీపీ ప్రభుత్వం న్యాయవాదులకు ఖర్చు చేస్తున్నాదానిపై సుప్రీం కోర్టు వివ రణ కోరింది. అయినా సిగ్గు,ఎగ్గు లేకుండా విలేకరుల సమావేశం పెట్టిఏదేదో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చట్టాలు, న్యాయస్థానాలు, పోలీసులు, ఎవరికీ బయ పడటం లేదనేది ప్రజలు తెలుసుకోవాలి. ఇటువంటి వారికి ఓట్లేసి గెలిపించకూడదని ప్రజలు తెలుసుకో వాలి. జీవోలు ఇచ్చి మరీ లాయర్లకి అడ్వాన్సుటా కోటి రూపాయలు చెల్లించారు. అడ్వాన్సే కోటి ఉంటే మొత్తం ఫీజు ఎంతఉంటుందో? లాయర్‌కి ఇంత పెద్ద మొత్తం లో ఫీజు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదు. వీటన్నిటి వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో బయట పెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
శివశంకర్ రెడ్డిని మించిన కుట్రదారులు ఎవరు?