- ఐదేళ్ల విధ్వంసంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
- బడ్జెట్‌కూడా పెట్టుకోలేని దుస్థితికి తెచ్చారు
- తుగ్లక్ నిర్ణయంతో రాజధాని కలను చంపేశారు
- ప్రభుత్వ ఆదాయాన్ని విచ్చలవిడిగా దోచేశారు
- అసెంబ్లీలో మరో 3 శ్వేతపత్రాల విడుదల చేస్తాం
- రెండునెలల తర్వాత బడ్జెట్ ప్రవేశ పెడతాం
- కేంద్రం సాయంతో అమరావతికి మంచిరోజులు
- ఆర్థికమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
- శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): హూ కిల్డ్ బాబాయ్? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై తీర్మానించిన ప్రతిపాదనను బలపరుస్తూ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారు. సీబీఐకి విషయం చెప్పడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో సీఐకి పదోన్నతి కల్పించింది. విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి. నేరస్థుడే సీఎం అయితే పోలీసులూ వంతపాడారు. వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి. ఎన్ని జరిగినా `హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం
ఆర్థిక ఇబ్బందులవల్ల బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అందుకే `రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చాం. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెను మార్పులకు నాంది పలికాయి. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. నాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ తెలుగువాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి. తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా ఎన్టీఆర్ చేశారు. క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెదేపా, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం భాజపా కూడా ముందుకొచ్చింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నరకం చూశారు. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవరకు సమష్టిగా ముందుకెళతాం.
అమరావతికి మళ్లీ మంచి రోజులు
అమరావతిని సర్వ నాశనం చేశారు. రాజధాని కలను చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటిది నిన్నటి వరకు ఏమైందో మనం చూశాం. కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటా యించింది. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే, దాదాపు రెండు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద వచ్చి ఉండేది. ఈరోజు అప్పులు చేయాల్సిన అవస్థ తీరేది. తెదేపా హయాంలో ఏపీ జీవనాడి పోలవరం 72 శాతం పూర్తయింది. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మార్చడం.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం చేశారు. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మరో 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తాం
ప్రభుత్వ ఆదాయం ఐదేళ్లలో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం వంటివి రూ.లక్షల కోట్లమేర దోపిడీ జరిగాయి. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధిలేక ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైంది. 2019 నుంచి రాష్ట్ర వృద్ధిరేటు పడిపోయింది. మూలధనాన్ని 60 శాతం మేర తగ్గించారు. జలవనరులపై 56 శాతం, రోడ్లపై 85 శాతం మూలధనం తగ్గింది. రాష్ట్రంలో తప్పకుండా రోడ్లను బాగుచేస్తాం. రేపటినుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతాం అని చంద్రబాబు ప్రకటించారు.
హు కిల్డ్ బాబాయ్?
త్వరలోనే జవాబు చెప్తా
ఐదేళ్ల విధ్వంసంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
బడ్జెట్‌కూడా పెట్టుకోలేని దుస్థితికి తెచ్చారు
తుగ్లక్ నిర్ణయంతో రాజధాని కలను చంపేశారు
ప్రభుత్వ ఆదాయాన్ని విచ్చలవిడిగా దోచేశారు
అసెంబ్లీలో మరో 3 శ్వేతపత్రాల విడుదల చేస్తాం
రెండునెలల తర్వాత బడ్జెట్ ప్రవేశ పెడతాం
కేంద్రం సాయంతో అమరావతికి మంచిరోజులు
ఆర్థికమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
శాసనసభ సమావేశాల్లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): హూ కిల్డ్ బాబాయ్? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై తీర్మానించిన ప్రతిపాదనను బలపరుస్తూ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారు. సీబీఐకి విషయం చెప్పడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో సీఐకి పదోన్నతి కల్పించింది. విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి. నేరస్థుడే సీఎం అయితే పోలీసులూ వంతపాడారు. వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి. ఎన్ని జరిగినా `హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం
ఆర్థిక ఇబ్బందులవల్ల బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అందుకే `రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చాం. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెను మార్పులకు నాంది పలికాయి. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. నాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ తెలుగువాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి. తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా ఎన్టీఆర్ చేశారు. క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెదేపా, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం భాజపా కూడా ముందుకొచ్చింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నరకం చూశారు. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవరకు సమష్టిగా ముందుకెళతాం.
అమరావతికి మళ్లీ మంచి రోజులు
అమరావతిని సర్వ నాశనం చేశారు. రాజధాని కలను చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటిది నిన్నటి వరకు ఏమైందో మనం చూశాం. కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటా యించింది. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే, దాదాపు రెండు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద వచ్చి ఉండేది. ఈరోజు అప్పులు చేయాల్సిన అవస్థ తీరేది. తెదేపా హయాంలో ఏపీ జీవనాడి పోలవరం 72 శాతం పూర్తయింది. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మార్చడం.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం చేశారు. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మరో 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తాం
ప్రభుత్వ ఆదాయం ఐదేళ్లలో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం వంటివి రూ.లక్షల కోట్లమేర దోపిడీ జరిగాయి. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధిలేక ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైంది. 2019 నుంచి రాష్ట్ర వృద్ధిరేటు పడిపోయింది. మూలధనాన్ని 60 శాతం మేర తగ్గించారు. జలవనరులపై 56 శాతం, రోడ్లపై 85 శాతం మూలధనం తగ్గింది. రాష్ట్రంలో తప్పకుండా రోడ్లను బాగుచేస్తాం. రేపటినుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతాం అని చంద్రబాబు ప్రకటించారు.
సీపం చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు
పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే మద్రాసుతో వేరుపడి ప్రత్యేకంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది. 1953 అక్టోబరు 1న కర్నూలు కేంద్రంగా మొదట ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఆంధ్ర- తెలంగాణ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైంది. దేశంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికింది. 2014లో మళ్లీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. దీంతో శాశ్వత చిరునామా లేకుండా మనం ఇబ్బంది పడ్డాం.
నవ్యాంధ్ర ఏర్పడి పదేళ్లైంది. అయినా రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. తెలుగుదేశం హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే… గత ప్రభుత్వం మూడు రాజధానుల ముచ్చట తీసుకొచ్చింది.
ఆర్థిక ఇబ్బందులవల్ల కనీసం బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గత పాలకుడి వైఫల్యమే ఈ దుస్థితికి కారణం. అందుకే మళ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిరది.
పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణ వల్ల పబ్లిక్ ప్రవేటు పార్టనర్ షిప్ పెరిగింది. నరేంద్రమోడీ తీసుకొచ్చిన వికసిత్ భారత్ 2047 విజన్‌లో భాగంగా ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
మనమంతా సమష్టిగా పనిచేస్తే రాష్ట్రాన్ని నెంబర్‌వన్ చేసుకోవచ్చు. సుమారు 2, 3 కోట్లమంది తెలుగువాళ్లు విదేశాల్లో ఉన్నారు. ఎక్కువమంది అమెరికాలో ఉన్నారు. అమెరికాలో గత పాతికేళ్లలో వచ్చిన మార్పువల్ల మన భారత సంతతికి చెందిన వారి తలసరి ఆదాయం 1.19 లక్షల డాలర్లుగా ఉంది. తరువాత తైవాన్ సంతతికి చెందిన వారి తలసరి ఆదాయం 95,700 డాలర్లుగా ఉంది.
గత ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. మారుమూల ప్రాంతాల్లో సరైన టీచర్లు లేకుండా చదువుకున్న వాళ్లూ అత్యధిక ఆదాయం సాధిస్తున్న స్థితిలో ఉన్నారు. అది తెలుగువారి సామర్థ్యం.
గత ఐదేళ్లలో జరిగిన పరిస్థితులు సభలో నెమరు వేసుకోవడం చాలా అవసరం. జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయి. ఇది ప్రజా చైతన్యానికి నిదర్శనం. ఎన్డీయే కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. చరిత్రలో ఏ పార్టీకి ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. ఇది మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం. ఎంపీలకు సాధారణంగా 90 వేలు 80 వేలు మెజార్టీ వస్తుంది. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులకు 90 వేల పైన మెజార్టీ రావడం సంతోషకరం.
రాష్ట్రాభివృద్ధి కోసం నిలబడిన వ్యక్తి పవన్ కల్యాణ్. నన్ను అరెస్టు చేసినప్పడు జైలుకొచ్చి పరామర్శించి అనంతరం ప్రభుత్వ ఓట్లు చీలకూడదని పొత్తు ప్రకటించారు. టీడీపీ, జనసేన కలిసిన తర్వాత బీజేపీ కూడా కలయికకు ముందుకొచ్చింది. మూడు పార్టీలు కలిసి సునామీ సృష్టించాయి. ఈ విజయాన్ని ఎవ్వరూ ఊహించలేదు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి అన్ని విధాలా అభివృద్ధి చేసేవరకు ఏమాత్రం ఆలోచించకుండా సమైఖ్యంగా ముందుకు వెళ్దామని సభ ద్వారా హామీ ఇస్తున్నాం.
మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం కోసం, తమ బిడ్డల కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రజలు గొప్ప తీర్పునిచ్చారు. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు సైతం వచ్చి ఓట్లు వేశారు. వివిధ దేశాల్లో ఉండే తెలుగువారు సైతం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ఎప్పుడూ ఓటేయడానికి రానివాళ్లు కూడా వచ్చి అర్థరాత్రి వరకూ ఉండి ఓట్లేశారు. వాళ్లందరికీ నేను సభ ద్వారా శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా.
ఐదేళ్లపాటు ప్రజలు నరకం చూశారు. నరకమంటే ఎలా ఉంటుందో గతంలో చూశాం. రాష్ట్ర చరిత్రలో గత పాలనలో చీకటి రోజులు చూశాం. ఆస్తుల సెటిల్ మెంట్, దొరికిన భూములు, 40 ఏళ్లుగా సంపాయించిన ఆస్తులను సైతం మెడమీద కత్తి పెట్టి రాయించుకున్నారు.
ఆడబిడ్డల ప్రాణానికి రక్షణ లేదు. మనిషి ప్రాణానికి విలువ లేకుండా చేశారు. క్షేమంగా ఇంటికి తిరిగొస్తామనే ఆశ ఎవ్వరికీ లేని పరిస్థితిని గత ఐదేళ్లు చూశాం. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులే. ఇదే సభలో ఉన్న సభ్యులు కూడా గత ప్రభుత్వంలో చాలామంది ఇబ్బందులకు గురయ్యారు.
స్పీకర్ స్థానంలో కూర్చొన్న మీలాంటి వ్యక్తిపెనా అత్యాచారయత్నం కేసు పెట్టి వేధించారు. ఇవన్నీ తలచుకుంటే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టారు. రఘురామకృష్ణరాజు ఏమవుతాడో తెలియని పరిస్థితిని కల్పించారు.
ఉపాధి లేదు. ఉద్యోగాలు లేవు. బాధపడని వర్గం లేదు. జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. అంతటా అభద్రత, అశాంతి, ఆందోళన, అసంతృప్తి. వీటన్నిటినీ భరించలేకే కూటమికి భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. గతంలో అహంకారంతో విర్రవీగిపోయారు. అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థలను ఏవిధంగా నాశనం చేశారో చూశాం. రాష్ట్రం బ్రాండ్ ఇమేజీని దెబ్బతీశారు.
వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది. కాలువల్లో పూడిక తీయలేని పరిస్థితి. వర్షాలు పడితే పొలాలన్నీ నీట మునిగిపోయే పరిస్థితి కల్పించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఉన్న ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేకపోయారు. కొన్ని చోట్ల గేట్లు కొట్టుకుని పోతే తిరిగి వాటిని అమర్చలేని పరిస్థితి. అంతటి భయంకరమైన పాలనను మనం చూశాం.
ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారయ్యాయి. అమరరాజా పరిశ్రమను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టారు. చివరకు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి కల్పించారు. సొంతరాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి కల్పించారు.
దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగం ఉన్న రాష్ట్రం ఏపీ. ఐదేళ్లలో విపరీతంగా క్రైం రేటు పెరిగింది. దళితుల హత్యలు పెరిగాయి. ఇన్ని చేసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అసెంబ్లీకి ప్లకార్డు పట్టుకుని రావడం విడ్డూరం. దళితుడి శవాన్ని డోర్ డెలివరి చేసిన వ్యక్తి కూడా ఆ ప్లకార్డు పట్టుకుని వచ్చాడు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని నేనెప్పుడూ మరచిపోలేను. బాధలు భరించలేక అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించనటువంటి నాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కారణాల వల్ల ఒకతను చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢల్లీిలో ధర్నా చేయడానికి వెళ్లాడు. సభకు వచ్చే ధైర్యం అతనికి లేదు.
డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన నేరానికి అతడ్ని వేటాడి వేటాడి పిచ్చివాడ్ని చేసి నడిరోడ్డులో చంపేశారు. పెంచిన మద్యం రేట్ల గురించి విమర్శించాడనే నెపంతో ఓంప్రతాప్‌ను చంపి ఆత్మహత్య కింద సృష్టించారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి బాలుడిపైన అమర్నాథ్ గౌడ్… తన అక్కని అవమానిస్తున్నారని ప్రశ్నించినందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు. నిందితులకు రక్షణ కల్పించారు.
సభలో నాకు జరిగిన అవమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ రోజు నేను చాలా బాధపడ్డా, గత పాలకులు చేసిన అవమానానికి. ఇది కౌరవ సభ, ఈ సభలో నేనుండను. దీన్ని గౌరవ సభ చేసిన తరువాత మళ్లీ అడుగుపెడతాను అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చాను. నా బాధను చెప్పుకోవడానికి కూడా నాకు మైకు ఇవ్వలేదు. పవన్ కల్యాణ్‌ను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా విమర్శించారు.
రూ.41 వేల కోట్లు అవినీతి జరిగిందని సీబీఐ ఛార్జిషీటు వేసింది. అది చూసిన తరువాతైనా మారతారని నేను అనుకున్నాను. డబ్బుల పిచ్చితో ఇసుక మద్యం, మైనింగ్, భూములు, సెటిల్‌మెంట్లు చేసి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నా భిన్నమైపోయింది. 2014-2019 మధ్య అభివృద్ది సీఏజీఆర్ 13.5 శాతం ఉంది. 2019 నుంచి యధేచ్చగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది.
మూల ధన వ్యయాన్ని 60 శాతం తగ్గించేశారు. జలవనరులపై 56 శాతం ఖర్చు తగ్గించారు. రోడ్లపైన 85 శాతం తగ్గించారు. ఈ రోజు రోడ్లు చూస్తే ప్రభుత్వానికి ఒక సవాల్‌గా మారింది. ఈ రోడ్లన్నీ మళ్లీ బాగుచేసే బాధ్యత తీసుకుంటున్నాం.
రెవెన్యూ వార్షిక వృద్ది రేటు 12.8 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గిపోయింది. మూలధన వ్యయం వృద్ది 26.4 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గిపోయింది. ఒక శాతం వృద్ధి రేటువల్ల రూ.15వేల కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఈరోజు 10 శాతం వృద్ధి రేటును 15 శాతం చేయగలిగితే రూ.75వేల కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కానీ అభివృద్ధి తగ్గిపోయింది.
రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కొండంతా తొలిచేసి ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్ ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆతిధ్యం కోసం కట్టామంటున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యాక ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా రిషికొండ ప్యాలెస్ సందర్శిస్తాను. ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎవరికివ్వాలి, ఏం చేయాలి? 7 స్టార్, 9 స్టార్ హోటల్స్ కూడా దాని ముందు ఏం పనిచేయవు. అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చి శిథిలాలు కూడా తీయలేదు. అందుకే కసిగా అమరావతి నిర్మాణం కోసం ముందుకెళదాం.
విద్యుత్తు రంగంపై రూ.1.29 లక్షల కోట్లు అప్పులున్నాయి. ఒక్క మైనింగ్ డిపార్టుమెంటు రూ.20 వేల కోట్లు దోచుకున్నారు. ఇసుక దోపిడి జరుగుతోందని ఎవరైనా రోడ్డుమీదకు వస్తే ఇంటి వద్దనే వాళ్లందర్నీ నిర్బంధించి పోలీసు కాపలాలు పెట్టారు. ఒక వ్యక్తి చెడ్డ వాడు అయితే కుటుంబం నష్టపోతుంది. పాలకుడు నేరస్థుడు, దోపిడీదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. 2019లో నేను దండం పెట్టి అడిగినా, ప్రజలు కూడా ఆశపడ్డారు ఏదో చేస్తాడని నమ్మారు.
శాశ్వతంగా రాజకీయాలకు అర్హతలేని వ్యక్తి జగన్. రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండటానికి అర్హత లేదు. చిన్న పార్టీకి చెందిన నాయకుడిపైన అయినా దాడి చేయాలన్నా, విమర్శించాలన్నా భయపడే రోజులుండేవి. అవన్నీ పోయి ఇష్టానుసారం ప్రవర్తించారు. పులివెందులలో ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు ఓట్లేస్తే వీళ్లు గెలవలేదు. ఎవరైనా వేరే పార్టీకి వేస్తే వాళ్లుఅక్కడ బతకరు. ఎన్నికలయ్యాక కూడా కక్ష తీర్చుకునే పరిస్థితి. ఉమ్మడి కడపజిల్లాలో 7 సీట్లు ఇచ్చారు. పులివెందులలాగా రాష్ట్రమంతటా తయారు చేస్తానని ఆయన అంటుండేవాడు. 25 నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రయత్నించారు.
నా రాజకీయ జీవితంలో ఏ నాడూ హత్యకు హత్యే సమాధానంగా వ్యవహరించలేదు. కక్ష రాజకీయాలకు వెళితే రావణకాష్టంగా మారుతుంది. తప్పు చేసిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. చట్టపరంగా శిక్షిస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతీకారం తీర్చుకుంటామంటే సమస్యలు వస్తాయి. నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా. మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు. ఇక సాగవని గట్టిగా సభ ద్వారా హెచ్చరిస్తున్నా.
మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైళ్లు తగలబెట్టారు. ఎన్నికల ఫలితాలు రాకముందు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసులో ఫైళ్లు అన్నీ తగలబెట్టారు. ఎన్నికలయ్యాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైళ్లను కరకట్టపైన తగలబెట్టారు. నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టరు ఆఫీసులో 22ఏ, అసైన్డ్ భూముల రికార్డులు తగలబెట్టారు. ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ కాదు ఉద్దేశపూర్వకంగా కాల్చేశారని తేలింది.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా పెరిగాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తప్పేమీ కాదు. ఆత్మకూరులో ఉన్నపళంగా కొన్ని కుటుంబాలను బహిష్కరణ చేస్తే పరామర్శించడానికి నాకు ఐదు ఏళ్లు సాధ్యం కాలేదు. వినుకొండలో హత్య జరిగిన ప్రదేశానికి జగన్ వెళ్తుంటే మేము అభ్యంతరం చెప్పలేదు. అదీ వాళ్లకు మాకు ఉన్న తేడా.
గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డంపడి గొడవ చేస్తున్నారంటే అది ఏవిధంగా సంస్కారమో నాకు అర్థం కావడం లేదు. ఫేక్ రాజకీయాలను సహించం. అబద్దాలు చెప్పి రాజకీయాలు చేయాలంటే ఉపేక్షించం. మేము అధికారంలోకి వచ్చాక 36 మందిని చంపామని చెప్పారు. 36మంది పేర్లు ఇమ్మంటే ఇవ్వలేదు.
మళ్లీ ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని ప్రమోట్ చేసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేదు. పెట్టుబడులు పెట్టేందుకు కొంతమంది రావడానికి ముందుకొచ్చినా ఇంకా సమస్యలున్నాయి. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లకు పెరిగాయి. అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. గత ప్రభుత్వ విధ్వంసంతో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడిరది. ఈ పరిస్థితులన్నీ చూసి భయపడి పారిపోవటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మాది. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ వస్తాం.
నేను వెళ్లేటప్పుడు సెక్యూరిటీ కోసం ఒక నిమిషం ట్రాఫిక్ ఆపితే చాలు. నేను ఐదు నిమిషాలు లేటైతే నష్టమేమీ లేదు. ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్లీ పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్ వేయడం చేయొద్దని చెప్తాను, చెప్తున్నా.
974 కిలోమీట్లర తీరప్రాంతం రాష్ట్రానికి ఉంది. పోర్టులు, ఏర్పాటు చేసుకోవాలి. రాత్రికి రాత్రే అన్నీ అయిపోతాయని చెప్పలేం.
మొట్టమొదటిసారి కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు వచ్చింది. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇచ్చారు. మొదటిసారి ప్రకాశం జిల్లాను కూడా ఇందులో పొందుపరచడం సంతోషం. సూపర్ సిక్స్ తప్పకుండా అమలు చేస్తాం. మొదటి సంతకం ఐదు అంశాలపై పెట్టాను. మెగా డీఎస్సీ.. 16,350 ఉద్యోగాలకు సంతకం చేశాం. వీలైనంత తొందరల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం.
పింఛన్లు రూ.3000 నుంచి రూ.4000, వికలాంగులకు రూన.3000 నుంచి రూ.6000 పెంచాం. వాలంటీర్లు లేకపోతే పించన్ల పంపిణీ అసాధ్యమన్నారు. కానీ సాధ్యమని నిరూపించాం.
అన్నా క్యాంటీన్లలో రూ.5కే భోజనం, ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. కనీసం వంద క్యాంటీన్లు ప్రారంభిస్తాం. తరువాత దశలో మిగిలిన క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. స్కిల్ సెన్సెస్.. దేశంలో ఎక్కడా చేయని విధంగా చేయబోతున్నాం. స్కిల్ సెన్సెస్ ఎందుకు చేయలేమన్న పట్టుదలతో నేను, పవన్ కలిసి రూపొందించాం.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఇది భయంకరమైన చట్టం. ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్థులకు కూడా ఏవిధంగా రక్షణ ఉండదో ఆ చట్టం చెబుతుంది. దీన్ని కూడా రద్దు చేస్తూ మొదటి సంతకం చేశాం. రాష్ట్రాభివృద్ధే ఏకైక లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ముందుకు సాగుతుంది.