- విదేశాలకు పారిపోవాలని యత్నించడం ఎందుకు?
- కొందరు నేతలు ఎక్కడ దాక్కున్నారో కూడా తెలవదు
- తప్పు చేశారు గనుకే రెడ్‌బుక్ చూసి వణికిపోతున్నారు
- గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీల స్వీకరణ
మంగళగిరి(చైతన్యరథం): రెడ్‌బుక్ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని…తప్పు చేసిన వారు తప్పించుకోలేరని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీం ద్ర అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్‌తో కలిసి ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తప్పు చేయనప్పుడు వైసీపీ నేతలకు భయమెందుకు? విదేశాల కు పారిపోవడానికి యత్నించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాల యంపై దాడి కేసులో దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోవాలని చూడగా లుక్ అవుట్ నోటీసులతో పోలీసులు అడ్డుకున్నారన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు ఎక్కడ దాక్కున్నారో తెలియదన్నారు.
తప్పు చేయబట్టే వైసీపీ నేతలు కలుగులోకి వెళ్లి దాక్కొంటున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో నుంచి పుట్టుకొచ్చిన రెడ్‌బుక్‌ను చూసి వైసీపీ నేతలు గజగజలాడుతున్నారన్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల శ్రేయుస్సు కోసం ఆలోచించే నాయకుడని తెలిపారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. లోకేష్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, మౌలానా ముస్తాక్ అహ్మద్‌తో పాటు పలువురు టీడీపీ నేతలతో ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లు తెలిపారు.
దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలి
అధికారం మదంతో నాడు జోగి రమేష్ పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తి వెన్ను మండలాల నుంచి రౌడీలు, వైసీపీ కార్యకర్తలను తీసుకువచ్చి చంద్రబాబు ఇంటిపై పైశాచికంగా దాడికి తెగబడ్డారని ఆ మండలాల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశా రు. దాడులకు తెగబడిన చీలంకుర్తి వెంకట శివకృష్ణ, ఈదా కిషోర్, ఆకన సాయికుమార్, పులగం నాయుడు, పాలపర్తి జాన్‌రత్నం, మండ్రు సాల్మన్‌రాజు, కారుమంచి కామేశ్వర రావు, పిండి వెంకన్నబాబు, మోటేపల్లి రత్నారావు, అల్లంశెట్టి నిరంజనరావులతో పాటు మిగిలిన వారి పేర్లు అర్జీలో పొందుపరిచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్ 19వ లైన్ నివాసితులు (ముస్లింకు కుటుంబాలు) వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది రౌడీ మూకలు వచ్చి తమ ఆడ వాళ్ల స్నానాల కోసం ఏర్పాటు చేసుకున్న బాత్ రూంలను ధ్వంసం చేసి స్థలాలను కబ్జా చేశారని వాపోయారు. తమను బెదిరించి తమ ఇళ్లకు కరెంట్ కట్ చేసి కరెంట్ మీటర్లు పీకించారని, తమకు న్యాయం చేయాలని కోరారు.
స్థలం కబ్జా చేసి వైసీపీ నేతలతో అక్రమంగా నిర్మాణాలు
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు దివ్యాంగులు తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వైసీపీ నేతలతో కలిసి అక్రమ నిర్మాణాలకు సహకరించిన సీఎస్‌ఆర్ స్వామితో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అర్జీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరు ద్యోగులను మభ్యపెట్టి కాలం గడిపినందున తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. డీఎస్సీ కోసం లక్షలు కోచింగ్‌లకు పెట్టి చితికిపోయామని దయచేసి ప్రకటించే డీఎస్సీలో కనీస వయసు పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికి ఐదేళ్లు పెంచి ఆదుకోవాలని నిరుద్యోగులు కోరారు.
ఉద్యోగాల నుంచి తొలగించి కేసులు పెట్టించారు
ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ`టీడీ సంస్థలో డీఆర్పీలుగా పనిచేస్తున్న తమను గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని, దళిత సంఘ నేతలతో న్యాయపోరాట దీక్ష చేయడంతో తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఆర్డర్ కాపీ ఇచ్చి విధుల్లోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోయారు. తాను ఉన్నంతవరకు విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని ప్రస్తుత డైరెక్టర్ జగదీష్ అన్నారని, తన బావ నాటి ఎమ్మెల్యే మొండితోక అరుణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బెదిరించి మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టి నాలుగురోజులు పోలీసులతో కొట్టించాడని వాపోయారు. తమకు కొట్టించిన జగదీ ష్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
తన పొలాన్ని వైసీపీ నేతలు వేరొకరి పేరుపై మార్చారు
జగన్‌రెడ్డి పెట్టించిన అక్రమ కేసులలో చంద్రబాబు జైల్లో నుంచి బయటకు వచ్చారన్న ఆనందంలో టపాసులు పేల్చితే రీ సర్వే పేరుతో వైసీపీ నేతలు తన పొలాన్ని ఎన్నికల ముందు మరొకరి పేరుపైకి మార్చారని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు పాచిగుంట పంచాయతీకి చెందిన వడివేలు వాపోయారు. వైసీపీ నేతల అరాచకాలను అరికట్టి తన పొలం తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. జలజీవన్ పథకంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పిళ్లికుంట తండాకు రూ.17 లక్షలు, నాగరాజు తం డా గ్రామానికి రూ.23 లక్షలు, మెట్టతోడు తండాకు రూ.23 లక్షలు మంజూరు అయిన ప్పటికీ ఆ నిధులను ఖర్చు చేయడం లేదని, దీంతో ఆ గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని నేడు ఆ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతలు స్థలం కబ్జా చేశారు
ఉండటానికి ఇల్లు లేక ఇంటి కోసం 2006లో స్థలం కొనుక్కుంటే దాన్ని కబ్జా చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మేకపాటి రాజగోపాల్ చొరవతో దానిని పోలీసులు నీరుగార్చా రని.. స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని… భూ ఆక్రమణపై విచారించి తన స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ కుడములదిన్నెపాడుకు చెందిన మల్లె వెంకటేశ్వరరావు వాపోయాడు.
గత ప్రభుత్వంలో బాపులపాడు మండలంలోని కోడూరుపాడు, అంపాపురం గ్రామాల్లో వైసీపీ నాయకుల అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి పంటలు పండిరచు కుంటు న్నారని వాటిని కాపాడాలని సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు.
అక్రమ కేసులు పెట్టించి వేధించారు
తాను మీడియాలో పనిచేస్తున్నానని.. తన యజమాని ఒక వార్తను పెట్టి గ్రూప్‌లో షేర్ చేయమంట షేర్ చేసినందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆదేశాలతో తనపై అక్రమం గా కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారని.. తనకు న్యాయం చేసి అక్రమ కేసు కొట్టే సేందుకు చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటుపాలెంకు చెందిన తోకల సురేష్ వాపోయాడు.
వీధి లైట్లకు బిల్లులు ఇప్పించాలి
టీడీపీ ప్రభుత్వంలో పల్లెల్లో అంధకారం తొలగించేందుకు వీధి లైట్ల ఏర్పాటుకు చంద్రన్న వెలుగు స్కీమ్ కింద శ్రీకారం చుట్టగా 2019లో వైసీపీ వచ్చిన తర్వాత చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదని… తనకు రావాల్సిన వర్క్ బిల్లులను వెంటనే ఇప్పించాలని విశాఖ జిల్లాకు చెందిన కె.వి.రమణబాబు వేడుకున్నాడు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం భల్లుఖానుడుపాలెం గ్రామ రైతులు తమ వరి పంట పొలాలు ఎండిపోతున్నా యని కాలువ లకు నీరు విడిచినా తూముకాడ, గుర్రపు డెక్క మేట వేయడంతో శివారు ప్రాంతాలకు నీరు రాక పంట మొత్తం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
సమస్యలపై వినతులు
వీటితో పాటు గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలు, పింఛన్‌దారుల సమస్యలు, పెండిరగ్ బిల్లుల సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు, ఎడ్యుకేషన్ లోన్ సమస్యలు, ఉద్యోగ బదిలీలు, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సీఎంఆర్‌ఎఫ్, రేషన్‌కార్డు సమస్యలు, పంట కాలువ సమస్యలు ఇలా వినతులతో అర్జీదారులు పోటెత్తారు.