- విశాఖలో ఆమెతో ఏమేం పనులు చేయించుకున్నాడు?
- సంబంధం లేకుంటే డీఎన్ఏ టెస్టుకు ఎందుకు వెనుకాడుతున్నాడు
- మదన్ వ్యాఖ్యలపై విజిలెన్స్ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి
- రెండు లాఠీ దెబ్బలు పడితే నిజాలు వాటంతటవే బయటకు వస్తాయి
నెల్లూరు(చైతన్యరథం): విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై టీడీపీ అధికార ప్రతిని ధి ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. మంగళవారం నెల్లూరు టీడీపీ కార్యాల యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాంతి భర్త మదన్మోహన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మదన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కేంద్ర విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మదన్.. హైదరాబాద్లో విజయసాయి ఇంటికి వెళ్లాడా..లేదా? అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా.. లేదా? అనే దానిపై గూగుల్ టేకౌట్ తీయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఆమెకు ఎందుకు డబ్బులు ఇచ్చా రు? విశాఖలో ఏమేం పనులు చేయించుకున్నారు? ఏ భూములు కొట్టేశారు? అనే విషయా లపై విచారణ చేస్తే బయటకు వస్తాయని తెలిపారు. అందుకే విజిలెన్స్ విచారణ అడుగుతు న్నామని చెప్పారు. ‘’విశాఖను దోచుకున్నది విజయసాయిరెడ్డేనని దీంతో అర్థమైపోయింది. ఒక పార్లమెంటు సభ్యుడు తనకు రూ.1.60 కోట్లు ఇచ్చాడని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చెబుతున్నాడు. దీనిపై సీబీఐ విచారణ కూడా వేయాలని అడుగుతున్నాం. విజయసాయిరెడ్డి తనకు డబ్బు ఇచ్చాడని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి. రెండు లాఠీ దెబ్బలు తగిలిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి’’ అని తెలిపారు. శాంతి వ్యవహారంలో తనకేమీ తెలియదని అంటున్నారని, అలాంటప్పుడు డీఎన్ఏ టెస్టుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్టులో ఏమీ లేకపోతే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు.