- ఐదేళ్లలో చేయాల్సిందంతా చేసి నేడు పెడబొబ్బలా?
- మీ పాపాలు, అవినీతి, అక్రమాలు బయటకు వస్తావు
- మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరావు ధ్వజం
విజయవాడ(చైతన్యరథం): ఐదేళ్లలో ఏ1గా జగన్మోహన్‌రెడ్డి, ఏ2గా సజ్జల చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు..తప్పు చేసిన వాళ్లంతా కటకటాలకు వెళ్లాల్సిందేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. ఏ1, ఏ2గా ఉండాల్సిన తనను 131వ నిందితుడిగా పిలవడం ఏమిటని సజ్జల బాధపడుతున్నాడు. కంగారెందుకు.. మీ పాపాలు, అవినీతి కేసులు అన్నీ బయటకు వస్తా యి. తప్పు చేసిన వాళ్లంతా కటకటాలకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఒక సైకో పాలనతో జగన్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులతో చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టించాడు..ఎంతోమంది నాయ కులను, ఎమ్మెల్యేలను జైలుకు పంపారు..నేడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండిప డ్డారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అడ్డగోలుగా వేలమందిని అరెస్టు చేశారు. రంగనాయకమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లి దుర్మార్గంగా అవమానకరంగా ప్రవర్తించారు.
టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీపై చేసిన దాడులకు లేక్కే లేదు. జోగి రమేష్ సహా చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వైసీపీ నాయకులందరూ శిక్ష అను భవించక తప్పదన్నారు. మీరు చేసిన అరాచకాలు, పాపాలకు మూల్యం చెల్లించుకుంటారని హితవుపలికారు. యష్ అమెరికా నుంచి వస్తే ఏ విధంగా సీఐడీ కార్యాలయానికి తీసుకు వెళ్లారు? ఎల్‌వోసీ నోటీసుల గురించి శ్రీరంగ నీతులు చెబుతావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎల్‌వోసీ నోటీసులు ఇచ్చారు. ఎంతోమంది దేశ విదేశాల నుంచి వచ్చే నాయకుల మీద మీరు అక్రమ కేసులు పెట్టారు. వేల కోట్లు అడ్డగోలుగా దోచుకున్న అవినీతి కేసులు ఉన్నాయి.. సీఐడీ విచారణలో వాస్తవాలు బయటకువస్తాయని, యంత్రాంగం చట్టబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉంది.. కేంద్రం నుంచి ఎంపీలు, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు నిధులు తీసుకువస్తున్నారు. చంద్రబాబు ఢల్లీి వెళ్లి ప్రధాని, హోంమంత్రి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పోల వరం, అమరావతి సహా ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. ప్రతి ఇంటికి జాబు ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త రావాలని ప్రతి ష్టాత్మక పాలసీలు తెచ్చారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నారు. బయట రాష్ట్రాలకు, దేశాలకు వెళుతున్న మన పిల్లలంతా మన రాష్ట్రంలోనే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అన్నివిధాలా ప్రభుత్వం పారదర్శకంగా ముందు కు వెళుతుందని స్పష్టం చేశారు. జగన్‌రెడ్డి ఐదేళ్లలో నాసిరకం మద్యంతో 72 శాతం అమ్మకాలు పెంచుకుని వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని రూ.99,413 కోట్లు దోచుకు న్నాడు. నాసిరకం మద్యం తాగి కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఐదేళ్లు ఉద్ధరించామని అబద్ధాలు, అసత్యాలతో ట్వీట్ల మీద ట్వీట్లు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రూ.3500 కోట్ల పిల్లల ఫీజుల బకాయిలు కడతానని కట్టకుండా వదిలేశావు..లక్షలాది మంది పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు ఎన్ని కుట్ర లు, కుతంత్రాలకు పాల్పడ్డా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు అన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.