.దళిత జాతి పరువుతీస్తున్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
.ఎంపీ మాధవ్ సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు?
.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
అమరావతి: డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా, అతనిని కాపాడే ప్రయత్నం చేయడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం జరిగిన విలే కరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ కూడా గోరంట్లను కాపాడే విధంగా మాట్లాడటం సిగ్గుమాలిన చర్యగా మాణిక్యరావు పేర్కొ న్నారు. రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా గోరంట్ల సిగ్గు, లజ్జ లేకుండా బరితెగించి స్వేచ్ఛగా తిరుగుతున్నాడని మండిపడ్డారు. గతంలో అనేక మంది దళితులు కాకి మాధవరావు, అర్జున్, గోపాల్, రత్నప్రభ, కత్తి చంద్రయ్య వంటివారు ఉన్నత పదవులు అధిరోహించి ఆ జాతికి, ఆ పదవులకు న్యాయం చేశారని, సునీల్ కుమార్ మాత్రం ఆజాతి, పదవుల పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మాధవ్ కులం పేరు ఎత్తి దూషించినప్పుడు ఈ సునీల్ కుమార్ ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప కూడా పోలీసుల పరువు తీసేవిధంగా మాట్లాడారని చెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వాస్త వం అవునా? కాదా? అని తేల్చవలసినవారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీ వీడియోను వెంటనే కేంద్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఎందుకు పంపించలేదని అడిగారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా కోపంగా ఉన్నారని, అది ఎంపీదే అని తేలితే కఠిన చర్యలు తీసు కుంటారని చెప్పిన సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నించారు. ఒక్క సినిమా తీస్తే దాన్ని వందల,వేల కాపీలు తీస్తారని, అంతమాత్రా న అవన్నీ డూప్లికేట్‌లు అవుతాయా అని ప్రశ్నించారు. ఎంపీ వీడియో ఎన్ని ఫోన్లలో తీసినా కాపీ అవుతుందే కానీ, మార్ఫింగ్ కాదనే విషయం సునీల్‌కుమార్‌కు తెలి యదా అని అడిగారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు, చీరాలలో సునీల్, చిత్తూరులో యువకుడ్ని చంపినప్పుడు, దళిత ఆడబిడ్డల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఈ సునీల్ కుమార్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.
ఎంపీ మాధవ్ సెల్‌ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన ప్పుడు అతని ఫోన్‌ను లాక్కొని అందులోని డేటాని ఎం దుకు డిలేట్ చేశారు? మాజీ ఐఏఎస్ అధికారి ఫోన్‌ని లాక్కున్నారు, సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినవారి వద్ద ఫోన్లు లాక్కున్నారు. ఈ డర్టీ మాధవ్ ఫోన్‌ను ఎందు కు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డిని నమ్ముకున్న అధికారులకి ఏ గతి పట్టిందో,శ్రీలక్ష్మి లాంటి అధికారులు కూడా జైలుకి వెళ్లిన విషయం మరచిపొవద్దని హెచ్చరించారు. జగన్‌రెడ్డిని నమ్ముకుంటే అధికారులు జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుందని సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ అన్న విషయాన్ని గుర్తుచేశారు. మీ బెదిరింపులకు టీడీపీ నేతలు ఎవరూ బెదరరని, గతంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర వంటివారిపై తప్పుడు కేసులు పెట్టినా ఎవరూ వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు. మీరు తప్పు పనిచేస్తే కోర్టులో మీ అంతు తేలుస్తామని హెచ్చ రించారు. దమ్ముంటే పట్టాభి మాటలకు, ఆయన ఇచ్చిన రిపోర్టులపై, ప్రతి పక్షాల ఆరోపణలపై సునీల్ కుమార్ కోర్టుకి వెళ్లాలని సవాల్ విసిరారు. గోరంట్ల వీడియోను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి రిపోర్టు తీసుకురావాలని డిమాండ్ చేశారు.