- ఎస్పీ ఫకీరప్పపై ఆరోపణలు లేవా?
- ఆయనపై చర్య తీసుకుంటారా?
- ఎస్సీననే నన్ను అన్యాయంగా తొలగించారు
- ఎన్హెచ్ఆర్సి కి ఫిర్యాదు చేస్తా
- లక్షలు దోచుకుంటున్న వారిని వదిలేసి నాపై చర్యలేల?
- వేటుకు గురైన ఎఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ సింహ గర్జన
అనంతపురం: గోరంట్ల మాధవ్‌పై లేని శిక్షలు తనకు వర్తిస్తాయా అని సర్వీసునుంచి ప్రభుత్వ వేటుకు గురైన ఎఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ప్లకార్డుతో నిరసన తెలిపిన ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్‌ను ఉద్యోగం నుంచి అధికారులు తొలగించారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్లకార్డులతో నిరసనలు తెలపడం తప్పా అని నిలదీశారు. ఏం తప్పు చేశానని తనను ఉద్యోగం నుంచి తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కారణంగానే కుట్రపూరితంగా తనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారంటూ ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ వాపోయారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్లకార్డులతో నిరసనలు తెలపడం తప్పా? అని నిలదీశారు. ఏం తప్పు చేశానని తనను ఉద్యోగం నుంచి తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల అనంతపురం జిల్లాకు సీఎం జగన్ వచ్చినరోజు భానుప్రకాశ్ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా ఆయనను డిస్మిస్ చేసింది. ‘‘కుట్ర పూరితంగానే నన్ను డిస్మిస్ చేశారు. నాకు జరిగిన అన్యాయంపై ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి ఫిర్యాదు చేస్తా. ఎవరిపైనాలేని అభియోగాలు నాపైనే ఉన్నాయా? ఎస్పీ ఫకీరప్పపై ఆరోపణలు లేవా.. మరి వారిపై చర్యలు తీసుకోరా? పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? రూ.లక్షలు వసూలు చేసుకొంటున్న పోలీసులపై చర్యలు శూన్యం. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని జరిగితే ఫకీరప్పే కారణం. నిరసన తెలుపుతూ ప్లకార్డు ప్రదర్శించినందుకే డిస్మిస్ చేశారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్రశ్నించడం తప్పా? ఉద్యోగం నుంచి నన్ను తొలగించి ఇబ్బంది పెట్టారు. గోరంట్ల మాధవ్‌పై లేని శిక్షలు నాకే వర్తిస్తాయా? డిస్మిస్ వార్తలు రాగానే ప్రతి కానిస్టేబుల్ నన్ను పరామర్శించారు. నా ఆందోళన వెనుక ఎలాంటి రాజకీయ కుట్రలేదు. మాకు రావాల్సిన బకాయిలపైనే నేను ప్రశ్నించా. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా’’నని ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్ తెలిపారు.