.ఒరిజినల్ వీడియో సేకరించాల్సిన బాధ్యత పోలీసులది కాదా?
.ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోతో రాష్ట్రం పరువు పోయింది
.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు
అమరావతి: ఎంపి గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో నిజాలు నిగ్గుతేల్చకుండా సిఐడి చీఫ్ సునీల్ కుమార్, అనంతపురం ఎస్పీ ఫకీరప్పలాంటి అధికారులు రోజుకో డ్రామా ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అందువల్ల దానిని ల్యాబ్ కు పంపడం కుదరదని పోలీసు అధికారులు ఏదేదో కాకమ్మ కథలు చెబుతున్నారు..ఒరిజినల్ వీడియో సంపాదించవలసిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోని చూసిన వారి సంఖ్య ప్రపంచ రికార్డును నెలకొల్పింది. వీడియో నాది కాదని గోరంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నాం, నిజాలు తెలిసిన తరువాత గోరంట్లపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా ఈ విషయమై విచారించాలని డీజీపీకి లేఖ రాసినట్లు చెప్పారు. దీంతో ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారని ప్రజలంతా భావించారు. ఒక ఎంపీ బట్టలు విప్పి ఒక మహిళను సెక్కువల్ గా వేధిస్తున్న వీడియో బయటకు వస్తే చర్య తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? అదేరోజు గోరంట్ల మాధవ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాని, ఒక కులాన్ని బండబూతులు తిట్టారు.
తప్పుడు పనిచేసిన ఎంపీని కాపాడటం కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మహిళల రక్షణలేకుండా పోయింది. మహిళలు భయపడిపోతున్నారు. ఒకడు గంటంటాడు, మరొకడు అరగంటం టాడు, ఇంకోడు బట్టలు విప్పి చూపిస్తాడు, మరొకడు మహిళా వాలంటీర్లను వేధిస్తాడు..ఇదేనా వైసీపీ నాయకులు మహిళలకు కల్పించే రక్షణ? ఎంపీ మాధవ్ ను వైసీపీ బర్త్ రఫ్ చేస్తారని ప్రజలంతా భావించారు కానీ అలా జరగలేదు. వీడియోని సాంకేతికంగా పరీక్షించే సామర్థ్యం లేని ఎస్సీ పక్కీరప్ప ముందుగానే దానిపై ఒక నిర్ణయం ప్రకటించడం ఏమిటి?ఎంపీ గోరంట్ల విషయమై జాతీయ మహిళా కమిషన్, పంజాబ్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ స్పందించారు. వా రు ప్రధానికి, లోక్ సభ స్పీకర్ కు, రాష్ట్ర డీజీపీకి లేఖలు రాశారు. విజయవాడలో సీఐడీ అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంసీ గోరంట్లకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇందులో ఆయనకు ఏంటి సంబంధం? ఒరిజినల్ వీడియో తేవలసిన బాధ్యత మీదే. ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అని దేశంలో అందరూ నమ్ముతున్నారు. అందులో ఉన్నది ఎవరో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసు అధికారులదేనని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు.
సునీల్ కుమార్… మీకు ఎన్ని నాలుకలు?
అమెరికాలోని ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదినకు గుర్తించబోని సునీల్ కుమార్ చెబుతాడు. ప్రైవేటు నివేదిక గుర్తించడమని చెబుతున్నపడు వారికి లేఖలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేసులు పెడతామని మమ్మల్ని బెదిరిస్తున్నావా? పోలీసులు, సీబీసీఐడీ, వైసిపి ఎంపీలంతా కలసి ఒక న్యూడిస్టు ఎంపీని కాపాడాలని చూడటం విచారకరం. హైదరాబాద్, విజయవాడతోపాటు దేశంలో చాలా ఫోరెన్సిక్ ల్యాబులు ఉన్నాయి. ఏదో ఒక ల్యాబ్ కు పంపితే ఒక్క రోజులో నివేదిక వస్తుంది. ఎందుకు పంపడం లేదు? నిజాన్ని బయటపెట్టిన మా మీద కేసులా? వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగే ప్రసక్తేలేదు. దీనిని మేం వదిలిపెట్టే ప్రసక్తిలేదు. జగన్ రెడ్డి నువ్వు ఎందుకు మాట్లాడటంలేదు? ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారో, లేదో సమాధానం చెప్పాలి.
అమెరికాలోని ల్యాబ్ ని మీరు గుర్తించకపోతే మీ ఇష్టం వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి. నిజం తేలిపోతుంది. సునీల్ కుమార్ నువ్వు చదివింది ఐపీఎస్సా, వైపిఎస్సా? తాడేపల్లి ఆదేశాలు పాటించి ఎంపీని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. మహిళా జాతీయ కమిషన్ లేఖపై మీరు స్పందించారా? ఏం చేస్తున్నారు? ఏ సంబంధం లేని సీఐడీ గోరంట్ల వీడియోపై మాట్లాడటం ఏంటి? తప్పుడు ఎంపీని ఇంకా ఎందుకు కొనసాగిస్తారని బోండా ఉమా ప్రశ్నించారు.