- జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలివ్వండి
- సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం
- రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించినా ముందుకు కదలటం లేదు
- పెండిరగ్‌లో ఉన్న డిశ్చార్జ్, వాయిదా పిటిషన్ల వివరాలు పట్టిక రూపంలో ఇవ్వాలి
- విచారణ ఈ నెల 13కు వాయిదా
ఢల్లీి (చైతన్యరథం): వైసీపీ అధినేత జగన్‌కు భారీ షాక్ తగిలింది. జగన్‌పై నమోదైన అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల విచారణలో ఇంత జాప్యానికి కారణాలేమిటని ప్రశ్నించింది. ఆయా అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు రెండు వారాల్లోగా అందించాలని సీబీఐ, ఈడీలకు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు సహా.. సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఒక పట్టిక రూపంలో ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కేసు విచారణకు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగడం లేదని, విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా.. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. నిందితులు రకరకాలుగా ఒకటి తర్వాత ఒకటిగా వేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే కేసులు ముందుకు సాగడం లేదని ఈ సందర్భంగా సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో సుప్రీంకోర్టు ఈ కేసుల వివరాలను రెండు వారాల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పెండిరగ్‌లో ఉన్న కేసుల వివరాలు, ప్రధానంగా జగన్ తరఫు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టులో దాఖలుచేసి.. ప్రస్తుతం విచారణ దశలో ఉన్న పిటిషన్ల వివరాలను తమకు అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ట్రయల్ కోర్టులో పెండిరగ్ పిటిషన్ల వివరాలన్నీ కూడా ధర్మానసం ముందు ఉంచాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి తగు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ విచారణ వేగంగా జరగడం లేదంటే దీనిపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడిరది.
అయితే ఈ కేసును జనవరికి వాయిదా వేయాలని జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరిస్తూ రెండు వారాలకు మించి సమయం ఇవ్వలేమని స్పష్టం చేయడం గమనార్హం. ఈ నెల 13న విచారణ జరుపుతామని చెబుతూ ఆ రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మొత్తం ప్రక్రియను ఆషామాషీగా(డోన్ట్ టేక్ ఇట్ లూజ్) తీసుకోవద్దని కూడా కోర్టు స్పష్టం చేయడం విశేషం.
కాగా గతంలో జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు రఘురామకృష్ణ రాజు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీజేఐగా జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులైన తర్వాత ఆయన బెంచ్ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే ఆయన బెంచ్‌లో మరో న్యాయమూర్తి అయిన సంజయ్ కుమార్ ఈ పిటిషన్‌ను నాట్ బిఫోర్ మీ అనడంతో వాయిదా పడిరది. దీంతో జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యి పన్నెండేళ్లు దాటిపోయింది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క కేసులో కూడా విచారణ ప్రారంభం కాలేదు. అప్పట్నుంచి కేసుల విచారణలు పెండిరగ్ పడుతూనే ఉన్నాయి. ఈ కేసుల్లో నిందితులు అందరూ ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూనే పోతున్నారు . దీని వల్ల అసలు విచారణ ప్రారంభం కావడం లేదు. ఈ డిశ్చార్జ్జి పిటిషన్లతోనే సమయం గడిచిపోతోంది. ఈ కేసుల్లో జగన్ కోర్టుకు హాజరు కావడం కూడా మానేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తదుపరి విచారణలో ఖరారయ్యే అవకాశం ఉంది.