- నీ తప్పులకు జనం ఛీకొట్టినా మారకుంటే ఎలా?
- జగన్‌ను నిలదీసిన విద్య మంత్రి లోకేష్
- ఏబీఎన్`ఆంధ్రజ్యోతిపై దాడికి ఖండన
అమరావతి (చైతన్య రథం): “జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం వైసీపీ రౌడీమూకలు హైదరాబాద్‌లో ఏబీఎన్`ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం.. ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టింది” అని రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మీడియా సంస్థపై దాడికి దిగిన వైసీపీ దుశ్చర్యను ఖండిస్తూ.. మంత్రి లోకేష్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. “నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబీఎన్`ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సాక్షి హైదరాబాద్ ఆఫీస్‌కు ఆంధ్రజ్యోతి ఎంత దూరమో.. ఆంధ్రజ్యోతికి సాక్షి కూడా అంతే దూరంలో ఉందన్న సంగతి విస్మరించొద్దు జగన్. మీడియా కథనాలపట్ల నిరసనలు తెలియజేసే పద్ధతి ఇది కాదు. మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు భయపడే రకం కాదు ఆంధ్రజ్యోతి`ఏబీఎన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ. మీకు గుర్తుండే ఉంటుంది.. మీ తండ్రి ఆంధ్రజ్యోతి కార్యాలయంపైకి బుల్డోజర్లు పంపించినా.. ఏబీఎన్ ఆర్కే వెనక్కి తగ్గలేదు. మీ తండ్రి పంపిన బుల్డోజర్లే వెనక్కి వెళ్లాయి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి. కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి. కథనం ప్రసారం చేస్తే తప్పయితే తప్పని చెప్పగలగాలి. ఇవేవీ మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులకు తెగబడటం అలవాటుగా మార్చుకున్నారు. ఇది తప్పు జగన్.. జనం ఛీకొట్టినా మారకపోతే ఎలా? మీ వెనక గూండాలు ఉండొచ్చు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెనుకా ముందూ ప్రజలున్నారు” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.












