- వడ్డీలేని రుణాల ఏర్పాటు
- రిజిస్ట్రేషన్ ప్రారంభించిన చంద్రబాబు
- కొత్త పథకాన్ని ఆహ్వానించిన విద్యార్థినులు
అమరావతి,చైతన్యరథం: సంపద సృష్టిలో ఆడపిల్లలను మరింత భాగాస్వాములను చేసేందుకు, వారికి సమాన అవకాశాలు మరింతగా కల్పించేం దుకు ‘కలలకు రెక్కలు’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో చదువు మానేసే ఆడిపిల్లలకు ఉన్నత విద్య అభ్యసించేలా, వారి వృతినైపుణ్యాన్ని పెంపొం దించుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు.
బుధవారం ఉండవల్లిలో విద్యార్థినులతో కలిసి సaశ్రీaశ్రీaసబతీవససaశ్రీబ.షశీఎ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్‌ను అధికారికంగా చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, అనుకున్నవి సాకారం చేసేందుకే కలలకు రెక్కలు అనే కార్య క్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ తర్వాత వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ప్రభుత్వ గ్యారంటీ ద్వారా వివిధ బ్యాంకుల నుండి వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామన్నారు.
‘‘కలలు కనండి..వాటిని నిజం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పారు. ఇంటర్ దాకా చదవుకుకుని పెద్దల ప్రోత్సాహం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆడిపిల్లలు చదువు మానేస్తున్నారు. అలాంటి వారు వివిధ కోర్సుల్లో చేరడానికి బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు. దీనికి వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది. వడ్డీ ఎంతైనా కడతాం. అది ఐదు వేలా…50 వేలా అనే దానితో సంబంధం లేదు. ఆడపిల్లలకు చదువుపరంగా ఇప్పుడు ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి కొనసాగుతాయి..ఇది కొత్తగా తీసుకొచ్చాం. మీ నాలెడ్జ్‌ని పెంపొందించే ఏ కోర్సులకైనా ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పుడు పేర్లు రిజస్టర్ చేయిస్తాం…ప్రభుత్వంలోకి వచ్చాక అమలు చేస్తాం.
ఇప్పటిదాకా ఇందులో 12 వేల మంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు’’ అని చంద్రబాబు తెలిపారు. సమాజంలో అందరి భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తెచ్చింది టీడీపీనే అన్నారు. ఎన్టీఆర్ మహిళల కు ఆస్తిలో సమానవాటా హక్కు తీసుకొచ్చా రన్నారు. జనాభాలో సగమున్న మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. ప్రత్యేకంగా మహిళలకు 22కొత్త పథకాలు తీసుకొచ్చా మన్నారు. విద్యకు ప్రాధాన్యమివ్వాలని ప్రతి కి.మీకి ఒక ఎలిమింటరీ స్కూల్, ప్రతి 3 కి.మీ అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కి.మీ హైస్కూల్, మండలానికి ఒక జూని యర్ కాలేజీ, డివిజన్‌కు ఇంజనీ రింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. ఉద్యోగాలు, కాలేజీ సీట్లలో మహిళలకు 33శాతం రిజర్వేష న్లు తీసుకొచ్చామన్నారు. దీంతో మహిళల జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు.
మహాశక్తి పథకాలతో మహిళల అభ్యున్నతికి కృషి
మహాశక్తిలో భాగంగా మహిళలకు 5 ప్రత్యేక పథకాలు ప్రకటించామన్నారు. చదవుకునే ప్రతి బిడ్డకు యేడాదికి రూ.15వేలు అందిస్తామన్నారు. గతంలో నా తల్లి పడుతున్న కష్టాలు చూసి సీఎం అయ్యాక దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ అందించామని, మళ్లీ రేట్లు పెరిగి గ్యాస్ కనెక్షన్లు తగ్గు తుండటంతో యేడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తా మన్నారు. 18 నుండి 59 మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.15 వందలు అందించ బోతున్నామన్నారు. ఇది వారికి పెట్టుబడి నిధిగా ఉంటుందన్నారు.
తాగునీటికి ఇబ్బంది పడుకుండా ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వాలని తలపెట్టామన్నారు. ఈ 5 కార్యక్రమాలు జయ ప్రదంగా నిర్వహిస్తే కుటుంబాలను మహిళలు పైకి తేవడానికి శక్తిని ఇస్తుందన్నారు. ‘మీ పిల్లలకు ఎంత భూమి, ఎంత డబ్బు ఇస్తారన్నది ముఖ్యం కాదు…ఎంత మంచి చదువు చదివిస్తారన్నది ముఖ్యం. టీడీపీ ఓట్లు చాలా విదేశాలకు వెళ్లిపోతున్నాయని నన్ను విమర్శించారు. పార్టీ నష్టపోయినా పర్వాలేదు..వారి జీవితాలు బాగుపడాలని ఆలోచించా’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.