- మహిళలను ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపడం సాధారణంగా మారిపోయింది
- వైసీపీ ఉన్మాదులను చట్టం ముందు నిలబెడతాం
- తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజం
అమరావతి(చైతన్యరథం): జగన్రెడ్డి అరాచక పాలనలో మహిళలను ట్రాక్టర్లతో తొక్కించి చంపడం సాధారణ విషయంగా మారిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన మహిళల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని శనివారం ఒక ప్రకటనలో అనిత విమర్శించారు. హక్కుల కోసం అడిగితే ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపేస్తున్నారు. శుక్రవారం పల్నాడులోని రెంటచింతల మండలం, మల్లవరంలో సామినిబాయి అనే గిరిజన మహిళను వైకాపా మద్దతుదారుడు మణికంఠ నాయక్ ట్రాక్టర్తో తొక్కించి చంపడం హృదయవిదారకం.
సైకో పాలనలో దళిత, గిరిజన మహిళలపై దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2020 ఆగష్టులో గుంటూరు జిల్లా, నకిరేకల్లు మండలం, శివాపురం తండాకు చెందిన మంత్రూబాయి అనే గిరిజన మహిళను వైకాపాకు చెందిన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్తో దాడి చేసి చంపాడు. గత ఏడాది జూన్లో ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, రావివారిపాలెంలో హనుమాయమ్మ అనే దళిత మహిళను కోటేశ్వరరావు అనే వైకాపా నాయకుడు ట్రాక్టర్తో ఇదే తరహాలో అతి దారుణంగా హత్య చేశాడు. జగన్ రెడ్డి పరిపాలనలో నోరు తెరిచి హక్కులు అడగడమే నేరమన్నట్లు వైకాపా నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. జగన్ రెడ్డి పైశాచికత్వం, సైకోయిజం కింది స్థాయి వైకాపా కార్యకర్తలకు కూడా సోకినట్లు ఉంది. దాహార్తి కోసం నీళ్లడితే మహిళ అని కూడా చూడకుండా ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా? మనం రాతియుగంలో ఉన్నామా లేక, నాగరిక యుగంలో ఉన్నామా? జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలను, నాయకులను అదుపులో పెట్టుకోవాలి. జగన్ రెడ్డిని నమ్ముకుని రెచ్చిపోతే వైకాపా నాయకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. ఉన్మాదంతో రెచ్చిపోతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వైకాపా నాయకులను రాబోయే తెదేపా-జనసేన ప్రభుత్వంలో చట్టం ముందు నిలబెడతామని అనిత హెచ్చరించారు.