- ప్రతిపక్ష నాయకునిగా జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గాలికి
- అధికార వైసీపీ కూకటివేళ్లతో పెకిలించ బడటం తథ్యం
అమరావతి, చైతన్యరథం: కుటుంబాలను విచ్ఛన్నం చేస్తూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే తిరిగి ఓట్లు అడుగుతానని గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి.. ఆ హామీని తుంగలో తొక్కి ఏ మొహం పెట్టుకొని మరలా ‘సిద్ధం’ అంటున్నావని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధులు వెలిబుచ్చారు. తేదేపా సీనియర్ నాయకుడు టీడీ జనార్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తేదేపా అధికార ప్రతినిధుల సమావేశంలో ముఖ్య మంత్రిగా జగన్‌రెడ్డి పాల్పడిన ప్రజా వంచన, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మూడు గంటల పాటు విస్తృతంగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకునిగా జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేసిన తీరు తెన్నులపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని అధికార ప్రతినిధులు అన్నారు.
ఇప్పటికే జగన్‌రెడ్డి వంచనాత్మక, విధ్వంసక పాలనతో విసిగివేసారిన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోందని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ వ్యతిరేకత తీవ్ర ప్రభంజనంగా మారుతుందని, అధికార వైసీపీ కూకటివేళ్లతో పెకిలించ బడటం తథ్యమని వారు స్పష్టం చేశారు.
తన ప్రారంభోపన్యాసంలో టీడీ జనార్ధన్ గత ఎన్నిక లకు ముందు జగన్‌రెడ్డి మొత్తం 730 హమీలు ఇచ్చారని, అందులో 85శాతం హామీలు ఏమాత్రం అమలుకు నోచుకోలేదని, కేవలం 21హామీలు మాత్రమే అమల య్యాయని ఆయన వివరించారు. అయినా నిస్సిగ్గుగా 99.05శాతం హామీలు అమలు చేశామని ప్రజలను మభ్యపెట్టడా నికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిరంతరం అబద్దాలు ఆడుతున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విధంగా హామీల అమలులో ప్రజలను పూర్తిగా మోసం చేసిన ముఖ్య మంత్రి జగన్‌రెడ్డికి రెండో ఛాన్స్ కోరే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పూర్తి అసత్యాలతో కూడిన దుష్ప్రచారానికి పాల్పడి ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ప్రజలను ప్రాధేయపడి అధికారం లోకి వచ్చిన వెంటనే తన అసలు రంగు బయట పెట్టుకున్నారని జనార్ధన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. నాటి చంద్రబాబు సత్పరిపాలన, నేటి దుష్పరి పాలనను బేరీజు వేసుకొని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారని, పూర్తిగా మోసానికి గురైన రాష్ట్ర ప్రజానీకం అతి త్వరలో మోసపు రెడ్డికి తగిన శాస్తి చేయ డానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నా రు. దొంగముద్దులతో నాడు ప్రజలను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెంపలు వాయించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో ముఖ్య మంత్రి చంద్రబాబు దార్శనికత తో రాష్ట్రం సాధించిన ప్రగతిని.. నేటి జగన్‌రెడ్డి ప్రభుత్వంలో కుక్కలు చింపిన విస్తరిలా తయారైన రాష్ట్ర పరిస్థితిని అవ లోకన చేసుకుంటూ ప్రజలు ఖిన్నులవుతు న్నారని, ఈ చీకటి త్వరలోనే తొలగిపోయి రాష్ట్రంలో చంద్రకాంతులు విరజిల్లుతాయ ని ఆయన స్పష్టం చేశారు.
ఎంతో ప్రాముఖ్యత కల్గిన బాధ్యతలు నిర్వహిస్తున్న తేదేపా అధికార ప్రతినిధులు రాష్ట్ర ప్రజలను మరింత చైతన్యవంతులు చేసే దిశలో గట్టి ప్రయత్నాలు చేయాలని, రానున్న రెండు నెలలు రాష్ట్ర ప్రజల బం గారు భవితకు బాటలు వేయడానికి అత్య ంత కీలకమని జనార్ధన్ అభిప్రాయపడ్డారు.
తేదేపా నాలెడ్జ్ కమిటీ ఛైర్మన్ గుర జాల మాల్యాద్రి మాట్లాడుతూ రానున్న రెండు నెలల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల వలసిన వివిధ అంశాల గురించి విపులం గా వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిత్యం వల్లెవేసే అబద్ధాలను సాక్ష్యాధారా లతో ఎండగట్టాలని, జగన్‌రెడ్డి పాల్ప డుతున్న సహజవనరుల దోపిడీ, భూ కబ్జాలు, అవినీతి, ఎస్‌సి, ఎస్‌టి, బీసీల వ్యతిరేక విధానాలు, రైతాంగం దోపిడీ, ఇరిగేషన్ వంటి పలు ప్రాధాన్యతా రంగా ల విధ్వంసాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తేదేపా అధికార ప్రతి నిధులు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్ధ, అరాచక అవినీతి పాలనకు సామాన్యుని జీవితం కకావిక లం అయిన తీరును వివరించి.. త్వరలో రానున్న ఎన్నికలలో వెల్లివిరుస్తున్న ప్రజా చైతన్యంతో తేదేపా విజయం ఖాయమని స్పష్టం చేశారు.