- దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
- టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు
అమరావతి : రాష్ట్రం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అకృ త్యాలు వైసీపీ ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కడుతున్నాయని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇన్ చార్జి మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ న్యూడ్ వీడియోతో అడ్డంగా దొరికిన ఢర్టీ ఎంపీ గోరంట్ల లాంటి వారిని జగన్రెడ్డి, పోలీసులు వెనకేసుకు రావడంతో తమనూ రక్షిస్తారనే ధీమాతో కిరాతకులు పేట్రేగి పోతున్నారు. కాకినాడలో నడి రోడ్డుపై దేవికహత్య, గుంటూరు జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచారం ఘటనలను మరువకముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన బాధాకరం. మహిళలపై నేరాలు, ఘోరాలను అరికట్టే విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి ఇలాంటి వరుస ఘటనలే నిదర్శనం. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో గ్యాంగ్ రేప్ ఘటన, దళిత యువతి రమ్య దారుణ హత్య, పాలడుగులో వివాహితపై అత్యాచారం ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటవి ఎందుకు జరుగుతాయి? మృగాళ్ల చేతిలో అన్యాయమై పోతున్న ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు? తూర్పుగోదావరి జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని వెంకట్రాజు డిమాండ్ చేశారు.