- సమష్టిగా పనిచేసిన బృందానికి అభినందనలు
- అమరావతి- బెంగుళూరు పేరు పెట్టాలని కోరుతున్నా
- గిన్నిస్ రికార్డులపై వర్చువల్ మీట్లో సీఎం చంద్రబాబు
- ఏపీ నుంచి హైవే ప్రాజెక్టులకు పూర్తి సహకారం
- సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఇది సాధ్యం
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు
అమరావతి(చైతన్యరథం): కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయిలో రికార్డులను సాధించటం గర్వకార ణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. బెంగుళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించడంపై సత్యసాయి. జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ల అందరితో కలిసి ఈఉమ్మడి విజయంలో వర్చువల్గా పాల్గొంటు న్నాం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ పరిచయమే. రాజ్పథ్ ఇన్ ఫ్రా కామ్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినంది స్తున్నాను. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్ కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారు. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించారు. జనవరి 6నుంచి 11 వరకూ ఏక బిగిన 52 కిలోమీటర్ల మేర 6 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. అలాగే 84.4కిలో మీటర్ల నాలుగు లేన్ల రహదారిని నిర్మించిన రికార్డును తిరగరాశారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్వేలు 10 వేల కిలోమీటర్ల మేరవేగంగా చేపడుతున్నారు. అమరావతి నుంచి బెంగుళూరుకు నేరుగా రోడ్డును వేయాలని నిర్ణయించాం. కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడారు అమరావతి-బెంగుళూరు రోడ్డుగా దీనిని పేరు పెట్టాలని కోరుతున్నాను. బృందంగా పనిచేసి విజయం సాధించిన అందరికీ అభినందనలు తెలిపారు.
ప్రాజెక్టులకు ఏపీ నుంచి పూర్తి సహకారం: గడ్కరీ
భగవాన్ సత్యసాయి ఆశీర్వాదంతో బెంగళూరు-విజయవాడ కారిడార్ నిర్మాణంలో ప్రపంచ రికార్డుల ను సాధించగలిగామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ‘సత్యసాయిజిల్లాలో బెంగుళూరు- విజయ వాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో 4గిన్నిస్ రికా ర్థులు సాధించటంపై అందరికీ అభినందనలు తెలిపా రు. ఎక్కడా నాణ్యతలో రాజీలేకుండా వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. కొత్త ఆవిష్కరణల ద్వారా జాతీయ రహ దారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. వరిగడ్డి ద్వారా బిటుమిన్ తయారీకి సంబంధించి కొత్త ఆవిష్కరణ చోటు చేసుకుంది. దానిని ఉపయోగించ టంలో ఏపీ కూడా భాగస్వామికావాలని కోరుతున్నాను. నైపుణ్యం, ఆవిష్కరణలు, మేధోపరమైన ఆలోచనలు నాణ్యత పెంచి వ్యయాన్ని తగ్గించాలి. అదే సమయంలో పర్యావరణాన్నికాపాడుతూ కాలుష్య రహిత విధానాలు అవలం బించాల్సి ఉంది. అందుకే జాతీయ రహదారుల సంస్థలో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించగలిగామని వివరించారు.
నిరంతర అభివృద్ధి, విజన్ దిశగానే చంద్రబాబు ఆలోచనలు
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వేగంగా పనులు చేపట్టేందుకు ఆస్కారం కలిగింది. జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టేందుకు పూర్తి సహకారం ఏపీ ప్రభుత్వం నుంచి అందుతోంది. వాస్తవానికి ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయాను. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా ఎదుగు తున్న ఆర్ధిక వ్యవస్థ, రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంది. రవాణా వ్యయం 9శాతం కంటే తక్కువగా పరిమితం అయ్యేలా మనం అంతా పనిచేయాల్సి ఉంది. లాజిస్టిక్స్ వ్యయం తగ్గటం ద్వారా మెరుగైన ఫలితాలను, వృద్ధిని సాధించేందుకు వీలు కలుగుతుంది. బెంగుళూరు విజయవాడ మార్గంలో ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను ఆమోదించేందుకు మేం సర్వదా సిద్ధం. ముఖ్యమంత్రి చంద్రబాబు తన జీవితాన్ని ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధికి అంకితం చేస్తూ పనిచేస్తారు. నిరంతరం అభివృద్ధి, విజన్ దిశగానే ఆయన ఆలోచనలు ఉంటాయి. రికార్డులను సాధించటంలో సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.














