- ఏ సర్వే చూసినా కూటమిదే ప్రభంజనం
- సైకో జగన్ దారుణ పరాజయం ఖాయం
- వైసీపీని శాశ్వతంగా గోతిలో పాతిపెట్టే సమయం వచ్చింది
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఉద్ఘాటన
అమరావతి: రాష్ట్రానికి సంబంధించి ఏ సర్వే నివేదిక చూసినా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిదే తిరుగులేని విజయం అని చెబుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇటీవల ఇండియాటుడే..నేడు ఏబీపీ, న్యూస్ 18 ఏ సర్వే గణాంకాలు వెల్లడైనా, ఏపీలో మూడు పార్టీల కూటమిదే తిరుగులేని విజయం అని తేల్చేస్తున్నాయన్నారు. సైకో జగన్ చేతిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి పునర్మిర్మాణం చేయగలదని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని జాతీయ మీడియా సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో టీడీపీ జనసేన విజయం సాధిస్తాయని గతంలో ఇండియా టుడే సర్వే వెల్లడిరచగా, ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏబీపీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) విజయం సాధిస్తాయని తేలింది. మరో జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఒపీనియన్ పోల్ సర్వేలోనూ 18 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడైంది. సైకో జగన్ గ్యాంగ్ ఏ విషవ్యూహం పన్నినా దారుణ పరాజయం నుంచి వైకాపా తప్పించుకోలేదని సర్వేలు కుండబద్దలు కొట్టాయి. ప్రజావ్యతిరేక తుఫానులో వైకాపాకి అంతిమయాత్ర ఖాయం. హలో వై నాట్ 175 జగన్ ..ఛలో లండన్ .. వైసీపీ జెండా పీకి శాశ్వతంగా గోతిలో పాతిపెట్టే సమయం ఆసన్నమైందని లోకేష్ స్పష్టం చేశారు.