• కోవూరు నియోజకవర్గం గుమ్మలదిబ్బ ఎస్టీ కాలనీలో యానాది సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చింది..కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదు.
• గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ కింద రుణాలు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది. ఈ ప్రభుత్వంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం లేదు.
• యానాదుల అభివృద్ధికి గతంలో ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, పంపుసెట్లు వంటివి అందాయి..ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని మాకు ఇవ్వడం లేదు.
• గతంలో ఉచిత విద్యుత్ మాకు అందేది..ఎరువులు కూడా అందేవి.
• విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రస్తుతం బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం.
• ఇటీవల కాలం నుండి యానాదులపై కారణం లేకుండా దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
• ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందేవి..కానీ ఇప్పుడు లేవు.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్టీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
• అధికారంలోకి వచ్చాక రూ.5,355 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన గిరిజన ద్రోహి జగన్ రెడ్డి.
• కాసుల్లేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి, యానాదులను మోసగిస్తున్నారు.
• టీడీపీ హయాంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి రుణాలు అందించాం.
• జగన్ సీఎం అయ్యాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు.
• ఎస్టీ యువత ఉన్నత చదువులు చదవుకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు. మేము వచ్చాక పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం.
• ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో యానాది కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వారి అభివృద్ధికి కృషిచేస్తాం.