- విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదన
- పక్క జిల్లాల్లో డ్యూటీలపై హోంగార్డుల వినతి
- జీతాలు రాలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గోడు
- టీడీపీ కేంద్ర కార్యాలయానికి వినతిపత్రాలు
- అర్జీలు స్వీకరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ అధికారంలోకి వస్తే తమను క్రమబద్ధీకరిస్తామని చెప్పి చేయకుండా మోసం చేసిందని విద్యుత్ ఉద్యోగులు వాపోయారు. పెంచిన అరియ ర్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. 25 వేల మంది కాం ట్రాక్టు కార్మికులం ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో డిస్కంలలో చాలీచాలని జీతంతో పనిచేస్తున్నా మని తమను పర్మినెంట్ చేసి యాజమాన్యాలనే నేరుగా వేతం ఇచ్చేలా చూడాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మంగళవారం కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బుచ్చిరాం ప్రసాద్‌లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్టు ఉద్యో గులు తమ సమస్యను వివరించారు. అలాగే ఏపీ జెన్‌కోలో కార్మిక సంఘాలకు గుర్తింపు ఇవ్వకుండా అణిచివేతకు పాల్పడుతోందని పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు అర్జీదారులు తరలివచ్చారు.
తాను పరుగుపందెంలో జిల్లా, రాష్ట్రస్థాయిలో 26 పతకాలు సాధించినట్లు.. పై స్థాయికి వెళ్లడానికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీ పెదనాల్సా బజారు చెందిన షేక్ అబ్దుల్లా విన్నవించాడు. తన తండ్రి తోపుడు బండితోనే తమ కుటుంబం బతుకుతోందని, తనకు ఒలంపిక్స్‌లో ఆడి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు క్రీడా శిక్షణకు నెలకు రూ.15 వేల వరకు ఖర్చు అవుతుందని సాయం చేయాలని కోరాడు.
తాము చిత్తూరు జిల్లాలో హోంగార్డులుగా పనిచేస్తున్నామని గత వైసీపీ ప్రభు త్వం ఆర్డర్ కారణంగా సొంత జిల్లాను వీడి 120 కిలోమీటర్ల అవతల అన్నమయ్య జిల్లాలో తమను పనిచేయమని చెబుతున్నారని చిత్తూరు నుంచి వచ్చిన హోంగార్డులు వాపోయారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను వీడి మరొక జిల్లాలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉందని సొంత జిల్లాలోనే ఉండేలా సహకరించాలని మంత్రికి వినతిపత్రం అందిచారు. దీనిపై మంత్రి స్పందించి చిత్తూరు జిల్లా ఎస్సీకి ఫోన్ చేసి సమస్య పరిష్కా రానికి కృషి చేశారు.
గత ఐదేళ్లు వైసీపీకి కొమ్ముకాసిన చంద్రమౌళి అనే వ్యక్తి నేడు టీడీపీలో చేరి వైసీపీ నేతలతో తిరుగుతూ ఎస్సీలకు పదవులు దక్కకుండా చేస్తున్నారని దాంతో టీడీపీకి ఎస్సీలు దూరం అయ్యే అవకాశం ఉందని పార్టీ పెద్దలు నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలని ప్రశాకం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శింగనపాలెం కు చెందిన టీడీపీ నేత శివరామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వంలో లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు తన హోటల్‌ను మూసివేయించి మాస్క్ పెట్టుకోలేదని తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, కేసులను తొలగించాలని తంబళ్లపల్లె వాసి ప్రకాష్‌బాబు విజ్ఞప్తి చేశాడు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీ మాకాంబాపురం గ్రామానికి చెందిన చెంగల్రాయరెడ్డి సమస్యను వివరిస్తూ గ్రామానికి చెందిన పశువుల మేత పోరంబోకు, కాలువ పోరంబోకు కుంటల పొలాలను హరిరామ్ అనే వ్యక్తి ఆక్రమించుకుకుని తమ పొలానికి దారి లేకుండా చేశాడని ఫిర్యాదు చేశాడు.
1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లుగా ఉన్న తమను 2023లో నియమించారని, ఉపాధి కోసం వేరు వేరు జిల్లాలకు వెళ్లి స్థిరపడిన తమకు పరీక్ష రాసిన జిల్లాల్లో ఉద్యోగాలు కల్పించడం వల్ల కుటుంబాలకు దూరమై వయసు రీత్యా అనారోగ్య సమస్యల తో ఇబ్బందులు పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని విన్నవించుకున్నారు.
తమకు గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు వచ్చేలా చూడాలని ఆప్కాస్ ద్వారా విశాఖ కేజీహెచ్, అనకాపల్లి మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న గ్రూప్ 4 ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు అధికారులతో మాట్లాడి సమస్య ను తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు.
తాము సహకార బ్యాంకుల అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేశామని, తమకు రిటైర్‌మెంట్‌కు ముందు మూడేళ్లు మాత్రమే బ్యాంకు స్కేల్ ఇచ్చారని డీసీసీ స్పెషల్ క్యాడర్ రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు. పనిచేసిన 35 ఏళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గుల్లా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. తాము 1000 మంది ఉద్యోగులం ఉన్నామని న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.